Discover and read the best of Twitter Threads about #kurnool_temples

Most recents (4)

రాయలసీమ చరిత్రలో స్త్రీలు - విఠ్ఠలాదేవి /విఠ్ఠలాంబ

సంగమ వంశ విజయనగర చక్రవర్తి రెండవ హరిహరరాయల భార్య; కాదంబుల యువరాణి పద్మలదేవి మరియు చాళుక్య రాజు రాజేంద్రుడి కుమార్తె విఠ్ఠలాదేవి. ఈవిడ శ్రీశైలం దర్శించి అక్కడ పాతాళగంగకు మెట్ల దారి ఏర్పరిచినది.

#రాయలసీమచరిత్రలోస్త్రీలు Image
శ్రీశైలంలోని శాసనాలప్రకారం శాలివాహక శకం 1315 శ్రీముఖ నామ సంవత్సరం (క్రీ.శ 1393) విఠ్ఠలాదేవి పాతాళగంగకు మెట్లదారి నిర్మించింది. విఠ్ఠలాదేవి శ్రీశైల మల్లిఖార్జున స్వామి కలలో తనకిచ్చిన ఆదేశాల మేరకు పాతాళగంగకు మెట్లదారి నిర్మిస్తున్నట్టు శాసనంలో తెలిపింది.
#రాయలసీమస్త్రీలు
శాలివాహక శకం 1318 (క్రీ.శ 1396)లో విఠ్ఠలాదేవి విఠలేశ్వర ఆలయాన్ని / విఠలేశ్వర మండపాన్ని నిర్మించి విఠలేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసింది.

#సీమచరిత్ర #Srisailam #Kurnool_Temples #Raayalaseema_Temples

చిత్రం: వికీపీడియా
Read 3 tweets
రాముడు, రామాయణం, రాయలసీమ -Part 5

శ్రీరాముల వారే కొలిచిన మూల రామ విగ్రహం, శ్రీమఠం, మంత్రాలయం :

మంత్రాలయం తెలుగు రాష్ట్రాలలోని ఏకైక ప్రధాన మధ్వమఠం అయిన శ్రీమఠంలో తరతరాలుగా శ్రీమఠ పీఠాధిపతులు కొలుస్తున్న శ్రీ మూలా రామ దేవరు విగ్రహం ఉంది. Image
చతుర్ముఖ బ్రహ్మ స్వామివారిని సేవించుకోవడానికి విగ్రహం తయారుచేసివ్వమని ఆదేశించగా దేవ శిల్పి విశ్వకర్మ ఈ మూలా రామ విగ్రహాన్ని తయారుచేశారు.ఈవిగ్రహాన్ని చాతుర్యుగ మూర్తి అని కూడా అంటారు (సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలలో పూజింపబడుతున్న విగ్రహం).
సృష్టికర్త బ్రహ్మ, ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు కొలిచిన ఈవిగ్రహం అనేక మంది దేవుళ్ళు, ఋషులు చేతులు మారి సూర్య భగవానుడి నుండి వైవస్వత మనువు అక్కడినుండి ఇక్షాకుడి అక్కడినుండి ఇక్ష్వాకుల కులదైవంగా పూజింపబడింది. ఇక్ష్వాకు వంశ రాజు దశరథ మహారాజు నిత్యం పూజించేవారు.
Read 8 tweets
రాయలసీమ - దశావతార ఆలయాలు

“ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవత్గీతలో.
అంటే ధర్మాన్నిస్థాపించడంకోసం/నిలబెట్టడంకోసం ప్రతీయుగంలోనూఅవతరిస్తానుఅనిఅర్థం

దశావతారాలలోని రామ, కృష్ణ, నరసింహ అవతారాలకు విశేషంగా ఆలయాలుఉన్నాయి.
కానీ. మత్స్య, కూర్మ వంటి అవతారాలకు దేశం మొత్తంలో చాలా అరుదుగా మాత్రమే ఆలయాలు ఉన్నాయి.

అయితే దశావతారాలకు సంబంధించి రాయలసీమలోని అత్యంత ప్రసిద్ధి చెందిన, అత్యంత అరుదైన ఆలయాల విశేషాలు

మత్స్యావతారం:

సృష్టికర్త బ్రహ్మ వద్ద నుండి సోమకాసురుడు వేదాలు తస్కరించి సముద్రగర్భంలో దాక్కుంటే
శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి వధించి వేదాలను రక్షిస్తాడు.

దశావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతార మూర్తికి ఆలయాలు అత్యంత అరుదు. అటువంటి ఆలయాలలో ఒకటి చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం నాగలాపురం పట్టణంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం.
Read 23 tweets
దేఖో అప్నా దేశ్ - Top 15 Tourist Destinations in Rayalaseema

రాయలసీమ గురించి పెద్దగా తెలియని వాల్లకు రాయలసీమలో తప్పక చూడవలసిన ప్రదేశాల గురించి ఈ థ్రెడ్

గమనిక:
1.The List given below is strictly according to my Personal Opinion
2. The List is in no particular order
Top 15 Spiritual Destinations

చిత్తూరు

1. తిరుపతి - తిరుమల ఆలయాలు
2. సురుటుపల్లి పల్లికోండేశ్వర స్వామి ఆలయం
3. కాణిపాకం - వినాయక ఆలయం
4. శ్రీకాళహస్తి (శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి ఆలయం)

కర్నూలు

5. శ్రీశైలం ఆలయాలు (జ్యోతిర్లింగ క్షేత్రం)
6. అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం
7. నవనందులు/మహానంది
8. యాగంటి
9. మంత్రాలయ శ్రీ మఠం

కడప

10. పుష్పగిరి ఆలయాలు
11. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం
12. అమీర్ పీన్ దర్గా(పెద్దదర్గా)

అనంతపురం

13. కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం
14. తాడిపత్రి ఆలయాలు
15. పుట్టపర్తి
Read 7 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!