Discover and read the best of Twitter Threads about #kadapa

Most recents (24)

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ( 1608 - 1693) 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపుడు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. తీర్థ యాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు Image
పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబలకు కాశీ పట్టణంలో జన్మించి, కర్ణాటక రాష్ట్రం, స్కందగిరి పర్వతసానువులో స్థితమైన పాపాగ్ని మఠ (ప్రస్తుతం ఇది చిక్‌బళ్లాపూర్ జిల్లా లోని కళవారహళ్లిలో ఉన్నది) అధిపతులు వీరభోజయాచార్య, వీరపాపమాంబలవద్ద పెరిగిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి,
వైఎస్ఆర్ కడప జిల్లా లోని కందిమల్లాయపల్లిలో చాలాకాలం నివసించి సజీవ సమాధి నిష్ఠనొందాడు. వీరబ్రహ్మము వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ
Read 5 tweets
#Thread

⚠️ ⛔️ What Rayalacheruvu lake breaches ? ⛔️ ⚠️

Located south west to #Tirupati with a capacity of 0.48 TMC.

Let me give an example recently happened, #Cheyyeru flood in #Kadapa district.

#Pincha project storage Capacity is just 0.33 TMC n has only 58,000 cusecs ImageImageImageImage
Capacity to release through crest gates during peak flood.

On other hand #Annamayya project downstream to #Pincha project has 2.2 TMC of storage capacity and it can release 2,25,000cusecs through its crest gates.

Last Thursday night #Annamayya project received 1,80,000 cusecs
From its own catchment and its tributaries Mandavya and Bahuda rivers.

#Pincha project ring bund broken on Thursday wee hours, around 1,40,000 cusecs gushed down to #Annamayya project. So totally 3,20,000 inflow recorded at #Annamayya project.
Then it Simply collapsed
Read 5 tweets
నేడు కార్తీక మాసం ప్రారంభం మరియు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు కేదార్ నాథ్ నందు పునః నిర్మించిన జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల సమాధికి పూజాధికాలు నిర్వహించి, వారి విగ్రహాన్ని ఆవిష్కరించిన శుభ సందర్భంగా
#Kedarnath #Pushpagiri #AdiShankaracharya
#KedarnathDham #Kadapa
కడప జిల్లా శ్రీ కామాక్షి సమేత శ్రీ వైద్యనాధ స్వామి దేవస్థానం పుష్పగిరి గ్రామం వల్లూరు మండలం లో దేవస్థానం నందు నిర్వహించిన వేడుకలలో పాల్గొన్నాను. 🙏
#AdiShankaracharya
#Kedarnath #Pushpagiri
*ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలలోని ఏకైక శంకర ఆద్వైత పీఠం పుష్పగిరి పీఠం. ఇక్కడ అద్వైత పీఠాన్ని ఏర్పాటు చేసి, శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. చంద్రమౌళీశ్వర లింగాన్ని పీఠంలో ఉంచారు. పుష్పగిరి కడపజిల్లాలోని చెన్నూరుకు సమీపంలో పెన్నానది ఒడ్డున ఉన్న ప్రముఖ హరిహర క్షేత్రం
Read 16 tweets
దీపావళి✨ పండుగ పటాకులు కాల్చేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు....! #Deepavali #Diwali #Happy
దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.
💥దీపావళి రోజున ముఖ్యంగా చిన్న పిల్లలు పటాకులు కాల్చే ముందు కాటన్ దుస్తులు దరించాలి. Image
సిల్క్, నైలాన్, సింతటిక్ దుస్తులు వేసుకోకూడది.
💥పెద్దల పర్యవేక్షణలోనే పటాకులు కాల్చాలి.
💥 చిచ్చుబుడ్డీలు, రాకెట్‌లు, పటాకులు చేతిలో ఉంచుకొని కాల్చరాదు.
💥పటాకులు కాల్చే ప్రదేశంలో నీరు అందుబాటులో ఉంచుకోవడమే కాకుండా.. Image
💥ఇంటి దగ్గర కాకుండా ఓపెన్ గ్రౌండ్‌లో కాల్చడం మంచిదంటున్నారు. ప్రధానంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, కరెంటు తీగలు ఉండే స్థలాలలో కాల్చవద్దు.
💥కంటి అద్దాలు, కాళ్ళకు చెప్పులు, చెవులో దూది ఉంచుకొని కాల్చాలి. టపాసులతో జాగ్రత్త!! 🏥🚑 Image
Read 4 tweets
మే దినోత్సవం లేదా మే డే (#MayDay)
ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. చాలా దేశాలలో మే దినం, #అంతర్జాతీయ_కార్మిక_దినోత్సవం లేదా కార్మిక దినోత్సవం తో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి. #InternationalLabourDay
భారతదేశంలో 1947లో మనకు స్వాతంత్ర్యం లబించేంత వరకు భూస్వామ్య వ్యవస్థవుండేది. ఈ వ్యవస్థలో రాజులు తమకు సైనికులను, ఉంపుడుక తెలను సరఫరా చేసినందుకుగాను, విలువైన కానుకలను సమర్పించుకున్నందుకు గాను కొంతమంది వ్యక్తులకు భూములను బహుమానంగా ఇచ్చేవారు. ఈ భూముల్లో వారు శిస్తులు వసూలు చేసి
కొంతభాగం రాజుకి చెల్లించగా మిగిలినది తమ సాంతానికి వాడుకొనేవారు. ఈ భూములను రైతులకు యిచ్చి వ్యవసాయం చేయించి ఫలసాయం తాము తీసుకొనేవారు. అన్ని వృత్తులవాళ్ళు ఎండనక, వాననక భూస్వాములకు పనులు చేసిపెట్టే వాళ్ళు. ఇందుకు వారికి ఎటువంటి ప్రతిఫలం లభించేదికాదు. దీనిని వెట్టి చాకిరీ అనేవాళ్ళు.
Read 19 tweets
#ColumnistsDay
✍️📰 కాలమిస్ట్ దినోత్సవం

