Discover and read the best of Twitter Threads about #ttd

Most recents (15)

🚨Things you need to know Before/After the Merge & BEWARE Replay Attacks? 🎯🕵️

The #Merge is less than 10 days away like it or NOT but What should we expect and do with our $ETH, Staking, and #NFTs

Let's explore the Myths/Risk and the Truth around it.

🚨🚀🍻 🧵⚡️🕵️
1/13
Before we start if you haven't checked my last thread 🧵about the forks and the potential #Airdrops that come with #merge make sure to check below :)
Your Like/RT/ comment and follow are highly appreciated. ❤️

2/13
The Merge is tentatively scheduled for September 15. The countdown to #Mainnet is based on a target #TTD of #58750000000000000000 💥

The merge is simply a change of consensus mechanism used to verify #transactions and secure the #network.
Read 14 tweets
#శ్రీవారికి భక్తులు సమర్పించిన #కానుకలు షుమారు 12,000 కోట్లు వివిధ #జాతీయ బ్యాంక్స్ లో #FDల రూపంలో వున్నాయి ...!!

#అందులో 5,000 కోట్లు ఈ #అక్టోబర్,#నవంబర్ లో #mature అవుతాయి..!!
ఇప్పుడు వాటి మీద #వైసీపీ ప్రభుత్వం చూపు పడింది..#వాటిని రాష్ట్ర ప్రభుత్వ #బాండ్స్ లో *40 సంవత్సరాలు పాటు #డిపాజిట్ చేసేలా #TTD చైర్మన్ గారు తీర్మానం చేశారు...!!

#ఇన్ని సంవత్సరాలుగా #టిటిడి కాపాడుకుంటూ వస్తున్న ఈ #నిధులు ఈరోజు వీళ్ళ #పప్పుబెల్లం పథకాలకు #ఖర్చు పెడతారా...?
ఆ చైర్మన్ ఒక్క క్షణం కూడా ఆ #పదవిలో ఉండటానికి #వీల్లేదు తక్షణం #రాజీనామా చేయాలి అనేది #అశేషభక్తుల మనోగతం 🙏🙏🙏🙏🙏 ..!
Read 3 tweets
రాయలసీమ ఆపద్భాందవుడు శ్రీనివాసుడు - రాయలసీమ అభివృద్ధిలో తితిదే పాత్ర - SV యూనివర్సిటీ, ఒక చరిత్ర

తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆంధ్ర మహా సభ ఏర్పడిన తరువాత, ఆంధ్రోద్యమంలో రెండవ విజయం తెలుగువారి కోసం ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటుకు అంగీకారం. Image
(మొదటి విజయం ప్రత్యేక PCC ఏర్పాటుకు అంగీకారం). అప్పటివరకు మద్రాస్ విశ్వవిద్యాలయం ఒకటే మద్రాసు రాష్ట్రంలోని అన్ని భాషల ప్రజలకు అందుబాటులో ఉన్న విశ్వవిద్యాలయం. అనేక తర్జనభర్జనల తరువాత ఆంధ్రవిశ్వకళాపరిషత్తు తాత్కాలిక ప్రధాన కేంద్రాన్ని బెజవాడలో ఏర్పాటు చేశారు.
బెజవాడ తాత్కాలిక కేంద్రంగా ఏర్పడిన ఆంధ్రవిశ్వకళాపరిషత్తు (ఆంధ్రా విశ్వవిద్యాలయము ) శాశ్వత ప్రధాన కేంద్రం ఎక్కడికి మార్చాలి అని చర్చ జరుగుతున్న రోజులవి. బెజావాడ వాళ్లు, రాజమహేంద్రవరం వాళ్లు వాల్తేరు (విశాఖపట్నం ) వాళ్ళు తమ నగరంలో ప్రధాన కేంద్రం ఉండలాంటే తమ నగరంలో ఉండాలని కోరారు.
Read 13 tweets
రాముడు, రామాయణం, రాయలసీమ -Part 6

రాముడు, రామాయణంతో సంబంధం ఉన్న తీర్థాలు, చిత్తూరు జిల్లా

శ్రీకాళహస్తి - వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తిని రాములవారు, సీతమ్మతల్లి దర్శించుకున్నారని ప్రతీతి. శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో రామ లింగం, సీతమ్మ లింగాలను చూడవచ్చు. Image
శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం, వాల్మీకిపురం / వాయల్పాడు

శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం శ్రీరామపంచాయతన క్షేత్రం (శ్రీరామ, భరత, లక్ష్మణ శత్రుఘ్నులు, సీతామాత, హనుమంతుల విగ్రహాలు ఈఆలయంలో దర్శనమిస్తాయి) . ఇక్కడ స్వామివారు వల్మీకం నుండి స్వయం ప్రకటితమయ్యారట.
అందుకే ఈక్షేత్రాన్ని వాల్మీకాపురం అంటరాని ఒకకథనం కాగా ఇక్కడ ఒకప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉండేదని, ఆ మహర్షి తపస్సుచేసిన ప్రాంతం కాబట్టి వాల్మీకపురం అయింది అనిమరోకథనం., బోయలు ఇక్కడ ఎక్కువఉండటం వల్ల బోయలపాడు అనీ అదే కాలక్రమేణా వాయలపాడు అయ్యిందని ప్రతీతి.
Read 9 tweets
కోయిల్ = కోవెల / గుడి / ఆలయం
ఆళ్వార్ = విష్ణుభక్తుడు / హరిభక్తుడు
తిరుమంజనం = స్నానం / మునక

భక్తులు శ్రీవారి ఆలయాన్ని కర్పూరం, గంధం వంటి సుగంధద్రవ్యాలతో కూడిన నీటితో శుభ్రం చేయడాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు.

ఏటా నాలుగు సార్లు స్వామివారికి ఈ తిరుమంజనం నిర్వహిస్తారు 1/2
1. ఉగాది
2. వైకుంఠ ఏకాదశి
3. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
4. అనివార ఆస్థానం

అనివార ఆస్థానం : ఏటా స్వామివారికి లెక్కలు ఒప్పచెప్పే ఉత్సవం

ఓం నమో వేంకటేశాయ

#TTD #Tirumala #Tirupati

2/2
*ఆలయంలో
Read 3 tweets
చరిత్ర విలువ తెలిసిన రాజు

ఏ ఆలయ ఆధునీకరణ చూచినా ఏమున్నది గర్వకారణం
చారిత్రక స్పృహ మృగ్యం, సాంస్కృతిక రక్షణ శూన్యం
ఏ ప్రాచీన దుర్గవైభవం చూసినా ఏమున్నది గర్వకారణం
గుప్తనిధుల పేర ఘనవారసత్వ విధ్వంసం

ఏ కోట, ఆలయం చూసినా ఆధునీకరణ పేరిట శాసనాలు, శిల్పసంపద విధ్వంసం, గుప్తనిధుల తవ్వకాలు Image
అతివంటిది 800 సంవత్సరాల కిందట ఒక రాజు చారిత్రక స్పృహతో, దూరదృష్టితో, భవిష్యత్తును భావితరాలకు అందజేయలన్న తలంపుతో చేసిన ఒక పని నేటి తరానికి ఆదర్శనీయం.

వీర నరసింహ యాదవరాయ

యాదవరాయులు 12-13 శతాబ్దంలో తొండమండల ప్రాంతాన్ని ఏలిన ప్రభువులు. వీరు చోళుల సామంతులు.
వీరిలో వీర నరసింహ యాదవరాయులు ప్రస్తుత తిరుమల, తిరుపతి, కాళహస్తి, కార్వేటినగరం మొదలైన ప్రాంతాలున్న చిత్తూరు, చెంగల్పట్టు జిల్లాలో కొంత ప్రాంతంగా ఉండిన 'తొండమండలం' చోళుల తరపున పాలించేవారు.

అప్పట్లో తిరుమలలో ఆలయ బాధ్యత స్థానత్తార్ అనే అధికారులు చూసేవారు. #TTD #తిరుమల
Read 5 tweets
తిరుమల తిరుపతి దేవస్థానముల-తొట్ట తొలి శాసనం

తిరుమల క్షేత్రం ఎంత పురాతనమైనది? అక్కడి ఆలయాలపై శిలాశాసనాలు ఏమి చెప్తున్నాయి? తిరుమలలో లభ్యమవుతున్న శాసనాలలో అత్యంత పురాతన శాసనం ఏది?

దాదాపు 2000వేల సంవత్సరాల ప్రాచీన తమిళ సంగం సాహిత్యంలో తిరుమల ప్రస్తావన ఉంది.

