Discover and read the best of Twitter Threads about #Rayalaseema

Most recents (10)

24 November 2020: #Weather Warning

Source: @Indiametdept

Heavy to very #rainfall with extremely heavy falls very likely at isolated places over #Tamilnadu, #Puducherry & #Karaikal and heavy rainfall at isolated places over Coastal #AndhraPradesh & #Yanam and #Rayalaseema.
24 November 2020: #Weather Warning

Source: @Indiametdept

Dense #fog very likely at isolated places over #Nagaland, #Manipur, #Mizoram & #Tripura and Moderate fog at isolated places over #Odisha, #ArunachalPradesh and #Assam & #Meghalaya.
24 November 2020: #Weather Warning

Source:
@Indiametdept

(1) Squally weather (wind speed reaching 65-75 kmph gusting to 85 kmph) likely to prevail over Southwest & adjoining Westcentral #BayofBengal
Read 5 tweets
గర్వాంగా చెప్పరా సీమనాదని
రాయలేలిన రతనాల సీమనాదని

కరువు నేల నీదంటే
రాళ్ళ బతుకు మీదంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
రతనాల రాశులమ్మిన నేల నాదని

నీ మాటే మొరటంటే
నీ యాసే వెగటంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
తెలుగు భాష తొలి శాసన గడ్డ నాదని Image
నీ వాళ్ళు రౌడీలని
ఫ్యాక్షనిస్టులు మీరంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
దేవుళ్ళు కొలువైన పుణ్య భూమి నాదని

వెనుకబాటు నీదని
పేదరికం మీదంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
చల్లకొస్తే పాడిపడ్డ దానమిచ్చు చరితమాదని Image
సదువుసంజెలు లేవని
అనాగరికులు మీరంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
ఈడ ఆలిసెల్లి తప్ప ఆడోళ్లు అమ్మలక్కలేనని

గర్వాంగా చెప్పరా సీమనాదని
రాయలేలిన రతనాల సీమనాదని

#సీమకవిత #Rayalaseema #Kadapa #Kurnool #Anantapur #Chittoor #Tirupati Image
Read 3 tweets
సీమపై ప్రేమ

పుట్టిన నేల మీద అభిమానం, ఈపేరుతో ఒక అకౌంట్ నడిపేలా చేసింది. ఆ అభిమానం కేవలం అకౌంట్ నడపడంతో ఆగలేదు. ఏవో నాలుగు కాపీ పోస్టులు, ఫోటోలు వేసి ఊరుకునేలా చేయలేదు

కరువు చరిత్ర కళ్ళముందు కదలాడేలా
యాస పరిమళం గుభాళించేలా

ఆవేశంతో కథలు రాయిచింది
ఆనందంతో కవితలు చెప్పించింది
అందమైన సీమను అందరికీ పరిచయం చేయడానికి ఫొటోగ్రాఫర్ ని చేసింది
మరుగునపడిన సీమ చరిత్రను వెలికి తీయడానికి చరిత్రకారుణ్ణి చేసింది

సంస్కృతీ మూలాలు వెతికే ఆంథ్రోపోలోజిస్ట్ ను చేసింది
మారుమూల ప్రాంతాలు తిరిగే దేశదిమ్మరిని చేసింది
సీమను కించపరిచేవారి వైఖరి గర్హించేలా చేసింది
సీమ అభివృద్ధి గొంతుకయ్యేలా మార్చింది

మొత్తంగా జీవితంలో ఒక భాగమయ్యింది

#రాయలసీమ #Rayalaseema
Read 3 tweets
2020-21 ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్లో - రాయలసీమ ప్రస్తావన

ఆర్ధికమంత్రి గారి ప్రసంగపాఠం నుండి కొన్నిముఖ్య విషయాలు క్లుప్తంగా

గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహనా కొరకే. అధికారిక / ఖచ్చితమైన సమాచారం కోసం

apfinance.gov.in/Budget2021/ సందర్శించగలరు
గిరిజనప్రాంతాల్లో ఆరోగ్య సేవలు -శ్రీశైలంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రతిపాదన (6ఆసుపత్రుల్లో ఒకటి)-Para65

