Discover and read the best of Twitter Threads about #kurnool

Most recents (18)

Sri #LakshmiNarasimha & Sri #Mukhyapraana Devaru
(at #Kurnool on the banks of holy river #TungaBhadra)
Sri #BhuvanendraTheerthara (1785-1799) prathishta
(Mantralya Matha) 🙏🙏🙏 Image
It may kindly be noted that Sri #BhuvanendraTheertharu was Sri #GuruRaayara (#Mantralaya Sri #RaghavendraSwamy) poorvaasrama Great Grandson. +
It is said that during his sanchaara halt at Kurnool, Sri #BhuvandendraTheertharu procured this icon of Sri #LakshmiNarasimha while performing morning rituals in #Tungabhadra river. This temple is just abutting the holy river #Tungabhadra. +
Read 8 tweets
Nandhi Sculpture that grows in Size every year. The Temple staff has already removed a pillar as the size of Nandhi (Holy Bull) is Increasing Sri Yaganti Uma Maheshwara Temple, Kurnool, Andhra Pradesh
This temple was constructed by King Harihara Bukka Raya of the Sangama Dynasty of the Vijayanagara Empire in the 15th century. It was built according to Vaishnavaite traditions.
The locals say that the idol was initially much smaller than its present size. They say that certain experimentation was carried out on this idol and it was said that the type of rock out of which the idol is carved has a growing or enlarging nature associated with it.
Read 5 tweets
#HappyBirthdaypowerstar @PawanKalyan ...Someone who sounds sane, down-to-earth in one-on-one interaction but what is it about you that seems to drive all your fans totally crazy just at the mention of your name ??!! #MarneMaarneKoTaiyyar! #TheresSomethingAboutYou @ndtv @ndtvindia
At a special screening of #Jalsa on the occasion of 51st birthday of #PowerStar #PawanKalyan, fans go berserk with celebrations inside theatre in #Vizag; screening was to happen in 501 theatres, some stopped worried about unruly behaviour by fans @ndtv @ndtvindia #HBDPowerStar
Grand re-release of @PawanKalyan's biggest grosser #Jalsa was planned in 501 theatres & fans were to contribute collections to support #PawanannaPrajaBata #JanasenaRythuBharosaYatra; now vandalism has caused embarrassment to #PowerStar & loss running into lakhs @ndtv @ndtvindia
Read 4 tweets
వెలుగోటివారి వంశావళి

వెలుగోడు ఎక్కడ ఉంది ? అసలు వెలుగోటివారు అంటే ఎవరు ?

అనుమనగంటి వారు రేచర్ల వారు ఎందుకయ్యారు ?

రేచర్ల వారు వెలుగోటి వారు ఎందుకయ్యారు ?

వారి రాజధాని దేవరకొండ ను వదిలేసి వెలుగోడుకి ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చారు ?

వెలుగోడు అంటే అర్థం ఏమిటి ?
వెంకటగిరి రాజులకు బొబ్బిలి జమీందార్లకు వెలుగోడుతో ఉన్న సంబంధం ఏమిటి ?

బొబ్బిలి జమీందార్ల మూల పురుషుడి గా ఎవరిని భావిస్తారు ?

వెంకటగిరిఅసలు పేరు/ మొదటి పేరు ఏమిటి ?

రేచర్ల పద్మనాయకులలో/వెంకటగిరి రాజుల పేర్లలో యాచెంద్ర / యచమ నాయుడు/యాచ అన్న పదం ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది?
వెలుగోటివారైన వెంకటగిరిరాజులకు, కాళహస్తి జమీందారులైన దామెర / దామెర్ల పద్మనాయకులకు సంబంధం ఏమిటి ?

కర్నూలు జిల్లాలోని ఒక చారిత్రక గ్రామం వెలుగోడు. వెలుగోడు జలాశయం ఇక్కడే ఉంది. రేచర్ల పద్మనాయకులు విజయనగర రాజ్యానికి సామంతులుగా ఈ వెలుగోడును రాజధానిగా చేసుకుని పాలించారు.
Read 34 tweets
రాముడు, రామాయణం, రాయలసీమ -Part 5

శ్రీరాముల వారే కొలిచిన మూల రామ విగ్రహం, శ్రీమఠం, మంత్రాలయం :

