Discover and read the best of Twitter Threads about #కన్నాంబ

Most recents (4)

పుత్తడి జిలుగులు బొమ్మ.. వెండితెర వెలుగుల కొమ్మ హేమమాలిని పుట్టినరోజు నిన్న..

అక్టోబర్ 16వ తేది ప్రఖ్యాత నటి, నిర్మాత, దర్శకురాలు, భరతనాట్య కళాకారిణి, రాజకీయ నాయకురాలు శ్రీమతి #హేమామాలిని గారి పుట్టినరోజు సందర్భంగా.. ఆవిడకి శుభాకాంక్షలు..

సౌందర్య రాశి, చలన చిత్ర అప్సరస,‌ సహజ
స్నిగ్ధ సుకుమారి, హాస విలాస శృంగార నైషధి, మనోజ్ఞ మంజుల మాలిని, మరాళ గమని, విజృంభిణ తరళ తటిల్లత, అభినయ ముద్రాంకిత జావళి మన హేమమాలిని. పేరులోనే పసిడితనం రంగరించిన పడతి. ఒక విలక్షణమైన కథానాయికగా భారతీయ సినిమా పరిశ్రమలో ఆసేతు హిమాచలం వరకు ప్రేక్షకుల హృదయ సింహాసనం మీద ఒక
మహారాణిగా నిలిచిపోయింది. దక్షిణ భారతం నుంచి ఉత్తరాది సినిమా పరిశ్రమలో ఆల్ ఇండియా "డ్రీమ్ గర్ల్" గా ఒక "బ్యూటీ ఐకాన్" గా ఈనాటి వరకు నిలిచింది. అంతటి గొప్ప కళాకారిణి యావత్ భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.

#హేమమాలిని_విలక్షణ_ప్రత్యేకత:

హేమామాలిని గారు ఏ కథానాయికతో
Read 28 tweets
ఆమె..’తెలుగు కళామతల్లి’ కన్న తొలి ఆడపడుచు !

#పసుపులేటి_కన్నాంబ.. తొలితరం కథా నాయక, ఆ తర్వాత కాలంలో ప్రధాన సహాయ నటి. సహజంగా చరిత్ర ఆసక్తిగా ఉంటుంది, కానీ కొందరి చరిత్ర విషాదంతో కన్నీళ్ల మయమైపోయి ఉంటుంది. కన్నాంబ గారి జీవితం కూడా చాలా మలుపులు తిరిగింది. ఆ మలుపుల లోతులను చూసి కలత Image
చెందే కంటే.. వెండితెరపై ఆమె మెరుపులను తలుచుకోవడం ప్రేరణ కలిగిస్తోంది.

కన్నాంబతో నటన అంటే మహామహులే జాగ్రత్తపడేవారు. అసలు తెలుగు సినిమాకి నటనంటే ఏమిటో, డైలాగ్ డెలివరీ అంటే ఏమిటో చెప్పిన మొట్టమొదటి సినిమా తార. సినిమాల్లో #కన్నాంబ ఏమి నేర్చుకోలేదు, కన్నాంబే సినిమాలకు ఎంతో నేర్పింది. Image
అప్పట్లో తమిళ, తెలుగు భాషల రెండింటిలోనూ సూపర్ స్టార్ గా వెలుగొందిన నిజమైన స్టార్ ఆమె. మొదటి తరం సూపర్ స్టార్ నాగయ్య గారితో సమానంగా పారితోషికం తీసుకున్న ఏకైక నటి కూడా కన్నాంబగారే.

కన్నాంబ ముందు నటించేటప్పుడు #ఎస్వీయార్, #ఎన్టీఆర్ కూడా భయపడేవారు. ఆమె ముందు బాగా నటించకపోతే.. Image
Read 10 tweets
#దసరా_ప్రత్యేకం

వెండి తెర కళా సింహాసనం అధిష్టించిన అభినయ సామ్రాజ్ఞి #కన్నాంబ గారి కొలువులో కొలువైన నట దిగ్గజాలు

దసరా పండగ సందర్భంగా ఒక విలక్షణమైన సమీక్ష మీ కోసం:

భారతీయ చలనచిత్ర రంగంలో దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు ప్రాంతీయ సినిమా ఒక ప్రత్యేకమైనది. ప్రపంచ ఫిల్మ్ ఫీల్డ్ లో Image
తెలుగు సినిమా తెలుగు కళాకారులది విభిన్న శైలిలో పోలిక లేకుండా విశ్వవ్యాప్తంగా ఉనికి చాటుకుంది.

ఈనాడు మన పేజీలో ఒక విలక్షణమైన సమాచార సమాహారం అందజేస్తున్నాము ఆస్వాదించండి, ఆనందించండి అందరితో పంచుకోండి. తొలినాటి నుండి మధ్య తరం వరకు తమ వైవిధ్య నటనతో వెండితెరపై అభినయానికి చిరునామా Image
అయిన మన నటిమణులు #కన్నాంబ గారి నుంచి #రమాప్రభ దాకా సినిమా పరిశ్రమలో వివిధ విలక్షణమైన పాత్రలు పోషించి తెలుగు సినిమాకు మకుటంలేని వారయ్యారు. ప్రతి వారిది ఒక ప్రత్యేకమైన పద్దతి విన్నూత్న నటనతో తెలుగు సినిమాను బతికించారు. ఇక మనం వారి యొక్క కళా ఔన్నత్యాన్ని నట విశ్వరూపాన్ని వేరే Image
Read 59 tweets
#సతీ_సక్కుబాయి 1935లో విడుదలైన తెలుగు సినిమా,

ఆ తరువాత కడారు నాగభూషణం దర్శకత్వంలో యస్ వరలక్ష్మి గారితో సతీ సక్కుబాయి (1954) సినిమా గాఁ ,

అంజలి దేవి గారితో సతీ సక్కుబాయి (1965) సినిమా గాఁ పునః నిర్మించడం జరిగింది.

తొలి సినిమా గురించి మనకు అంత సమాచారం లేదు,
రెండవ సక్కు మాత్రం అద్భుతమనే చెప్పక తప్పదు, కాకోపోతే కాస్త శోకపుపాళ్లు ఎక్కువ , సతీ సక్కుబాయి (1954) సినిమా లోని పాటలు అద్భుతమే చెప్పాలి, యస్ వరలక్ష్మి గారి నటన, వారి గాత్రంతో ఈ సినిమాన్నిఇంకో స్థాయిలోకి తీసుకుని వెళ్లారు.

ఈ మూవీ లో అనుకున్నంత స్థాయిలో హాస్యం లేకపోవడం, ఎక్కువగా
అసలు విషయం పైన దర్శకుడు దృష్టి సారించడంతో హృదయానికి కాస్త భారంగా ఉంటుంది,

#కన్నాంబ గారి నటనకి పరాకాష్ట, #వరలక్ష్మి #కన్నాంబ గార్ల నటన అద్భుతం , వారిద్దరి మధ్య నడిచే సన్నివేశాలు కట్టి పడేస్తాయి , రేలంగి , వరలక్ష్మి భార్య భర్తలుగా నటించడం విశేషం. గయ్యాళి పాత్రలో కన్నాంబ , కనకం
Read 9 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!