తిరుపతిలో స్కిల్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదన - 30స్కిల్స్ కళాశాలలు ఏర్పాటు ప్రతిపాదన (25 -ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి + 4IIITలలో + 1 JNTUపులివెందులలో P-75
రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్ ఏర్పాటు
గోదావరి -పెన్నా నదుల అనుసంధానం
గాలేరు-నగరి, హంద్రీ -నీవా, గండికోట, వెలిగొండ మొ. ప్రభుత్వ ప్రాధాన్యతలే
(పేరా -82, 83, 84)

కడపలో స్టీల్ ప్లాంట్ తయారీ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ హై గ్రేడ్ స్టీల్ లిమిటెడ్ ప్రారంభం-ఓర్ నిమిత్తం NMDC తో ఒప్పందం-P101
Read 4 tweets
పాపవినాశనం

శ్రీవారు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో ప్రతీ రాయి, రప్ప, వాగు - వంక, కొండ - కోన పవిత్రమే. తిరుమలలో ఉన్న అనేక దివ్య తీర్థాలలో ఒకటి పాపవినాశనం తీర్థం. ఈ తీర్థంలో స్నానామాచరిస్తే సకల పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ తీర్థానికి 'పాపవినాశనం' అన్న పేరు వచ్చింది.
ఒకప్పుడు స్వామివారి కైంకర్యాలకు పాపవినాశనం జలాన్నే వాడేవారట.

సంకీర్తనాచార్యుడు అన్నమయ్య 'పావినాశనం' తీర్థాన్ని తన కీర్తనలలో ఈ విధంగా వర్ణించాడు

ప్రఖ్యాతి చెందిన పాపవినాశనం తీర్థంలో పాపాలు పగిలి పరుతున్నాయని ఒక చోట, పామరులను అమరులు చేయు పాపవినాశనం అని మరో చోట రాశారు. Image
“అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము” అన్న కీర్తనలో ( అధ్యాత్మ సంకీర్తన - రేకు: 37-1 సంపుటము: 1-227) అన్నమయ్య 'పావినాశనం' ఈ విధంగా వర్ణించాడు

ప్రాకటంబైన పాపవినాశనములోని
భరితమగు దురితములు పగిలి పారుచునుండ
ఆకాశగంగ తోయములు సోఁకిన భవము
లంతంత వీఁడి పారఁగను

#Ravishing_Rayalaseema Image
Read 8 tweets
రాయలసీమకు సంబంధించి నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి రాస్తూ వస్తున్నాను. అయితే మీ జిల్లా గురించి, ఆలయాల గురించి, నదుల గురించి ఇలా సీమకు సంబంధించి అనేక అంశాల మీద మీకు సందేహాలు ఉండొచ్చు.

అందుకే మీరు సీమగురించి ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారో తెలియజేస్తే
వాటి గురించి సమాచారం సేకరించి, తెలుసుకుని, పరిశోధించి రాస్తాను. వెంటనే రాయలేకపోయినా వీలువెంబడి సమాచారం దొరికినప్పుడు రాస్తాను.

మీరు ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారో #KnowRayalaseema ఉపయోగించి అడగగలరు. నాకు వెతకడానికి అనువుగా ఉంటుంది.

రాజకీయ / పర్సనల్ / abusive విషయాలు అడగకండి
గమనిక : Rayalaseema అంటే నాకు passion. అంతే తప్ప నేను పరిశోధకున్నో, చరిత్రకారున్నో కాదు. మీరు అడిగిన చాలా విషయాలకు నేను సమాచారం సేకరించలేకపోవచ్చు కూడా. తెలియనివి, తెలుసుకోవడానికి ప్రయత్నించినా సమాచారం దొరకని విషయాల గురించి తెలియదనే చెప్తాను. సహకరించగలరు.

ధన్యవాదాలు #Rayalaseema
Read 3 tweets
ఒంటిమిట్ట కోదండ రామాలయం

గుత్తి, పామిడి, గండికోట, ఒంటిమిట్ట క్షేత్రాల మధ్య సామీప్యం ఏమిటి?
ఒంటిమిట్టకి ఆ పేరు ఎలా వచ్చింది?
రఘువీరా! జానకీనాయకా! అనే మకుటంతో శ్రీమదొంటిమిట్ట రఘువీర శతక కర్త ఎవరు?
ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణం రాత్రిపూట ఎందుకు జరుగుతుంది?
(1/n)
#Vontimitta #Kadapa
ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని మీద అన్నమాచార్యులు రచించిన కీర్తనలు ఏవి?