మంత్రాలయం తెలుగు రాష్ట్రాలలోని ఏకైక ప్రధాన మధ్వమఠం అయిన శ్రీమఠంలో తరతరాలుగా శ్రీమఠ పీఠాధిపతులు కొలుస్తున్న శ్రీ మూలా రామ దేవరు విగ్రహం ఉంది. Image
చతుర్ముఖ బ్రహ్మ స్వామివారిని సేవించుకోవడానికి విగ్రహం తయారుచేసివ్వమని ఆదేశించగా దేవ శిల్పి విశ్వకర్మ ఈ మూలా రామ విగ్రహాన్ని తయారుచేశారు.ఈవిగ్రహాన్ని చాతుర్యుగ మూర్తి అని కూడా అంటారు (సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలలో పూజింపబడుతున్న విగ్రహం).
సృష్టికర్త బ్రహ్మ, ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు కొలిచిన ఈవిగ్రహం అనేక మంది దేవుళ్ళు, ఋషులు చేతులు మారి సూర్య భగవానుడి నుండి వైవస్వత మనువు అక్కడినుండి ఇక్షాకుడి అక్కడినుండి ఇక్ష్వాకుల కులదైవంగా పూజింపబడింది. ఇక్ష్వాకు వంశ రాజు దశరథ మహారాజు నిత్యం పూజించేవారు.
Read 8 tweets
A tweet thread with the list of Hospitals treating #COVID19 Positive people in each district in #AndhraPradesh.

If you are looking for immediate assistance/help call 104 toll-free number i.e., available 24 X 7
#APFightsCorona #COVID19Pandemic
List of Hospitals treating #COVID19 Positive people in #Anantapur district.
#APFightsCorona #COVID19Pandemic
List of Hospitals treating #COVID19 Positive people in #Chittoor district.
#APFightsCorona #COVID19Pandemic
Read 14 tweets
గర్వాంగా చెప్పరా సీమనాదని
రాయలేలిన రతనాల సీమనాదని

కరువు నేల నీదంటే
రాళ్ళ బతుకు మీదంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
రతనాల రాశులమ్మిన నేల నాదని

నీ మాటే మొరటంటే
నీ యాసే వెగటంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
తెలుగు భాష తొలి శాసన గడ్డ నాదని Image
నీ వాళ్ళు రౌడీలని
ఫ్యాక్షనిస్టులు మీరంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
దేవుళ్ళు కొలువైన పుణ్య భూమి నాదని

వెనుకబాటు నీదని
పేదరికం మీదంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
చల్లకొస్తే పాడిపడ్డ దానమిచ్చు చరితమాదని Image
సదువుసంజెలు లేవని
అనాగరికులు మీరంటే
గర్వాంగా చెప్పరా సీమనాదని
ఈడ ఆలిసెల్లి తప్ప ఆడోళ్లు అమ్మలక్కలేనని

గర్వాంగా చెప్పరా సీమనాదని
రాయలేలిన రతనాల సీమనాదని

#సీమకవిత #Rayalaseema #Kadapa #Kurnool #Anantapur #Chittoor #Tirupati Image
Read 3 tweets
రక్షా బంధన్ - రాఖీ పూర్ణిమ - రాయలసీమ దేవాలయాలు

సోదర - సోదరి బాంధవ్యాలు, ఆడబిడ్డకు సారె పెట్టే సంప్రదాయాలు మానవులలోనే కాదు దేవుళ్లలోనూ చూడొచ్చు. అటువంటి కొన్ని ఆలయాలు రాయలసీమలో Image
మోపూరు భైరవేశ్వర ఆలయం (భైరవుడి సోదరి అక్కపప్పూరమ్మ ) - కడప జిల్లా

భైరవాచలం మెట్ల మార్గం ప్రారంభంలోనే భైరవేశ్వరుడి సోదరి అక్కపప్పూరమ్మ ఆలయం ఉంటుంది. భైరవేశ్వర స్వామి విగ్రహం రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో అక్కపప్పూరమ్మ తలపై చేయి పెట్టగా,
ఆగ్రహించిన భైరవేశ్వరుడు భైరవాచలం వదిలి వెళ్లాలని ఆదేశించాడని అందుకే అక్కపప్పూరమ్మ ఆలయం కింద ఉందని చెబుతారు.అయితే స్వామి తరువాత శాంతించి అక్కపప్పూరమ్మకు తొలి పూజ భాగ్యం కల్పించాడని స్థల పురాణం.

