Discover and read the best of Twitter Threads about #anantapur

Most recents (8)

A tweet thread with the list of Hospitals treating #COVID19 Positive people in each district in #AndhraPradesh.

If you are looking for immediate assistance/help call 104 toll-free number i.e., available 24 X 7
#APFightsCorona #COVID19Pandemic
List of Hospitals treating #COVID19 Positive people in #Anantapur district.
#APFightsCorona #COVID19Pandemic
List of Hospitals treating #COVID19 Positive people in #Chittoor district.
#APFightsCorona #COVID19Pandemic
Read 14 tweets
గర్వాంగా చెప్పరా సీమనాదని
రాయలేలిన రతనాల సీమనాదని

కరువు నేల నీదంటే
రాళ్ళ బతుకు మీదంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
రతనాల రాశులమ్మిన నేల నాదని

నీ మాటే మొరటంటే
నీ యాసే వెగటంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
తెలుగు భాష తొలి శాసన గడ్డ నాదని Image
నీ వాళ్ళు రౌడీలని
ఫ్యాక్షనిస్టులు మీరంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
దేవుళ్ళు కొలువైన పుణ్య భూమి నాదని

వెనుకబాటు నీదని
పేదరికం మీదంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
చల్లకొస్తే పాడిపడ్డ దానమిచ్చు చరితమాదని Image
సదువుసంజెలు లేవని
అనాగరికులు మీరంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
ఈడ ఆలిసెల్లి తప్ప ఆడోళ్లు అమ్మలక్కలేనని

గర్వాంగా చెప్పరా సీమనాదని
రాయలేలిన రతనాల సీమనాదని

#సీమకవిత #Rayalaseema #Kadapa #Kurnool #Anantapur #Chittoor #Tirupati Image
Read 3 tweets
రక్షా బంధన్ - రాఖీ పూర్ణిమ - రాయలసీమ దేవాలయాలు

సోదర - సోదరి బాంధవ్యాలు, ఆడబిడ్డకు సారె పెట్టే సంప్రదాయాలు మానవులలోనే కాదు దేవుళ్లలోనూ చూడొచ్చు. అటువంటి కొన్ని ఆలయాలు రాయలసీమలో Image
మోపూరు భైరవేశ్వర ఆలయం (భైరవుడి సోదరి అక్కపప్పూరమ్మ ) - కడప జిల్లా

భైరవాచలం మెట్ల మార్గం ప్రారంభంలోనే భైరవేశ్వరుడి సోదరి అక్కపప్పూరమ్మ ఆలయం ఉంటుంది. భైరవేశ్వర స్వామి విగ్రహం రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో అక్కపప్పూరమ్మ తలపై చేయి పెట్టగా,
ఆగ్రహించిన భైరవేశ్వరుడు భైరవాచలం వదిలి వెళ్లాలని ఆదేశించాడని అందుకే అక్కపప్పూరమ్మ ఆలయం కింద ఉందని చెబుతారు.అయితే స్వామి తరువాత శాంతించి అక్కపప్పూరమ్మకు తొలి పూజ భాగ్యం కల్పించాడని స్థల పురాణం.

చిత్రం : నల్లచెరువుపల్లిలో అక్కపప్పూరమ్మ ఆలయం Image
Read 8 tweets
నావికుల తిరుగుబాటులో పాల్గొన్న మన స్వాతంత్య్ర సమరయోధులు - రాజన్న

1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అఖిల భారత కాంగ్రెస్ నేతలు, స్వాతంత్ర్య సమరయోధులు ఖైదు చేయబడ్డారు. అలా కొంతకాలం స్వాతంత్ర్య పోరాటంలో స్తబ్దత నెలకొన్న సమయంలో రెండు ఘటనలు భారతదేశంలో బ్రిటీషు వారి మూలాలను ImageImage
కదిలించి దేశాన్ని స్వాతంత్య్రం వైపు నడిపించాయి. ఒకటి సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ పోరాటం కాగా రెండోది 1946లో భారత నావికా దళంలో తిరుగుబాటు

రాయల్ ఇండియన్ నేవీ (RIN Matinee)తిరుగుబాటులో పాల్గొన్న వారిలో అనంతపురం జిల్లాకు చెందిన రాజన్న గారు కూడా ఉన్నారు
రాజన్న గారిది అనంతపురం జిల్లా కదిరి మండలం కాళసముద్రం గ్రామం. SSLC వరకు చదివి రాయల్ ఇండియన్ నేవీలో చేరారు.

1946 ఫిబ్రవరి 18న తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా నాటి బాంబాయి హార్బరులోని తల్వార్ ఓడకు(HMIS Tawar) చెందిన రేటింగ్స్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు.
Read 6 tweets
నీటి ప్రాజెక్టులు-వాటి పేర్లు

తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య
తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలంసంజీవరెడ్డి
దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య
తొలి కడప లోక్సభ సభ్యుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి
జలరంగ నిపుణులు కుడితిపూడి శ్రీరామకృష్ణయ్య

