Discover and read the best of Twitter Threads about #తెలుగు

Most recents (24)

Daily use English / Telugu words meanings

సోషల్ మీడియా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇకపై జర్నలిస్ట్ లు తెలుసుకోవాల్సిన #తెలుగు పదాలు

ప్రస్తుత సీనియర్ జర్నలిస్ట్ లు ఈ పదాలతో ఆప్ డేట్ కావాల్సిందే...!!

(1)అంతర్జాలం = internet

(2)ముఖ గ్రంథం = Facebook

(3)ఏమిటది = whatsapp
(4)దరఖాస్తు = app

(5)అన్వేషిక = Google

(6)క్రీడా సంగ్రహణము= Play store

(7)మీ ఆజ్ఞ నాళం = YouTube

(8)వితరిణి = share it

(9)జాబితా = file

(10)తపాల కట్ట = G-mail

(11)గణన యంత్రం = computer

(12)4వ తరం = 4G

(13)కీలక ఫలకం = keyboard

(14)చలన భాషిణి = Mobile phone
(15)నిస్తంత్రి భాషాంత్రర్జాల యంత్రం = WiFi.

(16)ధర్శన చెలికాడు = vidmate

(17)విస్తరణ క్షేత్రం = website

(18)సమాచార దూత = messenger

(19)సల్లాపములు = chatting

(20)ప్రతిబింబం = image

(21)శ్రవణ సంబంథి = audio

(22)దృశ్య సంబంథి = video

(23)సమాచార నిమ్న బదిలి = download
Read 5 tweets
#తెలుగు_బతికేదెన్నడు?

‘తెలుగు, తమిళ భాషల్ని ఉత్తర దేశీయులకి కూడా నేర్పించాలి’ అని, భారత ప్రధాని సెలవిచ్చారు. ‘పెద్ద దానికి పెళ్లి లేదు, కడదానికి కల్యాణం’ అన్నట్టుంది. తెలుగు వాళ్లే తెలుగును పట్టించుకోకుండా వుంటే, ఇతర భాషల వాళ్లు నేర్చుకుంటారా? తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ
తెలుగుకి ఎంత గౌరవం ఇస్తున్నాయో చూస్తున్నాం. గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమం కొనసాగించాలంటున్నారు గానీ, తెలుగు గురించి కాదు. తమిళ రాష్ట్రం తమ భాషకి ఇచ్చే ప్రాధాన్యాన్ని చూసి మనం తలదించుకోవాలి. ఇంగ్లీషు దినపత్రికల్లో కూడా, ప్రభుత్వ ప్రకటనలు – పూర్తి పేజీ – తమిళంలోనే వుంటాయి.
ఎక్కడ చూసినా తమిళం ప్రముఖంగా వుంటుంది. ఆంగ్లం రెండోది. విదేశీయులు కూడా వచ్చి చదువుకుంటున్న #మధురై కామరాజ్‌ విశ్వవిద్యాలయంలో బోర్డులన్నీ తమిళంలోనే వుంటాయి. కింద ఇంగ్లీషు! #తెలుగు వారికి ఆంగ్లం మీద మోజు. తెలుగు అక్కర్లేదు ఏ ఇంట చూసినా, చక్కని తెలుగు పదాలున్నా – ఇంగ్లీషే పలుకుతారు.
Read 12 tweets
చందమామ పత్రిక ఎలాగైతే నా చిన్నతనంలో తెలుగు వైపుకు మళ్ళించి, ఊహకు రెక్కలు తొడిగిందో, అలానే కౌమారానికి, యౌవనానికి మధ్య కాలంలో నన్ను తీర్చిదిద్దడంలో ఎంతో పనికివచ్చినది ఈ హాసం పత్రిక. ఈ అక్టోబరుకు హాసం పత్రిక ప్రారంభమై 20 ఏళ్ళు నిండి 21 ఏడు ప్రారంభమైంది.
#అభిరుచి #తెలుగు #పత్రిక Image
ఇది ప్రారంభమైన ఏడాదికి కానీ నాకు పరిచయం కాలేదు. అప్పటికి నేను తొమ్మిదో క్లాసు చదువుతున్నాను. మా తాడేపల్లిగూడంలోని సత్యసాయి సేవాసమితిలో ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూంటే పాల్గొనడానికి వెళ్ళినప్పుడు, అక్కడ మా సీనియర్ ఒక అబ్బాయి (పదో తరగతి అన్నమాట అతను చదివేది) ఎదురుపడ్డాడు.
అతను ఆశ్చర్యపోయాడు నువ్వూ ఇక్కడికి వస్తావా అని. ఆ తర్వాత నన్ను కాసేపు ఇంటర్వ్యూ చేశాడు, ఇష్టమైన సినిమాలు, నచ్చే సంగీతం, పుస్తకాలేమైనా చదివావా అన్న టైపులో. అప్పుడు నాక్కూడా (అతనికి తన టైపు జనం ఉండరని గట్టి నమ్మకం కలిగినట్టుంది)
Read 25 tweets
తెలుగువారిలో లోపించిన #మాతృభాషాభిమానం

