Discover and read the best of Twitter Threads about #ఎన్టీఆర్

Most recents (10)

*#NTR నాకు డ్రైవర్ అయిన వేళ.*

నేను #ఎన్టీఆర్ గారిని రెండు సార్లు చూశాను.
మొదటి సారి, తనే స్వయంగా బండి నడుపుతూ, నాతో విహార యాత్ర చేశారు.
ఇది ఎలా జరిగిందంటే... + Image
అవి మేము హైదరాబాద్ శివార్లలో వనస్థలిపురం కు మారిన కొత్త రోజులు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పై, హైదరాబాద్ కు చాలా దూరంలో ఉండడంతో, "విజయవాడ నుంచి ఎప్పుడొచ్చారు?" అని, "అవస్థల పురం" అని గేలి చేసేవారు.
+
ఇంతకీ వనస్థలిపురం కు ఆ పేరు ఎందుకొచ్చిందంటే, ఆ కాలనీ మహావీర్ హరిణ వనస్థలి అనే జింకల ఉద్యానవనం కు సమీపంగా ఉండడంవల్ల. 3600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉద్యానవనంలో పర్యాటకుల కోసం, ఆ యేడు సఫారీ సర్వీస్ ను ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవానికే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి NTR వచ్చారు. +
Read 15 tweets
సీనియర్ #ఎన్టీఆర్, #నాగేశ్వరరావు మధ్య ఉన్న పోలికలు !

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నటులుగానే కాక స్నేహపూర్వకంగా మెలిగిన నటులుగా ఎన్టీఆర్, ఎన్నార్ లకు పేరుంది. సినిమాల పరంగా ఇద్దరి మధ్య ఎంత పోటీ ఉన్నా బయట మాత్రం ఎన్టీఆర్, ఎన్నార్ ఒకరికొకరు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు.
#ఎన్టీఆర్, #ఎన్నార్ స్నేహం గొప్పదనం గురించి ఇప్పటికీ చిత్రపరిశ్రమ అగ్ర రచయితలు, దర్శకులు కథలుకథలుగా చెబుతూ ఉంటారు.

ఎన్టీఆర్, ఎన్నార్ కలిసి 14 సినిమాల్లో నటించారు.

వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కిన తొలి సినిమా #పల్లెటూరి_పిల్ల కాగా చివరి సినిమా #సత్యం_శివం. ఈ 14 సినిమాలలో దాదాపు
అన్నిసినిమాలు అద్భుతమైన విజయాలే కావడం గమనార్హం.

సంవత్సరంలో విడుదలయ్యే మొత్తం చిత్రాల్లో దాదాపు సగం చిత్రాలు ఎన్టీఆర్, ఎన్నార్ లవే ఉండేవని, వాళ్లకు సినిమాల పట్ల ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ వల్ల తక్కువ సమయంలోనే సినిమా చిత్రీకరణ పూర్తయ్యేదని విశ్లేషకులు చెబుతున్నారు.
Read 7 tweets
#నర్తనశాల

తన నట సామర్థ్యం మీద నమ్మకం ఉన్న నటుడు ఎలాంటి పాత్రని చేసి మెప్పించినా, ఇమేజితో సంబంధం లేకుండా అభిమానులు ఆదరిస్తారని య్యేళ్ళ క్రితమే నిరూపించిన తెలుగు నటుడు #నందమూరి_తారకరామారావు. అప్పటికే వందకి పైగా సినిమాల్లో నటించి, అటు పౌరాణికాలు, ఇటు సాంఘికాలు మధ్యే మధ్యే జానపదాలు
ఇలా అది ఇది ఏమని అన్ని రకాల సినిమాలు చేస్తూ ఆంధ్రదేశాన్ని ఉపేస్తున్న వేళ, అటూ ఇటూ కాని #బృహన్నల పాత్ర పోషించడమంటే ఏ నటుడికైనా అదో పెద్ద సాహసమే..