చిత్రం : నల్లచెరువుపల్లిలో అక్కపప్పూరమ్మ ఆలయం Image
Read 8 tweets
పుట్టుపాపలు

నల్లమల అడవులు అనగానే శ్రీశైల మల్లన్న, అహోబిల లక్ష్మీనరసింహ స్వామి గుర్తుకొస్తారు. అంతేగాక వెంటనే చెంచు దొరలు కూడా గుర్తుకొస్తారు. నల్లమల అడవుల్లో ఉండే 'చెంచు'తెగ వారి గురించి అందరికీ తెలిసిందే. వీరిని ప్రభుత్వం Particularly Vulnerable Tribal Groups లో కూడా చేర్చింది
అయితే నల్లమల అడవుల్లో చెంచు తెగ వారే కాక, 'పుట్టపాప' అనే తెగ మనుషులు కూడా ఉండేవారు. వీరి వివరాలు మెకంజీ కైఫీయత్తుల్లో పొందుపరచబడి ఉన్నాయి (19వ శతాబ్దం మొదట్లో సేకరించబడిన వివరాలు). ఈ కైఫీయత్తుల ప్రకారం పుట్టుపాపలు సుమారు 4.5 అడుగుల ఎత్తుగల మనుషులు.
చెంచులు వస్త్రాలు ధరించేవారు కానీ పుట్టుపాపలు వస్త్రాలు ధరించేవారు కాదట. చెంచు తెగ వారి వద్ద ఉండే విల్లంబులు, బాణాలు వంటి ఆయిధలు కూడా పుట్టుపాపలతో ఉండేవి కాదట. అడవిలో జంతువులను వేటాడి పచ్చి మాంసమే తినేవారట. వాటితో పాటు కందమూలలు, అడవి పండ్లు వంటివి తిని బతికేవారట
Read 5 tweets
నీటి ప్రాజెక్టులు-వాటి పేర్లు

తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య
తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలంసంజీవరెడ్డి
దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య
తొలి కడప లోక్సభ సభ్యుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి
జలరంగ నిపుణులు కుడితిపూడి శ్రీరామకృష్ణయ్య

వీరి మధ్యన ఉన్న సారూప్యం ఏమిటి ? Image
వివిధ కాలాలు, రంగాలకు చెందిన వీరి పేరు చిరస్థాయిగా నిలిచేలా సీమలోని అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు వీరి పేరు పెట్టడం జరిగింది. సాధారణంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకువాడుకలో ఒక పేరు (సాధారణంగా ఆ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం/నది పేరు మొ. ) ఉంటె అధికారికంగా మరో పేరు ఉంటుంది.
ఆ ప్రాంతానికి నీరు తేవడానికి కృషి చేసిన రాజకీయ నాయకుడి పేరు అయుండొచ్చు లేదా ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి అయుండొచ్చు లేదా ఆ ప్రాంతానికి సంబంధం లేని గొప్ప వ్యక్తి అయినా అయుండొచ్చు. ఇప్పుడు రాయలసీమలోని కొన్ని ప్రధాన ప్రాజెక్టులకు ఎవరెవరి పేర్లున్నాయో చూద్దాం
Read 21 tweets
రాయలసీమ - దశావతార ఆలయాలు

“ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవత్గీతలో.
అంటే ధర్మాన్నిస్థాపించడంకోసం/నిలబెట్టడంకోసం ప్రతీయుగంలోనూఅవతరిస్తానుఅనిఅర్థం

దశావతారాలలోని రామ, కృష్ణ, నరసింహ అవతారాలకు విశేషంగా ఆలయాలుఉన్నాయి.
కానీ. మత్స్య, కూర్మ వంటి అవతారాలకు దేశం మొత్తంలో చాలా అరుదుగా మాత్రమే ఆలయాలు ఉన్నాయి.

అయితే దశావతారాలకు సంబంధించి రాయలసీమలోని అత్యంత ప్రసిద్ధి చెందిన, అత్యంత అరుదైన ఆలయాల విశేషాలు

మత్స్యావతారం:

సృష్టికర్త బ్రహ్మ వద్ద నుండి సోమకాసురుడు వేదాలు తస్కరించి సముద్రగర్భంలో దాక్కుంటే
శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి వధించి వేదాలను రక్షిస్తాడు.

దశావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతార మూర్తికి ఆలయాలు అత్యంత అరుదు. అటువంటి ఆలయాలలో ఒకటి చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం నాగలాపురం పట్టణంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం.
Read 23 tweets
మనం మరచిన మరో పరిశ్రమ - తుంగభద్రా ఇండస్ట్రీస్ లిమిటెడ్

కర్నూలు జిల్లా సొనామసూరి, బెనీషా (బనగానపల్లె / బంగినపల్లి మామిడి), పుల్లారెడ్డి స్వీట్స్ ఎంత ప్రఖ్యాతి చెందినవో అందరికీ తెలుసు. కానీ

ఒకప్పుడు కర్నూలులో ఉన్న ఒక పరిశ్రమ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యేవని మీకు తెలుసా ?
ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో అతి పెద్ద నూనె తయారీ పరిశ్రమ కర్నూలులో ఉండేదన్న విషయం మీకు తెలుసా ?

ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు కానీ, ‘తుషార్ వనస్పతి’ అంటే ఒకప్పుడు పేరొందిన బ్రాండ్. దేశంలో వనస్పతి రంగంలో ‘డాల్డా’ బ్రాండ్ తిరుగులేని ఆధిక్యంలో ఉండగానే,
దానికి ధీటుగా నిలబడి దేశవ్యాప్తంగా పేరొందిన దేశీయ వనస్పతి బ్రాండ్ ‘తుషార్’. అయితే ఈ తుషార్ వనస్పతి కర్నూలులోనే తయారయ్యేది. ఆ పరిశ్రమ పేరు తుంగభద్రా ఇండస్ట్రీస్ లిమిటెడ్.

వనస్పతి : భారతీయ వంటలలో నెయ్యికి ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసందే. అయితే నెయ్యి ధర చాలా ఎక్కువ.
Read 14 tweets
తూర్పు కనుమలు -ఆది శేషుడు

చుట్టలు చుట్టుకుకుని పాలసముద్రంలో శ్రీమహావిష్ణువుకు తల్పముగా ఉంటాడు ఆదిశేషుడు. ఏడు పడగలతో శ్రీవారికి గొడుగు పడుతుంటాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక వైపు కర్నూలు జిల్లాలో నల్లమల శ్రేణి, మరోవైపు చిత్తూరు జిల్లాలో శేషాచలం కొండలతో తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి ImageImage
అటు నల్లమలకు పైన కానీ, ఇటు శేషాచలం కొండల కింద కానీ మరే పర్వత శ్రేణి లేక కర్నూలు నుండి చిత్తూరు వరకు విస్తరించిన ఈ కొండలు ఒకే భాగంలాగా ఉన్నాయి. అయితే తూర్పు కనుమలలోని ఈ భాగాన్ని తరచిచూస్తే మధ్యలో అనేక కొండలు, గుట్టల శ్రేణులతో చుట్ట చుట్టుకుని ఉన్న ఆదిశేషుని రూపం పోల్చి ఉన్నాయి.
ఆది శేషుని పడగల వద్ద తిరుమల, మధ్య భాగంలో నవనారసింహ అహోబిల క్షేత్రం, చుట్ట చుట్టుకుని ఉన్న ఆదిశేషుని చివరి భాగంలో (తోక) జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం ఉన్నాయి. ఆది శేషుని నోటి వద్ద పంచభూత లింగ క్షేత్రమైన (వాయులింగం) శ్రీకాళహస్తి ఉంది. విశేషంఏమిటంటే ఆదిశేషునికి ఏడు పడగలు. Image
Read 5 tweets
దేఖో అప్నా దేశ్ - Top 15 Tourist Destinations in Rayalaseema

రాయలసీమ గురించి పెద్దగా తెలియని వాల్లకు రాయలసీమలో తప్పక చూడవలసిన ప్రదేశాల గురించి ఈ థ్రెడ్

గమనిక:
1.The List given below is strictly according to my Personal Opinion
2. The List is in no particular order
Top 15 Spiritual Destinations

చిత్తూరు

1. తిరుపతి - తిరుమల ఆలయాలు
2. సురుటుపల్లి పల్లికోండేశ్వర స్వామి ఆలయం
3. కాణిపాకం - వినాయక ఆలయం
4. శ్రీకాళహస్తి (శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి ఆలయం)

కర్నూలు

5. శ్రీశైలం ఆలయాలు (జ్యోతిర్లింగ క్షేత్రం)
6. అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం
7. నవనందులు/మహానంది
8. యాగంటి
9. మంత్రాలయ శ్రీ మఠం

కడప

10. పుష్పగిరి ఆలయాలు
11. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం
12. అమీర్ పీన్ దర్గా(పెద్దదర్గా)

