Discover and read the best of Twitter Threads about #proddatur

Most recents (7)

దీపావళి✨ పండుగ పటాకులు కాల్చేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు....! #Deepavali #Diwali #Happy
దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.
💥దీపావళి రోజున ముఖ్యంగా చిన్న పిల్లలు పటాకులు కాల్చే ముందు కాటన్ దుస్తులు దరించాలి. Image
సిల్క్, నైలాన్, సింతటిక్ దుస్తులు వేసుకోకూడది.
💥పెద్దల పర్యవేక్షణలోనే పటాకులు కాల్చాలి.
💥 చిచ్చుబుడ్డీలు, రాకెట్‌లు, పటాకులు చేతిలో ఉంచుకొని కాల్చరాదు.
💥పటాకులు కాల్చే ప్రదేశంలో నీరు అందుబాటులో ఉంచుకోవడమే కాకుండా.. Image
💥ఇంటి దగ్గర కాకుండా ఓపెన్ గ్రౌండ్‌లో కాల్చడం మంచిదంటున్నారు. ప్రధానంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, కరెంటు తీగలు ఉండే స్థలాలలో కాల్చవద్దు.
💥కంటి అద్దాలు, కాళ్ళకు చెప్పులు, చెవులో దూది ఉంచుకొని కాల్చాలి. టపాసులతో జాగ్రత్త!! 🏥🚑 Image
Read 4 tweets
మే దినోత్సవం లేదా మే డే (#MayDay)
ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. చాలా దేశాలలో మే దినం, #అంతర్జాతీయ_కార్మిక_దినోత్సవం లేదా కార్మిక దినోత్సవం తో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి. #InternationalLabourDay
భారతదేశంలో 1947లో మనకు స్వాతంత్ర్యం లబించేంత వరకు భూస్వామ్య వ్యవస్థవుండేది. ఈ వ్యవస్థలో రాజులు తమకు సైనికులను, ఉంపుడుక తెలను సరఫరా చేసినందుకుగాను, విలువైన కానుకలను సమర్పించుకున్నందుకు గాను కొంతమంది వ్యక్తులకు భూములను బహుమానంగా ఇచ్చేవారు. ఈ భూముల్లో వారు శిస్తులు వసూలు చేసి
కొంతభాగం రాజుకి చెల్లించగా మిగిలినది తమ సాంతానికి వాడుకొనేవారు. ఈ భూములను రైతులకు యిచ్చి వ్యవసాయం చేయించి ఫలసాయం తాము తీసుకొనేవారు. అన్ని వృత్తులవాళ్ళు ఎండనక, వాననక భూస్వాములకు పనులు చేసిపెట్టే వాళ్ళు. ఇందుకు వారికి ఎటువంటి ప్రతిఫలం లభించేదికాదు. దీనిని వెట్టి చాకిరీ అనేవాళ్ళు.
Read 19 tweets
#ColumnistsDay
✍️📰 కాలమిస్ట్ దినోత్సవం

కాలమిస్ట్, వ్యాసాలు రాసే పత్రికా రచయిత, పత్రికకు క్రమం తప్పక వ్యాసాలు రాచే రచయిత.
#columnist
కాలమిస్టు అంటే ఎవరు? సమాధానాలు ఇలా కొన్నింటిని చెప్పుకోవచ్చు - తలపండిన వాడు, జీవన సారాన్ని పుక్కిటపట్టిన వాడు, శాస్త్రాలను అవపోశన పట్టినవాడు,
గురువుగా భావింపబడేవాడు, బతికినన్నాళ్లు రాసినా తరగని మేధోసంపత్తి గలవాడు, ప్రలోభాలకు లొంగనివాడు, వజ్రసంకల్పుడు. ఇప్పుడు రాస్తున్న వారిలో ఇందులో ఒక్క గుణమున్నా పాఠకులు ఆ ‘కాలమ్’ని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. వారికోసం ప్రపంచాన్ని గాలించైనా వెదికి పట్టుకోవాలి.
రానున్న తరంలో మన భాష నిలువాలన్నా, మన సంస్కృతి పరిఢవిల్లాలన్నా, పత్రికలు తమ పాత్రను నిభాయించామని గర్వపడాలనుకున్నా ఇలాంటి శీర్షికలే ప్రాణాధారం.
Read 23 tweets
సంక్రాంతి పండుగ రోజు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పతంగుల పండుగను ఆనందంగా గడుపుతారు. సాధారణంగా ఒక చతురస్రాకారపు కాగితం, రెండు వెదురు బద్దలు, తగినంత దారం ఉపయోగించి వినోదం కోసం గాలిలోకి ఎగరవేసే ఒక ఆట వస్తువు పతంగి లేదా గాలిపటం (#Kite).
#InternationalKitesDay Image
పతంగులను ఆంధ్రులు ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఎగురవేస్తారు. ఉత్తరాయణంలో జరుపుకునే అంతర్జాతీయ గాలిపటాల పండుగ అతిపెద్ద వేడుకగా భావించబడుతుంది. గాలిపటాల పండుగ వస్తుందన్న కొద్ది నెలల ముందే గుజరాత్‍లోని ఇళ్లలో గాలిపటాల తయారీ ప్రారంభమవుతుంది.
ఆకాశమే హద్దుగా వివిధ రకాల పతంగులను ఎగరేస్తూ ఇంద్రధన్సుల్లోని వర్ణాలను ఆకాశంలో నిలుపుతారు. సంక్రాంతి పండుగ రోజు పతంగులను ఎగురేసేందుకు ప్రత్యేకమైన దారాలను తయారు చేయడం, మాంజాలుగా రూపుదిద్ది పోటీల్లో పాల్గొనడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
Read 9 tweets
#CharlieChaplin
చాప్లిన్ చెప్పిన జీవిత సత్యాలు :