కాలమిస్ట్, వ్యాసాలు రాసే పత్రికా రచయిత, పత్రికకు క్రమం తప్పక వ్యాసాలు రాచే రచయిత.
#columnist
కాలమిస్టు అంటే ఎవరు? సమాధానాలు ఇలా కొన్నింటిని చెప్పుకోవచ్చు - తలపండిన వాడు, జీవన సారాన్ని పుక్కిటపట్టిన వాడు, శాస్త్రాలను అవపోశన పట్టినవాడు,
గురువుగా భావింపబడేవాడు, బతికినన్నాళ్లు రాసినా తరగని మేధోసంపత్తి గలవాడు, ప్రలోభాలకు లొంగనివాడు, వజ్రసంకల్పుడు. ఇప్పుడు రాస్తున్న వారిలో ఇందులో ఒక్క గుణమున్నా పాఠకులు ఆ ‘కాలమ్’ని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. వారికోసం ప్రపంచాన్ని గాలించైనా వెదికి పట్టుకోవాలి.
రానున్న తరంలో మన భాష నిలువాలన్నా, మన సంస్కృతి పరిఢవిల్లాలన్నా, పత్రికలు తమ పాత్రను నిభాయించామని గర్వపడాలనుకున్నా ఇలాంటి శీర్షికలే ప్రాణాధారం.
Read 23 tweets
సంక్రాంతి పండుగ రోజు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పతంగుల పండుగను ఆనందంగా గడుపుతారు. సాధారణంగా ఒక చతురస్రాకారపు కాగితం, రెండు వెదురు బద్దలు, తగినంత దారం ఉపయోగించి వినోదం కోసం గాలిలోకి ఎగరవేసే ఒక ఆట వస్తువు పతంగి లేదా గాలిపటం (#Kite).
#InternationalKitesDay Image
పతంగులను ఆంధ్రులు ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఎగురవేస్తారు. ఉత్తరాయణంలో జరుపుకునే అంతర్జాతీయ గాలిపటాల పండుగ అతిపెద్ద వేడుకగా భావించబడుతుంది. గాలిపటాల పండుగ వస్తుందన్న కొద్ది నెలల ముందే గుజరాత్‍లోని ఇళ్లలో గాలిపటాల తయారీ ప్రారంభమవుతుంది.
ఆకాశమే హద్దుగా వివిధ రకాల పతంగులను ఎగరేస్తూ ఇంద్రధన్సుల్లోని వర్ణాలను ఆకాశంలో నిలుపుతారు. సంక్రాంతి పండుగ రోజు పతంగులను ఎగురేసేందుకు ప్రత్యేకమైన దారాలను తయారు చేయడం, మాంజాలుగా రూపుదిద్ది పోటీల్లో పాల్గొనడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
Read 9 tweets
కడప చరిత్రలో ఒక చీకటి దినం-బుగ్గవంక వరదలు