అనంతపురం

13. కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం
14. తాడిపత్రి ఆలయాలు
15. పుట్టపర్తి
Read 7 tweets
ఒక ధర్మ ప్రభువు కథ

రాజ్యాలందు రామరాజ్యం వేరు
ప్రభువులందు ధర్మ ప్రభువులు వేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరు

గర్భిణీ స్త్రీతో పనిచేయిస్తే కడుపులో పెరిగే బిడ్డకు సైతం కూలీ ఇవ్వాలి అని శాసనం వేయించాడు ఒక ధర్మప్రభువు. తారలు మారినా ఇప్పటికీ ఆ ధర్మాన్ని తప్పడం లేదు అక్కడి ప్రజలు.
కర్ణుడికి కవచకుండలాల్ల " ధర్మం, ధైర్యం, దానగుణం" అనేవి సీమ బిడ్డలకు పుట్టుకతో వచ్చే సుగుణాలు. అందుకే ఇక్కడి పాలకులు కూడా ధర్మ ప్రభువులుగా పేరు తెచ్చుకున్నారు.

నంద్యాల తిమ్మరాజు / నల్ల తిమ్మరాజు అవుకు సంస్థానం పాలకుడు. నంద్యాల రాజులలో ముఖ్యుడు. కర్నూలు జిల్లలో ఉంది అవుకు.
విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన నాలుగవ వంశం ఆరవీటి వంశస్థుడు. శ్రీకృష్ణదేవరాయలకు బంధువు. కృష్ణదేవరాయల అల్లుడు, ఆరవీటి అలియ రామరాయలకు స్వయానా పెదనాన్న.

ఈ నల్ల తిమ్మరాజే క్రీ.శ 1538లో అవుకు చెరువు తవ్వించాడు. దేశంలోని పెద్ద చెరువులలో ఇదీ ఒకటి.
Read 5 tweets
Our Hon’ble @AndhraPradeshCM @ysjagan is very clear on Capital issue: 1) We want overall State Devel, 2) To this end we have announced de-centralised model of devel with #Kurnool, #Vizag & #Vijayawada all included - 1 @yvsubbareddymp @VSReddy_MP @BugganaR @YSRCParty #APCapitals
#Kurnool as judiciary Center is good & will develop #Rayalaseema region & since easy driving distance from #Hyderabad, AP clients will be able to get the best legal services from legal fraternity based in Hyd and slowly a second legal Center w jobs will develop in Kurnool -2
We remain committed to #Vijayawada / #Amaravati region. Our Govt w bring new Invsts in Inland Logistics, Medicine, Agri, Edu etc to Vja region & further develop these sectors here which have natural locational advantage here. Farmers & their lands will be our top priority here -3
Read 11 tweets
రాయలసీమ నదులు - ద్వితీయ భాగం
మొదటి భాగంలో కృష్ణా, తుంగభద్రా, పెన్నా, బాహుదా, కుందేరు, స్వర్ణముఖి, పాపాఘ్ని, హగరి, మాండవ్య నదుల గురించి రాయడమైనది. ఈ భాగంలో చిత్రావతి, సగిలేరు, పావనీ, అర్జున, గార్గేయ, కౌండిన్య, పాండ్య, అరుణా, కాళంగి నదుల గురించి, సీమ నదీ సాహిత్యం గురించి రాశాను1/n
చిత్రావతి - దేవ కన్యా అని కూడా అంటారు - పవిత్ర పుట్టపర్తి క్షేత్రం ఈ నదీ తీరంలోనే ఉంది. చిత్రావతి నది పెన్నా నదికి ఉపనది. గండికోట వద్ద చిత్రావతి నది పెన్నా నదిలో కలుస్తుంది. ఈ నది మీదే పర్నపల్లి వద్ద చిత్రావతి బాలన్సింగ్ రిజర్వాయర్ ఉన్నది. 2/n
సగిలేరు(స్వర్ణబాహు) - సకిలినాటి సీమలో (గిద్దలూరు -బద్వేల్ ప్రాంతం ) ప్రవహించే నది కాబట్టి సగిలేరు అయింది. ఈ నదినే స్వర్ణబాహు అని కూడా అంటారు. ఈ నది పెన్నా నదికి ఉపనది. ఎగువ సగిలేరు, దిగువ సగిలేరు ప్రాజెక్టులు ఈ నది మీద ఉన్నవి. 3/n
Read 13 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!