పైగా ఆ పాత్రలో కనిపిచాల్సింది ఏ ఐదు పది నిమిషాలో కాదు, మూడుగంటల పాటు సాగే సినిమాలో దాదాపు రెండున్నర గంటల పాటు!! అయినప్పటికీ సాహసానికి
సై అన్నాడు #తారకరాముడు. ఫలితమే రాజ్యం పిక్చర్స్ నిర్మించిన '#నర్తనశాల' అనే #విరాటపర్వం. మరో రెండేళ్లలో యాభయ్యేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ పౌరాణిక చిత్రానికి దర్శకుడు 'పౌరాణిక బ్రహ్మ' గా పేరుపొందిన #కమలాకర_కామేశ్వర రావు. కథ, మాటలు, పద్యాలతో పాటు కొన్ని పాటలని రాసింది సముద్రాల
Read 21 tweets
వెండితెర చేసుకున్న పుణ్యం – #శంకరాభరణం

సరిగ్గా 41 ఏళ్ళ క్రితం 1979లో…..

"ఏంటి ఈ సినిమాలో ఎవరికి తెలియని ఓ ముసలాయన హీరోనా ?"

"హవ్వ, వేశ్య పాత్రను హీరోయిన్ గా చూపించడం ఏమిటో విడ్డూరం కాకపోతే"

"12 పాటలు పెడితే ఎవడు చూస్తాడు స్వామి"

"శాస్త్రీయసంగీతం మీద కథనా, నిర్మాత ఎవరో పాపం"
"మసాలాలు లేకుండా తీస్తారా, ఏంటి చిత్ర పరిశ్రమలో ఉండాలనే"

జె వి సోమయాజులు గారి జీవితంలో #శంకరాభరణం , #త్యాగయ్య సినిమాలు అద్భుతమనే చెప్పాలి.

శంకరాభరణం సినిమా గురించి ప్రకటన వచ్చినప్పుడు, షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీని వందసార్లకు పైగా డిస్ట్రిబ్యూటర్లకు వేసినప్పుడు నిర్మాత
ఏడిద నాగేశ్వర రావుగారు అందుకున్న వ్యాఖ్యలు ఇవి. అప్పుడప్పుడే తొలి అడుగులు వేస్తున్న ఆయనను ఇవేవి భయపెట్టలేదు. వ్యాపారం జరగక పెట్టుబడయినా వెనక్కు వస్తుందో రాదోనన్న అనుమానాల మధ్య తచ్చాడుతున్నారు. విశ్వనాథ్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే చిత్రం తీసిచ్చారని తనతో పాటు బృందం మొత్తానికి
Read 41 tweets
#ఎన్టీఆర్, #సావిత్రి తెలుగు సినీ కళామతల్లి కిరీటంలో వన్నె తరగని వజ్రాలు.

ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు నుంచే వారిద్దరూ సహనటులు. అదెలాగంటే... ఎన్టీఆర్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో స్థాపించిన 'ఎన్ ఏ టి' నాటక సంస్థలో ఎన్టీఆర్, జగ్గయ్యలతో కలిసి కొన్నాళ్ళు నాటకాలు వేశారు సావిత్రి. Image
ఎన్టీఆర్ సరసన 'పల్లెటూరు' చిత్రంలో తొలిసారి కథానాయికగా నటించారు సావిత్రి. అదివరకు ఎన్టీఆర్ హీరోగా నటించిన 'సంసారం', 'పాతాళ భైరవి', 'పెళ్ళిచేసి చూడు' చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన సావిత్రికి 'పల్లెటూరు' సినిమా కథానాయిక స్థాయినిచ్చింది.

ఆ తర్వాత 'మిస్సమ్మ', 'మాయాబజార్', Image
'గుండమ్మకథ', 'నర్తనశాల', 'పాండవవనవాసం'.. ఇలా ఎన్నెన్నో అద్భుత చిత్రాలలో వీరిద్దరూ కలిసి ప్రేక్షకుల మనసు దోచారు. ‘కన్యాశుల్కం’ సినిమాలో 'మధురవాణి'గా సావిత్రికి, 'గిరీశం'గా ఎన్టీఆర్ కు విభిన్నమైన పాత్రలు లభించాయి. ఈ పాత్రల్లో వీరిద్దరూ పోటీపడి Image
Read 7 tweets
వామ పక్ష భావాల పత్రికలనో, మేధావులమనో చెప్పుకుంటూ ఎంత విద్వేషం జల్లినా...