19 ఏళ్ల తరువాత నిండిన కడప బుగ్గవంక ప్రాజెక్టు - 19 ఏళ్ల ముందు 2001లో బుగ్గ వంక వరదలు సృష్టించిన భీభత్సం జిల్లా వాసులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఎన్నో చేదుజ్ఞాపకాలు మిగిల్చిన 2001 బుగ్గవంక వరదల గురించి కథనం👇

#సీమచరిత్ర #Kadapa #Buggavanka Image
కడప పట్టణంగా గుండా ప్రవహించే నది బుగ్గవంక. పెన్నా నదికి ఉపనది అయిన బుగ్గవంక పై ఆనకట్ట కూడా ఉంది. కడపలో ప్రాణ నష్టం సంభవించే వరదలు అత్యంత అరుదు. కానీ ఇటీవల చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో కడపలో భీభత్సం సృష్టించిన అల్లర్లు అంటే మాత్రం 2001 బుగ్గవంక వరదల గురించే చెప్పుకోవాలి.
కడపవాసులకి 2001 బుగ్గవంక వరదలు తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుంది.

బుగ్గవంక ఆనకట్ట కడప పట్టణానికి 7 కిమీల ఎగువన ఉంది. ఆనకట్ట కట్టినప్పటి నుండి పెద్ద వరద ఎప్పుడూ రాకపోవడం,ఇతర కారణాల వల్ల బుగ్గవంక నది కడప పట్టణంలో ఆక్రమణకు గురయ్యింది. నదీ తీరం మొత్తం గృహాలు, దుకాణాలు వెలిశాయి
Read 7 tweets
గర్వాంగా చెప్పరా సీమనాదని
రాయలేలిన రతనాల సీమనాదని

కరువు నేల నీదంటే
రాళ్ళ బతుకు మీదంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
రతనాల రాశులమ్మిన నేల నాదని

నీ మాటే మొరటంటే
నీ యాసే వెగటంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
తెలుగు భాష తొలి శాసన గడ్డ నాదని Image
నీ వాళ్ళు రౌడీలని
ఫ్యాక్షనిస్టులు మీరంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
దేవుళ్ళు కొలువైన పుణ్య భూమి నాదని

వెనుకబాటు నీదని
పేదరికం మీదంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
చల్లకొస్తే పాడిపడ్డ దానమిచ్చు చరితమాదని Image
సదువుసంజెలు లేవని
అనాగరికులు మీరంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
ఈడ ఆలిసెల్లి తప్ప ఆడోళ్లు అమ్మలక్కలేనని

గర్వాంగా చెప్పరా సీమనాదని
రాయలేలిన రతనాల సీమనాదని

#సీమకవిత #Rayalaseema #Kadapa #Kurnool #Anantapur #Chittoor #Tirupati Image
Read 3 tweets
రక్షా బంధన్ - రాఖీ పూర్ణిమ - రాయలసీమ దేవాలయాలు

సోదర - సోదరి బాంధవ్యాలు, ఆడబిడ్డకు సారె పెట్టే సంప్రదాయాలు మానవులలోనే కాదు దేవుళ్లలోనూ చూడొచ్చు. అటువంటి కొన్ని ఆలయాలు రాయలసీమలో Image
మోపూరు భైరవేశ్వర ఆలయం (భైరవుడి సోదరి అక్కపప్పూరమ్మ ) - కడప జిల్లా