-ప్రతీకాత్మక చిత్రం ImageImage
ఈ కావ్యాలలో తిరుమలను వేంగడం గా పేర్కొనడం జరిగింది. పురాణాలు తిరుమలను ఆదివరాహ క్షేత్రంగా పేర్కొన్నాయి.

ఇక శాసనాల విషయానికి వస్తే తిరుమల- తిరుపతి ఆలయాల్లో లభ్యమవుతున్న శాసనాల్లో మొట్టమొదటి శాసనం పల్లవుల కాలంలో వేయించినది .

#TTD #Tirumala #Inscriptions #Chittoor
51సంవత్సరాలు సుదీర్ఘంగా పాలించిన పల్లవ రాజు దంతివర్మ అధికారులు తిరుచానూరులో వేయించిన రెండు శాసనాలు అత్యంత పురాతన శాసనాలుగా తిరుమల శాసనాల పరిష్కర్త శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పేర్కొన్నారు. దంతివర్మ క్రీ.శ. 795 నుండి 846 ( 830?) సంవత్సరం వరకు పాలించారు.
Read 8 tweets
తిరుమల - తెలుగు శాసనాలు

తిరుమలలో లభ్యమవుతున్న శాసనాలలో సింహభాగం తమిళభాషలో ఉన్నవి. శ్రీకృష్ణదేవరాయల ముందువరకు తిరుమలలో లభ్యమవుతున్న శాసనాలలో కేవలం ఒకటి మాత్రమే తెలుగులో ఉన్న శాసనం. ఆ ఒక్క శాసనం సాళువ మంగిదేవ మహారాయ శాలివాహక శకం 1281లో (క్రీ.శ 1359 ) వేయించిన శాసనం. #తిరుమల #TTD Image
తిరుమల - తిరుపతి దేవస్థానాలలో లభ్యమవుతున్న శాసనాలలో మొదటి శాసనం పల్లవరాజు దంతి వర్మ కాలంలో వేయించిన శాసనం. (క్రీ.శ 830 /846).శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సింహాసనాన్ని అధిష్టించిన సంవత్సరం క్రీ.శ 1509. అనగా దాదాపు 700 సంవత్సరాల తిరుమల శిలాశాసనాలలో కేవలం ఒక్కశాసనం మాత్రమే తెలుగులో
వేయించబడింది.

700 సంవత్సరాలలో తిరుమలలో తొలి తెలుగు శాసనంవేయించిన ఈ సాళువ మంగు బుక్కరాయ సైనికాధికారుల్లో ఒకడు. విజయనగర సామ్రాజ్య దక్షిణ దండయాత్రలలో, విస్తరణలో ప్రధాన భూమిక పోషించాడు. మధురా విజయంలోనూ, శ్రీరంగ ఆలయ పునరుద్ధరణలోనూ సాళువ మంగు ప్రధాన పాత్ర పోషించాడు.
Read 4 tweets
పాపవినాశనం

శ్రీవారు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో ప్రతీ రాయి, రప్ప, వాగు - వంక, కొండ - కోన పవిత్రమే. తిరుమలలో ఉన్న అనేక దివ్య తీర్థాలలో ఒకటి పాపవినాశనం తీర్థం. ఈ తీర్థంలో స్నానామాచరిస్తే సకల పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ తీర్థానికి 'పాపవినాశనం' అన్న పేరు వచ్చింది.
ఒకప్పుడు స్వామివారి కైంకర్యాలకు పాపవినాశనం జలాన్నే వాడేవారట.

సంకీర్తనాచార్యుడు అన్నమయ్య 'పావినాశనం' తీర్థాన్ని తన కీర్తనలలో ఈ విధంగా వర్ణించాడు

ప్రఖ్యాతి చెందిన పాపవినాశనం తీర్థంలో పాపాలు పగిలి పరుతున్నాయని ఒక చోట, పామరులను అమరులు చేయు పాపవినాశనం అని మరో చోట రాశారు. Image
“అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము” అన్న కీర్తనలో ( అధ్యాత్మ సంకీర్తన - రేకు: 37-1 సంపుటము: 1-227) అన్నమయ్య 'పావినాశనం' ఈ విధంగా వర్ణించాడు

ప్రాకటంబైన పాపవినాశనములోని
భరితమగు దురితములు పగిలి పారుచునుండ
ఆకాశగంగ తోయములు సోఁకిన భవము
లంతంత వీఁడి పారఁగను