#ఎన్టీఆర్ లేని లోటు ఇప్పటి వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన చారిత్రక, పౌరాణిక సినిమాలు చూస్తే కొట్టవచ్చినట్లు తెలియడం లేదూ ?

#ఎన్టీఆర్ ఏదో ఒక వర్గానికో, ఒక పార్టీకో చెందిన వ్యక్తి కాదు. Image
అద్భుతమైన కళాకారుడు. నటుడు, దర్శకుడు, చిత్రకారుడు, రచయిత. చిత్ర సీమలోని అన్ని భాగాలలో ప్రావీణ్యం కలవాడు.

ఈ టీ వీ సినిమా (Tatasky Chanel 1440) లో సాయంకాలం 7 గంటలకు వస్తున్న ఈ వారపు సినిమాలు చూడండి. మీ పిల్లలకు చూపించండి. Image
1) 01/10/2022, శనివారం : మిస్సమ్మ 1955

సంక్రాంతి కానుకగా 12 జనవరి 1955న విడుదలై జయభేరి మోగించి 13 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది.

2) 02/10/2022, ఆదివారం : మల్లీశ్వరి 1951

బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో రామారావు, భానుమతిల నటన ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా రూపుదిద్దుకున్న చిత్రం Image
Read 11 tweets
ఆమె..’తెలుగు కళామతల్లి’ కన్న తొలి ఆడపడుచు !

#పసుపులేటి_కన్నాంబ.. తొలితరం కథా నాయక, ఆ తర్వాత కాలంలో ప్రధాన సహాయ నటి. సహజంగా చరిత్ర ఆసక్తిగా ఉంటుంది, కానీ కొందరి చరిత్ర విషాదంతో కన్నీళ్ల మయమైపోయి ఉంటుంది. కన్నాంబ గారి జీవితం కూడా చాలా మలుపులు తిరిగింది. ఆ మలుపుల లోతులను చూసి కలత Image
చెందే కంటే.. వెండితెరపై ఆమె మెరుపులను తలుచుకోవడం ప్రేరణ కలిగిస్తోంది.

కన్నాంబతో నటన అంటే మహామహులే జాగ్రత్తపడేవారు. అసలు తెలుగు సినిమాకి నటనంటే ఏమిటో, డైలాగ్ డెలివరీ అంటే ఏమిటో చెప్పిన మొట్టమొదటి సినిమా తార. సినిమాల్లో #కన్నాంబ ఏమి నేర్చుకోలేదు, కన్నాంబే సినిమాలకు ఎంతో నేర్పింది. Image
అప్పట్లో తమిళ, తెలుగు భాషల రెండింటిలోనూ సూపర్ స్టార్ గా వెలుగొందిన నిజమైన స్టార్ ఆమె. మొదటి తరం సూపర్ స్టార్ నాగయ్య గారితో సమానంగా పారితోషికం తీసుకున్న ఏకైక నటి కూడా కన్నాంబగారే.

కన్నాంబ ముందు నటించేటప్పుడు #ఎస్వీయార్, #ఎన్టీఆర్ కూడా భయపడేవారు. ఆమె ముందు బాగా నటించకపోతే.. Image
Read 10 tweets
నటసార్వభౌముని విశ్వరూపం #సీతారామ_కళ్యాణం

#నందమూరి_తారకరామారావు.. దర్శకుడిగా తెలుగుతెరపై చేసిన తొలిసంతకం.

నటసార్వభౌమ నందమూరి తారక రామారావు రెండోసారి రావణుడి పాత్రలో మెరిసిన చిత్రం 'సీతారామ కళ్యాణం'. ఇందులో లంకాధీశుడిగా ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు. అలాగే ఈ సినిమాతో తొలిసారి Image
దర్శకుడిగా మారారు తారక రామారావు.