భైరవాచలం మెట్ల మార్గం ప్రారంభంలోనే భైరవేశ్వరుడి సోదరి అక్కపప్పూరమ్మ ఆలయం ఉంటుంది. భైరవేశ్వర స్వామి విగ్రహం రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో అక్కపప్పూరమ్మ తలపై చేయి పెట్టగా,
ఆగ్రహించిన భైరవేశ్వరుడు భైరవాచలం వదిలి వెళ్లాలని ఆదేశించాడని అందుకే అక్కపప్పూరమ్మ ఆలయం కింద ఉందని చెబుతారు.అయితే స్వామి తరువాత శాంతించి అక్కపప్పూరమ్మకు తొలి పూజ భాగ్యం కల్పించాడని స్థల పురాణం.

చిత్రం : నల్లచెరువుపల్లిలో అక్కపప్పూరమ్మ ఆలయం Image
Read 8 tweets
ఎరికల్ - ఎర్రగుడిపాడు

'ఎరికల్' అన్న పదానికి తెలుగు భాషా చరిత్రలో, తెలుగువారి చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలి తెలుగు శాసనం కలమళ్ల శాసనం ఎరికల్ ముతురాజు ధనుంజయుడు వేయించగా, ఎర్రగుడిపాడు శాసనంలో కూడా 'స్వస్తిశ్రీ ఎరికల్ముత్తుర్రాజు' అని ఉంటుంది.
తొట్టతొలి తెలుగు శాసనాల్లో (కలమళ్ళ, ఎర్రగుడిపాడు, తిప్పలూరు, ఇందుకూరు మొ.) మనకు ప్రధానంగా మూడు సారూప్యతలు కనిపిస్తాయి.

1. అన్నీ కడప జిల్లాలో లభ్యమైనవి
2. అన్నీ రేనాటి చోళులు వేయించినవి
3. వాటిల్లో 'ఎరికల్' అన్న పదం ఉండటం

రేనాటి ప్రాంతాన్ని పాలించిన చోళులు కాబట్టి రేనాటి చోళులు
వీరి రాజధాని చెప్పలి. అయితే వీరి శాసనాలలో ఎక్కువగా కనిపించే 'ఎరిగల్' వీరి తొలి రాజధాని అయ్యుంటుంది అని చరిత్రకారుల అభిప్రాయం. ఇప్పుడు 'ఎరిగల్' పేరుతో ఏ ఊరు లేదు. రేనాడులో ఉన్న ఊరు, రేనాటి చోడులకు సంబంధించిన ఊరు అని తప్ప మరే ఇతర ఆధారాలు లేవు.

వీటి ఆధారంగా చరిత్రకారులు
Read 13 tweets
విగ్రహం చెప్పే చరిత్ర : పుష్పగిరి - లకులీశుడు

లకులీశ / నకులీశ - లకుటము అంటే దుడ్డుకఱ్ఱ (దండము). లకులీశుడు అంటే లకుట ధారియైన ఈశ్వరుడు అని అర్థం. శైవమతంలో కాపాలిక, కాలముఖ, పాశుపత శైవం వంటి అనేక శాఖలు ఉన్నాయి. పాశుపత శైవం ఈశాఖలన్నిటిలోకి పురాతనమైనది. Image
కాలముఖ శైవం పాశుపత శైవం నుండి ఉద్భవించిందే.లకులీశుడు పాశుపత శైవమతం వ్యవస్థాపకుడని ఒక వాదన. లకులీశుడి కంటే ముందు నుండే పాశుపత శైవం ఉనికిలో ఉందని, పాశుపత మతాన్ని లకులీశుడు బాగా వ్యాప్తిలోకి తెచ్చాడని మరో వాదన. కాలముఖ శైవాన్ని ఆచరించేవారు కూడా లకులీశుడిని ఆరాధించేవారు.
లకులీశుడి విగ్రహాలు దేశమంతటా పాశుపత / కాలముఖ శైవం బాగా ప్రాచుర్యం ఉన్న ప్రదేశాలలో చూడవచ్చు. లకులీశుడు శివుని అవతారం అని మరో భావన ఉంది.