ఒక చోట చదివాను.చార్లీ చాప్లిన్ ఒక మారు స్విట్జర్లాండ్ వెళ్ళాడట. అక్కడ చాప్లిన్ వేషం వేసుకున్న వారికి పోటీ జరుగుతోందట. అంటే ఎవరు అచ్చం చాప్లిన్ లాగా నటించగలుగుతారో వారికి బహుమానం ఇచ్చే పోటీ అన్నమాట.
#ChaplinDay
ఉత్సాహం ఆపుకోలేక చాప్లిన్ కుడా ఆ పోటీ లో పాల్గొన్నాడట.కానీ ఆశ్చర్యమేమిటంటే,ఆ పోటీలో చాప్లిన్ కు 7 వ స్థానం లభించిది.

దీని అర్థం ఏమిటబ్బా అని కాస్తా ఆలోచించాను. నాకు ఈ విషయాలు తెలిసొచ్చాయి. మనలని ప్రపంచం తనకు నచ్చిన రీతిలో అర్థం చేసుకుంటుంది.
అంతేకాన, మనమేమిటో సరిగ్గా తెలిసినది మనకు మాత్రమే.ఒక్క చాప్లిన్ కు మాత్రమే తెలుసు చాప్లిన్ అంటే ఎవరు, చాప్లిన్ ఎందుకోసం జీవించాడు ,చాప్లిన్ ఏవిధంగా ఆలోచించేవాడు అని. 'చూడండి, నా
ఉద్దేశ్యమిది, నేనీ విషయాన్ని ఇలా ఆలోచించాను ,
Read 7 tweets
#తెలుగువెలుగు
ఊరికే పుట్టలేదు మన #తెలుగుసామెతలు :---
#కరోనాకల్లోలం
1. వినాశకాలే విపరీతబుద్ది అన్నట్లు
చైనా చేసిన పాడుపనికి కరోనా పుట్టింది !
2. తను తీసుకున్న గోతిలో తానే పడింది !
3. అందుకే అంటారు. చెడపకురా చెడేవు అని !
4. ఆవలింతకు అన్న ఉన్నాడు గానీ,
తుమ్ముకు తమ్ముడు లేడనుకుంది ఇటలీ !
చైనా వాళ్ళతో హగ్గులు, పెగ్గులూ పంచుకుంది !
5. మన దీపమని ముద్దాడితే మూతి కాలినట్టు
ఇటలీ కంటుకుంది కరోనా !
6.ఇంతింతై, వటుడింతై అన్నట్లు విజృంభించింది కరోనా!
7. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి లాభం?
8.తూర్పు తిరిగి దణ్ణం పెట్టమని వదిలేసింది ప్రస్తుతం!
9. ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చినట్లు అన్ని దేశాలకు పాకింది కరోనా!
10.తగువెలా వస్తుందిరా జంగమ దేవరా అంటే
బిచ్చం పెట్టవే బొచ్చు మొహం దానా అన్నట్టు
అమెరికా చైనాను నిందించడం మొదలు పెట్టింది !
Read 13 tweets
జమ్మిచెట్టుకి🌿 ఎందుకంత ప్రాధాన్యత

దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది జమ్మిచెట్టు. దసరా సాయంత్రం వేళ జమ్మికొట్టి, ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు
#జమ్మిచెట్టు 🌿
#Jammi #Dussehra
#HappyDussehra #VijayaDashami
బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు. చెట్లని దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలో తరచూ కనిపించేదే! కానీ ఈ దసరా రోజుకీ జమ్మి చెట్టుకీ మధ్య అనుబంధం ఏమిటి అన్న ప్రశ్నకు చాలా సమాధానాలే కనిపిస్తాయి.
కాస్త జమ్మి గురించి...
జమ్మి భారతీయులకు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే భారత ఉపఖండంలోనే ఈ వృక్షం ఉద్భవించిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుకనే రుగ్వేదకాలం నుంచే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారు.
Read 18 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!