#శ్రీ_సీతారామకళ్యాణం..

ఎన్టీఆర్ కెరీర్​లో అపూరుప చిత్రరాజంగా ఎన్నదగిన.. ఎన్నో వైవిధ్య చిత్రాలు తీయడానికి సూచనగా మారిన నందమూరి వారసుడు బాలకృష్ణకు అత్యంత ప్రీతిపాత్రమైన చిత్రం 'సీతారామకళ్యాణం'.

నందమూరి తారక రామారావు సినీరంగ ప్రవేశం చేసి.. Image
అప్పటికి పుష్కర కాలమైంది. ఈ 12 ఏళ్లలోనే జానపద, పౌరాణిక పాత్రలెన్నింటిలోనో ఆయన మెప్పించారు. 'మాయాబజార్​'లో శ్రీకృష్ణ పాత్రతో ఆరాధ్యుడిగా మారిపోయారు. అంతకుముందే 'భూ కైలాస్' సినిమాలో రావణుడిగానూ మెప్పించారు. అయితే మరోసారి రావణ పాత్రధారిగా సినిమాలో నటించాలని ఎన్టీఆర్ మొదట అనుకోలేదు. Image
Read 25 tweets
🌻#ఆత్మీయులందరికీ #ఆదివారం #శుభోదయం 🌻💝🙏💝🌻...

🌻మా కార్యకర్తలం అంటే ...!!

🌻డబ్బుకు లొంగం ...!!

🌻అధికారానికి లొంగం ...!!

🌻రాజకీయానికి లొంగం..!!

🌻ప్రాణాలకు బయపడం ....!!

🌻ఎవరికీ హాని తలపెట్టం...!!

🌻ఆస్తులు పోయినా ...!!

🌻అవమానాలకు గురైనా .....!!

#TDPTwitter
🌻కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా ...!!

🌻కులాల చిచ్చు పెట్టినా ...!!

🌻మత విద్వేషాలు తెచ్చినా...!!

🌻మా మధ్య చిచ్చు పెట్టేందుకు వందమంది విభీషణులున్నా ...!!

🌻అదరం,బెదరం,చెక్కుచెదరం ...!!

🌻పార్టీని వదలం, పార్టీ జెండాను వదలం ...!!
🌻నిన్న మనది ...!!

🌻నేడు మనది కాకపోవచ్చు ...!!

🌻#కానీ రేపు #మనదే 🔥...!!

🌻#జై #తెలుగుదేశం ✊...

🌻#జోహార్ #ఎన్టీఆర్ 🙏...

🌻#సాహో #చంద్రబాబు ✌... ImageImage
Read 3 tweets
చంద్రబాబు గారు 18 స్టెలు తెచ్చుకున్నాడని కూస్తే, ఈ పోస్ట్ తో కోట్టండి.. వివరాలు వివరంగా ఉన్నాయ్ Bookmark చేసుకోండి.. 🙏

ఇప్పుడు #చంద్రబాబు మీద 2 కేసులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి....

#NTRBdayFestBegins
Case-1;
1997
కేస్ వేసింది....రెడ్యా నాయక్
కేస్ డీటెయిల్స్:: #ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్థలం లీజు విషయం లో
తీర్పు:;కేస్ కొట్టివేసిన హైకోర్టు
12-9-1998 లో
Case-2
1998,99 మరియు 2000
కేస్ వేసింది వైస్సార్
కేస్: చంద్రబాబు కు అక్రమ ఆస్తులు ఉన్నాయి అని ఆరోపించి,దాని మీద గోవేర్నెర్ విచారణ కోసం అడిగితే,విచారం అవసరం లేదు అని అన్నందుకు కోర్ట్ లో కేస్ వేసిన YSR
తీర్పు: గవర్నర్ అధికారం ని మీరు ప్రశ్నించ జాలరు అని కేస్ కొట్టేసిన SUPREM COURT
Read 18 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!