కడప జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం పుష్పగిరి. శైవులకు పుష్పగిరి నివృత్తి సంగమం ఇక్కడ ప్రాణాలు విడిస్తే పునర్జన్మ ఉండదని శైవులు
Read 6 tweets
కడప జిల్లాలోని వెలిగల్లు రిజర్వాయర్ పేరును "వైయస్సార్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్" గా మారుస్తూ 26.06.2020 GO MS-27 విడుదల

పెన్నా ఉపనది పాపాగ్ని నదిమీద ఉన్న ప్రాజెక్టు వెలిగల్లు రిజర్వాయర్

రాయలసీమలోని ఇతర ప్రాజెక్టుల పేర్ల వివరాలు 👇 (1/3)

ImageImage
వెలిగల్లు ప్రాజెక్టుతో గాలివీడు, రామాపురం, లక్కిరెడ్డి పల్లె మండలాలకు ప్రయోజనం

ప్రాజెక్టు కోసం లక్కిరెడ్డిపల్లె మాజీ ప్రజాప్రతినిధి R రాజగోపాల్ రెడ్డి గారి తీవ్ర కృషి

1995 నవంబర్ 29న నాటి ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు గారిచే శంఖుస్థాపన

2000లో CWC అనుమతులు (2/3) #Veligallu ImageImage
29.9.2006 న G.O MS No.75 ద్వారా వెలిగల్లు ప్రాజెక్టుకు 208.72 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతులు మంజూరు

22.12.2008 న ప్రాజెక్టు నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం (3/3) #Papaghni #Rayachoty #Kadapa

newindianexpress.com/states/andhra-…

newindianexpress.com/states/andhra-…
Read 4 tweets
నీటి ప్రాజెక్టులు-వాటి పేర్లు

తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య
తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలంసంజీవరెడ్డి
దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య
తొలి కడప లోక్సభ సభ్యుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి
జలరంగ నిపుణులు కుడితిపూడి శ్రీరామకృష్ణయ్య

వీరి మధ్యన ఉన్న సారూప్యం ఏమిటి ? Image
వివిధ కాలాలు, రంగాలకు చెందిన వీరి పేరు చిరస్థాయిగా నిలిచేలా సీమలోని అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు వీరి పేరు పెట్టడం జరిగింది. సాధారణంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకువాడుకలో ఒక పేరు (సాధారణంగా ఆ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం/నది పేరు మొ. ) ఉంటె అధికారికంగా మరో పేరు ఉంటుంది.
ఆ ప్రాంతానికి నీరు తేవడానికి కృషి చేసిన రాజకీయ నాయకుడి పేరు అయుండొచ్చు లేదా ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి అయుండొచ్చు లేదా ఆ ప్రాంతానికి సంబంధం లేని గొప్ప వ్యక్తి అయినా అయుండొచ్చు. ఇప్పుడు రాయలసీమలోని కొన్ని ప్రధాన ప్రాజెక్టులకు ఎవరెవరి పేర్లున్నాయో చూద్దాం
Read 21 tweets
ప్రొద్దుటూరు అమ్మవారిశాల

కడప జిల్లాకు ప్రొద్దుటూరు వాణిజ్య కేంద్రం వంటిది. బంగారం, బట్టలు, ఫైనాన్స్ వ్యాపారానికి ప్రొద్దుటూరు కేంద్రం. అందుకే అందరూ ప్రొద్దుటూరుకు పుత్తడిపురి / పసిడిపురి అని కూడా అంటారు. అటువంటి ప్రొద్దుటూరుకి మరో పేరు కూడా ఉంది. అదే “రెండవ మైసూరు”. ImageImage
దసరా ఉత్సవాలు కర్ణాటకలోని మైసూరులో ఎంత ఘనంగా జరుగుతాయో, ఇటువైపు ప్రొద్దుటూరులో అంత ఘనంగా జరుగుతాయి.

వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరులో ఆర్య వైశ్య కుటుంబాలు అధికంగానే ఉంటాయి. ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు.
ప్రొద్దుటూరులోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం (స్థానికంగా అమ్మవారిశాల అని పిలుస్తారు ) అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం. వందకుపైగా సంవత్సరాల చరిత్ర ఈ ఆలయం సొంతం

#KnowRayalaseema #Kadapa_Temples #Rayalaseema_Temples #Proddutur #Kadapa #Ravishing_Rayalaseema
Read 7 tweets
రాయలసీమ - దశావతార ఆలయాలు

“ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవత్గీతలో.
అంటే ధర్మాన్నిస్థాపించడంకోసం/నిలబెట్టడంకోసం ప్రతీయుగంలోనూఅవతరిస్తానుఅనిఅర్థం

దశావతారాలలోని రామ, కృష్ణ, నరసింహ అవతారాలకు విశేషంగా ఆలయాలుఉన్నాయి.
కానీ. మత్స్య, కూర్మ వంటి అవతారాలకు దేశం మొత్తంలో చాలా అరుదుగా మాత్రమే ఆలయాలు ఉన్నాయి.

అయితే దశావతారాలకు సంబంధించి రాయలసీమలోని అత్యంత ప్రసిద్ధి చెందిన, అత్యంత అరుదైన ఆలయాల విశేషాలు

మత్స్యావతారం:

సృష్టికర్త బ్రహ్మ వద్ద నుండి సోమకాసురుడు వేదాలు తస్కరించి సముద్రగర్భంలో దాక్కుంటే
శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి వధించి వేదాలను రక్షిస్తాడు.

దశావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతార మూర్తికి ఆలయాలు అత్యంత అరుదు. అటువంటి ఆలయాలలో ఒకటి చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం నాగలాపురం పట్టణంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం.
Read 23 tweets
నాలుగు కడపలు

(దేవుని కడప (దేవర కడప), పాత కడప / కాపు కడప, శహర్ కడప (నేకనామ్ ఖాన్ పేట / నేకనాంబాద్), కడప సుబా

ప్రస్తుత రాయలసీమలో కడప అన్నికంటే ముందుఏర్పడిన జిల్లా. అదేవిధంగా కడప పట్టణం కూడా మిగతా అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల కంటే ముందు నుండే ఉనికిలో ఉంది.

#కడప #Kadapa ImageImage
గ్రీకు గణితవేత్త మరియు ఖగోళ, భౌగోళిక శాస్త్రజ్ఞుడు టాలెమీ క్రీశ 2వ శతాబ్దంలో (దాదాపు1900 సంవత్సరాల క్రితం) ప్రపంచ భౌగోళిక స్వరూపంపై రాసిన పుస్తకంలో ఆనాటి భారతదేశ పట్టణాల పేర్లు, ఇతర భౌగోళిక వివరాలు పొందుపరిచారు. అందులో నేటి కడప పట్టణాన్ని ‘కరిగె’ అని పేర్కొన్నాడు.
అయితే కడప ముందు ఒక చిన్న గ్రామం. చెన్నూరు సీమ / ములికినాటి సీమ /గండికోట సీమలలో ఉన్న గ్రామం క్రమేపీ పట్టణంగా, జిల్లా ప్రధాన కేంద్రంగా ఎదిగింది. వాడుకలో కడప పట్టణాన్ని మొత్తాన్ని కడప అని సంబోధించినా వివిధ కాలాల్లో ఏర్పడిన / వృద్ధి చెందిన వివిధ కడపల సమాహారమే నేటి కడప.
Read 14 tweets
#CharlieChaplin
చాప్లిన్ చెప్పిన జీవిత సత్యాలు :