#Ravishing_Rayalaseema Image
Read 8 tweets
I'm not sure why the @PMOIndia @HMOIndia @narendramodi @AmitShah is showing blind eye to this? Why aren't you doing something about this xistian govt trying to sell away all the #TTD lands? Does @ysjagan dare to take over majid and churches properties?
#SaveTTDAssets #SaveTTD
Not sure what @BJP4India @VHPDigital @BJP4Andhra @klnbjp are doing? How long are you going to be inactive and allow such atrocities to happen? @TigerRajaSingh @BJP4Telangana @Arvindharmapuri @bandisanjay_bjp @kishanreddybjp @KarunaGopal1 @kochattil Can we do something to stop it
Read 5 tweets
మనం నిత్యం వినే శ్రీవారి గోవింద నామాలలో

విరజతీర్థస్థ గోవిందా ! విరోధి మర్దన గోవిందా అని ఉంటుంది

విరజతీర్థస్థ గోవిందా అంటే అర్థం తెలుసా ?

విరజాతీర్థ వాసి శ్రీనివాసా అని అర్థం

తిరుమలలో ఉండే 108 దివ్యతీర్థాలలో విరజాతీర్థం ఒకటి.

చిత్రం : ఆకాశగంగ తీర్థం, తిరుమల Image
విరజ అంటే రజము లేనిది అనిఅర్థం. అంటే మాలిన్యం లేనిది అని భావం. విరజా నది వైకుంఠంలో ప్రవహించే ఒక దివ్య నది. ఈనది ప్రస్తావన పురాణాలలో కూడా ఉంది. శ్రీకృష్ణుని ఇష్టసఖి అయిన రాధ చెలికత్తెల్లో విరజ ఒకరు. అయితే విరజ కృష్ణునికి కూడా సఖిగా మారి రాధ అగ్రహానికి గురయ్యి నదిగా మారిందట.
తిరుమల ఆలయ ప్రాకారంలో ఉన్న ఒక బావికి విరజా తీర్థం అని పేరు.ఈ విరజా తీర్థం ఆనందనిలయంలో (గర్భగుడిలో) స్వామివారి పాదాల కిందుగా ప్రవహిస్తూ ఉంటుందని ప్రతీతి. అందుకే స్వామివారి పాదాలు నిత్యం తడిగా ఉంటా (డేవ)యట.

#Chittoor_Templees #Tirumala #Tirupati #Ravishing_Rayalaseema
Read 4 tweets
ఏప్రిల్ 6 - తిరుమల తిరుపతి దేవస్థానముల నిత్యాన్నదాన పథకం దినోత్సవం

శ్రీవారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని చూడటానికి దేశం నలువైపులనుండి భక్తులు వస్తూ ఉంటారు.

#తితిదే #TTD #Tirumala Image
స్వామివారి సన్నిధిలో అటువంటి భక్తుల ఆకలి తీర్చడానికి వెంకటేశ్వర నిత్య అన్నదానం పథకం 1985 ఏప్రిల్6 వ తేదీన రోజూ రెండు వేలమందికి ఉచిత భోజనం అందించేవిధంగా మొదలైంది. నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభమైన అన్నదాన పథకం ఇంతితై వటుడింతై అన్నవిధంగా
నేడు మూడు పూటలా రోజుకు సుమారు 1,70,000 మందికిపైగా, వారాంతరాల్లో 2 లక్షలకు పైగా భక్తులకు తితిదే భోజనం అందిస్తోంది. మొదట్లో పరిమిత టోకెన్లు ఇచ్చేవారు, తరువాత దర్శనం చేసుకునేవారికే టోకెన్లు ఇచ్చేవారు. ఇప్పుడు దర్శనంతో సంబంధం లేకుండా, అనేక చోట్ల అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు.
Read 8 tweets
నేత్ర దర్శనం - నిత్య నేత్ర దర్శనం

శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. తిరుమల శ్రీవారిని నిత్యం పూమాలలతో, ఆభరణాలతో, చీనాంబరాలతో అలంకరిస్తూ ఉంటారు. శ్రీవారికి వివిధ కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు.

