Discover and read the best of Twitter Threads about #Rayalaseema_History

Most recents (2)

మనం మరచిన మరో పరిశ్రమ - తుంగభద్రా ఇండస్ట్రీస్ లిమిటెడ్

కర్నూలు జిల్లా సొనామసూరి, బెనీషా (బనగానపల్లె / బంగినపల్లి మామిడి), పుల్లారెడ్డి స్వీట్స్ ఎంత ప్రఖ్యాతి చెందినవో అందరికీ తెలుసు. కానీ

ఒకప్పుడు కర్నూలులో ఉన్న ఒక పరిశ్రమ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యేవని మీకు తెలుసా ?
ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో అతి పెద్ద నూనె తయారీ పరిశ్రమ కర్నూలులో ఉండేదన్న విషయం మీకు తెలుసా ?

ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు కానీ, ‘తుషార్ వనస్పతి’ అంటే ఒకప్పుడు పేరొందిన బ్రాండ్. దేశంలో వనస్పతి రంగంలో ‘డాల్డా’ బ్రాండ్ తిరుగులేని ఆధిక్యంలో ఉండగానే,
దానికి ధీటుగా నిలబడి దేశవ్యాప్తంగా పేరొందిన దేశీయ వనస్పతి బ్రాండ్ ‘తుషార్’. అయితే ఈ తుషార్ వనస్పతి కర్నూలులోనే తయారయ్యేది. ఆ పరిశ్రమ పేరు తుంగభద్రా ఇండస్ట్రీస్ లిమిటెడ్.

వనస్పతి : భారతీయ వంటలలో నెయ్యికి ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసందే. అయితే నెయ్యి ధర చాలా ఎక్కువ.
Read 14 tweets
రాయలసీమలోని కడప పట్టణానికి, భాగ్యనగరంలోని నాంపల్లికి సంబంధం ఏమిటి?

కడప పట్టణానికే నేకనామ్ ఖాన్ పేట / నేకనాంబాద్ అనే పేరు కూడా ఉండేది. విజయనగర పతనానంతరం కడప ప్రాంతాన్ని నేక్ నామ్ ఖాన్ తనపేరుతో కడప గ్రామం వద్ద మరో గ్రామాన్ని కట్టించాడు. అదే నేకనామ్ ఖాన్ పేట / నేకనాంబాద్ గ్రామం. ImageImage
అయితే మాయణా నవాబులు కడపను (నేకనామ్ ఖాన్ పేట / నేకనాంబాద్ ను ) రాజధానిగా ఎంచుకొని నేకనాంబాద్ ను విస్తరించి, పటిష్టపరిచి దానికి కూడా కడప అని పేరు పెట్టారు. అదే తర్వాత తర్వాత పట్టణంగా ఎదిగి శహర్ కడపగా (కడప పట్టణంగా)మారింది.

#సీమచరిత్ర #Rayalaseema_History
ఈ నేక్ నామ్ ఖాన్ అసలు పేరు రజా కులీ బేగ్. పర్షియా (ఇరాన్ ) ప్రాంతానికి చెందినవాడు. అక్కడి నుండి డెక్కన్ ఒచ్చి గోల్కొండ కుతుబ్షాల వద్ద అంచలంచలుగా ఎదిగా వారి సైన్యాధిపతి కూడా అయ్యాడు. ఇతను మంచి యోధుడే కాక, మంచి కవి కూడా. అందుకే అతనికి నేక్ నామ్ ఖాన్ అనే బిరుదు ఇవ్వబడింది.
Read 4 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!