ఒక చోట చదివాను.చార్లీ చాప్లిన్ ఒక మారు స్విట్జర్లాండ్ వెళ్ళాడట. అక్కడ చాప్లిన్ వేషం వేసుకున్న వారికి పోటీ జరుగుతోందట. అంటే ఎవరు అచ్చం చాప్లిన్ లాగా నటించగలుగుతారో వారికి బహుమానం ఇచ్చే పోటీ అన్నమాట.
#ChaplinDay
ఉత్సాహం ఆపుకోలేక చాప్లిన్ కుడా ఆ పోటీ లో పాల్గొన్నాడట.కానీ ఆశ్చర్యమేమిటంటే,ఆ పోటీలో చాప్లిన్ కు 7 వ స్థానం లభించిది.

దీని అర్థం ఏమిటబ్బా అని కాస్తా ఆలోచించాను. నాకు ఈ విషయాలు తెలిసొచ్చాయి. మనలని ప్రపంచం తనకు నచ్చిన రీతిలో అర్థం చేసుకుంటుంది.
అంతేకాన, మనమేమిటో సరిగ్గా తెలిసినది మనకు మాత్రమే.ఒక్క చాప్లిన్ కు మాత్రమే తెలుసు చాప్లిన్ అంటే ఎవరు, చాప్లిన్ ఎందుకోసం జీవించాడు ,చాప్లిన్ ఏవిధంగా ఆలోచించేవాడు అని. 'చూడండి, నా
ఉద్దేశ్యమిది, నేనీ విషయాన్ని ఇలా ఆలోచించాను ,
Read 7 tweets
#RamanaMaharshi
శ్రీ రమణ మహర్షి (డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), పుట్టుక పేరు వెంకట్రామన్ అయ్యర్, ఒక భారతీయ ఋషి. ఇతను తమిళనాడు తిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డారు
బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షజ్ఞానము పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నారు.

రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు.
#Arunachalam
వీరి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది.ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవారు. తమ అనుభవము అద్వైతం, జ్ఞానయోగా లతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి
#Tiruvannamalai
Read 7 tweets
అచ్చ తెలుగు దీక్షా వాక్యము (Motto) - యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప

విద్యాలయాలకు, విశ్వవిద్యాలయాలకు, సంస్థలకు దీక్షా వాక్యాలు (Motto) ఉండటం పరిపాటి. ఆ దీక్షా వాక్యం ఆయా సంస్థలకు మార్గనిర్దేశనం చేసే ధర్మసూత్రం అవ్వొచ్చు,

#కడప #Kadapa #YVU #వేమన
వారు సమాజానికి, మానవాళికి ఫలానా సేవ చేస్తామనే ప్రతిజ్ఞ కావొచ్చు, లేదా ఆయా సంస్థల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే బిరుదు వాక్యం అయ్యుండొచ్చు. చాలా మట్టుకు సంస్థలు దీక్షావాక్యాన్ని సంస్కృతంలోనో, ఇంగ్లీషులోనో ఉంచుతాయి.
ఉదాహరణకు:

శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి - జ్ఞానం సంయగ వేక్షణం
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం - విద్యయా అమృత మశ్నుతే
రాయలసీమ విశ్వవిద్యాలయం, కర్నూలు - విద్యయా విన్దతే అమృతం
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం - Knowledge is Power

మొదలగునవి. Image
Read 7 tweets
ఒంటిమిట్ట కోదండ రామాలయం

గుత్తి, పామిడి, గండికోట, ఒంటిమిట్ట క్షేత్రాల మధ్య సామీప్యం ఏమిటి?
ఒంటిమిట్టకి ఆ పేరు ఎలా వచ్చింది?
రఘువీరా! జానకీనాయకా! అనే మకుటంతో శ్రీమదొంటిమిట్ట రఘువీర శతక కర్త ఎవరు?
ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణం రాత్రిపూట ఎందుకు జరుగుతుంది?
(1/n)
#Vontimitta #Kadapa
ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని మీద అన్నమాచార్యులు రచించిన కీర్తనలు ఏవి?