భారాతావనిలో అత్యంత గొప్ప ఆలయాల్లో ఒకటి (One of the Greatest Pagodas in the whole of India) అని ఒంటిమిట్ట క్షేత్రాన్ని కొనియాడిన విదేశీయుడు ఎవరు?

ఒంటిమిట్టలో భక్తులకు బావి తవ్వించిన ముస్లిం పాలకుడు ఎవరు?
2/n
రామ తీర్థం – లక్ష్మణ తీర్థం

త్రేతాయుగంలో వనవాస సమయంలో దండకారణ్యలో సీతారామలక్ష్మణులు సంచరిస్తుండగా, సీతమ్మవారి దప్పిక తీర్చడానికి రాములవారు ఎక్కుపెట్టిన బాణం వాళ్ల భూమిలోనుంచి ఉబికి వచ్చిన నీరు వల్ల ఇక్కడ రెండు మడుగులు ఏర్పడ్డాయి. అవే రామ తీర్థం మరియు లక్ష్మణ తీర్థం.

3/n
Read 25 tweets
Pushpagiri Vaibhavam
పుష్పగిరి వైభవం

Shivatandavam
శివతాండవం
Nataraja Vaibhavam
నటరాజ వైభవం
Dakshinamurthy
దక్షిణామూర్తి
Read 15 tweets
ఒక ధర్మ ప్రభువు కథ

రాజ్యాలందు రామరాజ్యం వేరు
ప్రభువులందు ధర్మ ప్రభువులు వేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరు

గర్భిణీ స్త్రీతో పనిచేయిస్తే కడుపులో పెరిగే బిడ్డకు సైతం కూలీ ఇవ్వాలి అని శాసనం వేయించాడు ఒక ధర్మప్రభువు. తారలు మారినా ఇప్పటికీ ఆ ధర్మాన్ని తప్పడం లేదు అక్కడి ప్రజలు.
కర్ణుడికి కవచకుండలాల్ల " ధర్మం, ధైర్యం, దానగుణం" అనేవి సీమ బిడ్డలకు పుట్టుకతో వచ్చే సుగుణాలు. అందుకే ఇక్కడి పాలకులు కూడా ధర్మ ప్రభువులుగా పేరు తెచ్చుకున్నారు.

నంద్యాల తిమ్మరాజు / నల్ల తిమ్మరాజు అవుకు సంస్థానం పాలకుడు. నంద్యాల రాజులలో ముఖ్యుడు. కర్నూలు జిల్లలో ఉంది అవుకు.
విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన నాలుగవ వంశం ఆరవీటి వంశస్థుడు. శ్రీకృష్ణదేవరాయలకు బంధువు. కృష్ణదేవరాయల అల్లుడు, ఆరవీటి అలియ రామరాయలకు స్వయానా పెదనాన్న.

ఈ నల్ల తిమ్మరాజే క్రీ.శ 1538లో అవుకు చెరువు తవ్వించాడు. దేశంలోని పెద్ద చెరువులలో ఇదీ ఒకటి.
Read 5 tweets
Our Hon’ble @AndhraPradeshCM @ysjagan is very clear on Capital issue: 1) We want overall State Devel, 2) To this end we have announced de-centralised model of devel with #Kurnool, #Vizag & #Vijayawada all included - 1 @yvsubbareddymp @VSReddy_MP @BugganaR @YSRCParty #APCapitals
#Kurnool as judiciary Center is good & will develop #Rayalaseema region & since easy driving distance from #Hyderabad, AP clients will be able to get the best legal services from legal fraternity based in Hyd and slowly a second legal Center w jobs will develop in Kurnool -2
We remain committed to #Vijayawada / #Amaravati region. Our Govt w bring new Invsts in Inland Logistics, Medicine, Agri, Edu etc to Vja region & further develop these sectors here which have natural locational advantage here. Farmers & their lands will be our top priority here -3
Read 11 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!