వీరి మధ్యన ఉన్న సారూప్యం ఏమిటి ? Image
వివిధ కాలాలు, రంగాలకు చెందిన వీరి పేరు చిరస్థాయిగా నిలిచేలా సీమలోని అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు వీరి పేరు పెట్టడం జరిగింది. సాధారణంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకువాడుకలో ఒక పేరు (సాధారణంగా ఆ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం/నది పేరు మొ. ) ఉంటె అధికారికంగా మరో పేరు ఉంటుంది.
ఆ ప్రాంతానికి నీరు తేవడానికి కృషి చేసిన రాజకీయ నాయకుడి పేరు అయుండొచ్చు లేదా ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి అయుండొచ్చు లేదా ఆ ప్రాంతానికి సంబంధం లేని గొప్ప వ్యక్తి అయినా అయుండొచ్చు. ఇప్పుడు రాయలసీమలోని కొన్ని ప్రధాన ప్రాజెక్టులకు ఎవరెవరి పేర్లున్నాయో చూద్దాం
Read 21 tweets
రాయలసీమ - దశావతార ఆలయాలు

“ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవత్గీతలో.
అంటే ధర్మాన్నిస్థాపించడంకోసం/నిలబెట్టడంకోసం ప్రతీయుగంలోనూఅవతరిస్తానుఅనిఅర్థం

దశావతారాలలోని రామ, కృష్ణ, నరసింహ అవతారాలకు విశేషంగా ఆలయాలుఉన్నాయి.
కానీ. మత్స్య, కూర్మ వంటి అవతారాలకు దేశం మొత్తంలో చాలా అరుదుగా మాత్రమే ఆలయాలు ఉన్నాయి.

అయితే దశావతారాలకు సంబంధించి రాయలసీమలోని అత్యంత ప్రసిద్ధి చెందిన, అత్యంత అరుదైన ఆలయాల విశేషాలు

మత్స్యావతారం:

సృష్టికర్త బ్రహ్మ వద్ద నుండి సోమకాసురుడు వేదాలు తస్కరించి సముద్రగర్భంలో దాక్కుంటే
శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి వధించి వేదాలను రక్షిస్తాడు.

దశావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతార మూర్తికి ఆలయాలు అత్యంత అరుదు. అటువంటి ఆలయాలలో ఒకటి చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం నాగలాపురం పట్టణంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం.
Read 23 tweets
పెనుకొండ : తఖ్త్ - ఏ -ముబారక్

1652లో పెనుకొండ ను విజయనగర రాజుల దళవాయి కోనేటి నాయుడు పాలించేవాడు. అప్పటికే గండికోట, గుత్తి వంటి దుర్గాలు గోల్కొండ పాలకుల వశమయ్యాయి. అయితే పెనుకొండ దుర్గాన్ని వశం చేసుకోవడానికి బీజాపూర్ సుల్తాన్ తన సర్దారైన ఖాన్ మహమ్మద్ ను పురమాయించాడు. Image
ఖాన్ ముహమ్మద్ మార్చి 1652లో పెనుకొండ దుర్గాన్ని ముట్టడించాడు. కోనేటి నాయుడు పెనుకొండ దుర్గాన్ని ఖాన్ ముహమ్మద్ కి అప్పగించగా, ఖాన్ ముహమ్మద్ కోనేటి నాయుడిని కుందుర్పి దుర్గం ఉంచుకునేందుకు అంగీకరించాడు. తన వశమైన పెనుగొండ దుర్గానికి ఖాన్ ముహమ్మద్ “తఖ్త్-ఏ-ముబారక్” అని పేరు పెట్టాడు.
(అంటే అభినందనల / శుభాకాంక్షల సింహాసనం అని అర్థం ).

1668లో బీజాపూర్ సుల్తానుల ప్రతినిథిగా పెనుగొండను పాలించిన అబ్దుల్ హసన్ పెనుగొండలో ఒక మసీదు కట్టించాడు. 1686 వరకు పెనుగొండ బీజాపూర్ సుల్తానుల అధీనంలో ఉండేది. తరువాత మొఘలుల ఆధీనంలోకి వెళ్లింది.
Read 4 tweets
రాయలసీమ నదులు - ద్వితీయ భాగం
మొదటి భాగంలో కృష్ణా, తుంగభద్రా, పెన్నా, బాహుదా, కుందేరు, స్వర్ణముఖి, పాపాఘ్ని, హగరి, మాండవ్య నదుల గురించి రాయడమైనది. ఈ భాగంలో చిత్రావతి, సగిలేరు, పావనీ, అర్జున, గార్గేయ, కౌండిన్య, పాండ్య, అరుణా, కాళంగి నదుల గురించి, సీమ నదీ సాహిత్యం గురించి రాశాను1/n
చిత్రావతి - దేవ కన్యా అని కూడా అంటారు - పవిత్ర పుట్టపర్తి క్షేత్రం ఈ నదీ తీరంలోనే ఉంది. చిత్రావతి నది పెన్నా నదికి ఉపనది. గండికోట వద్ద చిత్రావతి నది పెన్నా నదిలో కలుస్తుంది. ఈ నది మీదే పర్నపల్లి వద్ద చిత్రావతి బాలన్సింగ్ రిజర్వాయర్ ఉన్నది. 2/n
సగిలేరు(స్వర్ణబాహు) - సకిలినాటి సీమలో (గిద్దలూరు -బద్వేల్ ప్రాంతం ) ప్రవహించే నది కాబట్టి సగిలేరు అయింది. ఈ నదినే స్వర్ణబాహు అని కూడా అంటారు. ఈ నది పెన్నా నదికి ఉపనది. ఎగువ సగిలేరు, దిగువ సగిలేరు ప్రాజెక్టులు ఈ నది మీద ఉన్నవి. 3/n
Read 13 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!