భారాతావనిలో అత్యంత గొప్ప ఆలయాల్లో ఒకటి (One of the Greatest Pagodas in the whole of India) అని ఒంటిమిట్ట క్షేత్రాన్ని కొనియాడిన విదేశీయుడు ఎవరు?

ఒంటిమిట్టలో భక్తులకు బావి తవ్వించిన ముస్లిం పాలకుడు ఎవరు?
2/n
రామ తీర్థం – లక్ష్మణ తీర్థం

త్రేతాయుగంలో వనవాస సమయంలో దండకారణ్యలో సీతారామలక్ష్మణులు సంచరిస్తుండగా, సీతమ్మవారి దప్పిక తీర్చడానికి రాములవారు ఎక్కుపెట్టిన బాణం వాళ్ల భూమిలోనుంచి ఉబికి వచ్చిన నీరు వల్ల ఇక్కడ రెండు మడుగులు ఏర్పడ్డాయి. అవే రామ తీర్థం మరియు లక్ష్మణ తీర్థం.

3/n
Read 25 tweets
#Vontimitta #kodandaRamaTemple
క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని విష్ణుమూర్తి తన అర్ధాంగిగా చేసుకోగా,పగలు జరిగే వీరి కల్యాణ మహోత్సవాన్ని తాను చూడలేకపోతున్నానని లక్ష్మీదేవికి సోదరుడిగా అదే పాలసముద్రంలో జన్మించిన చంద్రుడు విన్నవించుకున్నాడట.
@RayaIaseema
#AndhraPradesh
అందుకే ఒక్క ఒంటిమిట్టలో మాత్రం వెన్నెల వెలుగుల్లో కల్యాణం జరిగేలా నారాయణుడు చంద్రునికి వరమిచ్చాడట. అందుకే ఇక్కడ రాత్రిపూట మాత్రమే స్వామివారి కల్యాణం జరుగుతుంది. అలాగే ఈ ఆలయంలో రామభక్తుడైన శ్రీ ఆంజనేయుడు మాత్రం కనిపించడట.
దేశంలో హనుమంతుడి విగ్రహం కనిపించని ఏకైక రామాలయం ఒంటిమిట్ట ఆలయమే. ఇందుకు కారణం ఏమిటంటే.. రాముడు, ఆంజనేయుడు కలవడానికి ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల విగ్రహం ప్రతిష్ఠించారట.
Read 8 tweets
#తెలుగువెలుగు
ఊరికే పుట్టలేదు మన #తెలుగుసామెతలు :---
#కరోనాకల్లోలం
1. వినాశకాలే విపరీతబుద్ది అన్నట్లు
చైనా చేసిన పాడుపనికి కరోనా పుట్టింది !
2. తను తీసుకున్న గోతిలో తానే పడింది !
3. అందుకే అంటారు. చెడపకురా చెడేవు అని !
4. ఆవలింతకు అన్న ఉన్నాడు గానీ,
తుమ్ముకు తమ్ముడు లేడనుకుంది ఇటలీ !
చైనా వాళ్ళతో హగ్గులు, పెగ్గులూ పంచుకుంది !
5. మన దీపమని ముద్దాడితే మూతి కాలినట్టు
ఇటలీ కంటుకుంది కరోనా !
6.ఇంతింతై, వటుడింతై అన్నట్లు విజృంభించింది కరోనా!
7. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి లాభం?
8.తూర్పు తిరిగి దణ్ణం పెట్టమని వదిలేసింది ప్రస్తుతం!
9. ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చినట్లు అన్ని దేశాలకు పాకింది కరోనా!
10.తగువెలా వస్తుందిరా జంగమ దేవరా అంటే
బిచ్చం పెట్టవే బొచ్చు మొహం దానా అన్నట్టు
అమెరికా చైనాను నిందించడం మొదలు పెట్టింది !
Read 13 tweets
Pushpagiri Vaibhavam
పుష్పగిరి వైభవం

Shivatandavam
శివతాండవం
Nataraja Vaibhavam
నటరాజ వైభవం
Dakshinamurthy
దక్షిణామూర్తి
Read 15 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!