#TTD #తిరుమల #నారాయణవనం #చిత్తూరు
#Rayalaseema_Temples ImageImage
శ్రీవారి తిరునామం, నుదుటిన కస్తూరి వంటివి అలంకరించడం వల్ల స్వామివారి కన్నులు మామూలు రోజుల్లో భక్తులకు పూర్తిగా కనిపించవు.కానీ గురువారం ఉదయం పూజ అయిపోయిన తరువాత మూలవిరాట్టుకు ఆభరణాలు, పూమాలలు తీసేస్తారు. ఆ రోజు స్వామి కేవలం అంగవస్త్రాలతో (ఉత్తరీయం, ధోతీ ) దర్శనమిస్తారు.
ఆ రోజు స్వామివారికి తిరునామం, నుదుటిన కస్తూరి చిన్నగా అలంకరించడం వల్ల, కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి. అందుకే ఆ దర్శనాన్ని నేత్ర దర్శనం అంటారు.

గురువారం నాడు స్వామివారికి ఉన్నపెద్ద నామాన్ని తీసేసి, కనుబొమ్మల మధ్య పట్టే విధంగా చిన్న నామం అలంకరిస్తారు.
Read 6 tweets
తూర్పు కనుమలు -ఆది శేషుడు

చుట్టలు చుట్టుకుకుని పాలసముద్రంలో శ్రీమహావిష్ణువుకు తల్పముగా ఉంటాడు ఆదిశేషుడు. ఏడు పడగలతో శ్రీవారికి గొడుగు పడుతుంటాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక వైపు కర్నూలు జిల్లాలో నల్లమల శ్రేణి, మరోవైపు చిత్తూరు జిల్లాలో శేషాచలం కొండలతో తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి ImageImage
అటు నల్లమలకు పైన కానీ, ఇటు శేషాచలం కొండల కింద కానీ మరే పర్వత శ్రేణి లేక కర్నూలు నుండి చిత్తూరు వరకు విస్తరించిన ఈ కొండలు ఒకే భాగంలాగా ఉన్నాయి. అయితే తూర్పు కనుమలలోని ఈ భాగాన్ని తరచిచూస్తే మధ్యలో అనేక కొండలు, గుట్టల శ్రేణులతో చుట్ట చుట్టుకుని ఉన్న ఆదిశేషుని రూపం పోల్చి ఉన్నాయి.
ఆది శేషుని పడగల వద్ద తిరుమల, మధ్య భాగంలో నవనారసింహ అహోబిల క్షేత్రం, చుట్ట చుట్టుకుని ఉన్న ఆదిశేషుని చివరి భాగంలో (తోక) జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం ఉన్నాయి. ఆది శేషుని నోటి వద్ద పంచభూత లింగ క్షేత్రమైన (వాయులింగం) శ్రీకాళహస్తి ఉంది. విశేషంఏమిటంటే ఆదిశేషునికి ఏడు పడగలు. Image
Read 5 tweets
సీమ సిత్రాలు

తిరుమల తిరుపతి దేవస్థానములు - సంగీత సామ్రాజ్ఞి ఎం. యెస్. సుబ్బలక్ష్మి

శంఖులో పోస్తేనే తీర్థం అంటారు. ఎటువంటి కీర్తన అయినా ఏ కృతి అయినా ఎం. యెస్. సుబ్బలక్ష్మి గారి గొంతుతో పడితేనే వాటికి సంపూర్ణ దైవత్వం అలవడుతుందని చాలామంది నమ్మకం.
1/n #TTD #Tirumala #Tirupati
నేను కేవలం ఈ దేశానికే ప్రధానిని, సుబ్బలక్ష్మి సంగీత సామ్రాజ్యానికే సామ్రాజ్ఞి అని నెహ్రు గారు ఒక సందర్భంలో అన్నారు. అంతటి విదుషీమణి ఎం. యెస్. సుబ్బలక్ష్మి. వారి భర్త సదాశివం. జన్మతః తమిళురాలు అయిన సుబ్బలక్ష్మి గారికి తిరుపతి తిరుమల దేవస్థానములతో అవినాభావ సంబంధం ఉంది.
2/n
వృద్ధాప్యంలో సుబ్బలక్ష్మి, సదాశివం దంపతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఎలాగైనా ఆదుకోవాలని కంచి కామకోటి అప్పటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి (మహా పెరియవార్) అప్పటి తితిదే కార్యనిర్వాహక అధికారి (EO) PVRK ప్రసాద్ గారికి ఒక టెలిగ్రామ్ పంపుతారు.
3/n
Read 16 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!