-- ముత్తేవి రవీంద్రనాథ్ గారి వ్యాసం

తెలుగుల ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం మీద చర్చ ఇది. #తెలుగువారిలో లోపించిన #మాతృభాషాభిమానం వారిలో ఆత్మాభిమానం లోపించడానికి కూడా ఎంతోకొంత మేరకు కారణం అవుతున్నది. Image
#తెనాలి #ఇస్లామ్_పేటలో ఒకప్పుడు తమిళనాడుకు చెందిన లబ్బీ సాయిబులు ఉండేవారు. వారు పచ్చి తోళ్లను కొనుగోలుచేసి, ఊనడం కోసం తమిళనాడులోని #వాణియంబాడి వంటి కొన్ని ప్రదేశాలలో ఉన్న తోళ్ళు ఊనే టానరీలకు పంపేవారు. వారు #తమిళ భాషను తమ #మాతృభాషగానే భావించేవారు. వారు నిత్యం చక్కని Image
తమిళ భాషనే మాట్లాడేవారు. వారి కార్యాలయాలకు ' దినతంతి', 'దిన మణి ', ' అలై ఒషై', 'ఆనంద విగడన్' , 'కుముదం', 'కలకండు' వంటి తమిళ పత్రికలను క్రమం తప్పకుండా తెప్పించుకుని శ్రద్ధగా చదివేవారు. తమిళ దినపత్రికలు ఏ ఒక్కరోజు కాస్త ఆలస్యంగా వచ్చినా వారు ఎంతో తపనపడేవారు. వారి కార్యాలయాల Image
Read 18 tweets
మనము రోజూ వాడే ట్విట్టర్ ఇంకా సులభంగా వాడటానికి ఉపయోగ పడే ఎన్నో బాట్స్ ఉన్నాయి, అలానే మన ట్విట్టరు ఖాతా గురించి ఎంతో ఉపయోగపడే సమాచారం అందించే బాట్స్ కూడా చాలా ఉన్నాయి

వాటిలో కొన్ని ఉపయోగకరమైన ట్విట్టర్ బాట్స్ గురించి ఈ తీగలో చూద్దాం

#తీగ #ట్విట్టర్ #బాట్స్ #twitterbots
పికాసో @pikaso_me

ఏదైనా మీకు నచ్చిన ట్వీటుని మీరు తెరపట్టు ( స్క్రీన్ షాట్ ) తియ్యాలనుకుంటే ఈ బాట్ ఉపయోగ పడుతుంది. ఈ బాట్ ని అనుసరించటం అవసరమొచ్చినప్పు ఆ బాట్ ని టాగ్ చేసి 'స్క్రీంషాట్ థిస్' అని ఆంగ్లములో రాయాలి.
థ్రెడ్ రీడర్ ఆప్ @threadreaderapp

ట్విట్టర్లో ఎందరో అద్భుతమైన తీగలు రాస్తుంటారు చాలా సార్లు ఆ తీగల్ని దాచుకోవాలి అనుకుంటాము అలాంటప్పుడు ఈ బాట్ ఉపయోగపడుతుంది. ఏదైనా తీగని ఒక గొలుసు ద్వారా చూడాలి అనుకుంటే ఈ బాట్ ని అనుసరించండి...
Read 12 tweets
తెలంగాణము వారు చదవవలసిన పుస్తకములు -1 వ భాగం.
మన #తెలంగాణ గురించి ఎన్నో విషయములు-భౌగోళిక, చారిత్రక,భాషా, కళా సాంస్కృతిక అంశములు,ఆలయాలు, ఎన్నో కారణముల వలన సరిగ్గా సమగ్రముగా గ్రంథస్తం కాలేదు. అయినప్పటికీ భిన్న మూలాల నుండి మనం మన తెలంగాణ గురించి సమగ్రముగా అర్థం జేసుకొనవచ్చు 1/n
1. మొదట మన కవుల గురించి మన భాషా అస్థిత్వం గురించి.
గోలకొండ కవుల చరిత్ర (సురవరం ప్రతాప రెడ్డి గారు): ప్రతి #తెలంగాణ విద్యార్ధి తప్పక చదివి అర్థం చేసుకొనవలసిన సంచిక
"నైజామాంధ్ర /తెలంగాణము లో కవులు పూజ్యం(లేరు)" అని ముడుంబై గారు ఏకంగా గోలకొండ పత్రికలోనే రాస్తిరి, అవగాహనాలేమితో.
అందుకు ప్రతి దూషణ చేయక, తెలంగాణలోని ఘనమయిన సారస్వత(సాహిత్య) సంపద బయటి వారలకు తెలియక పోవుట వలన, తెలంగాణ కవులకు బయట ప్రపంచముతో సంబంధము లేకపోవుట వలన ఆ అపోహ వచ్చినది అని హేతుబద్ధముగా చెప్పి. ప్రాచీన కాలము నుండి తెలంగాణము ఆంద్ర మాతకు విహార రంగస్థలమని చెప్పుచూ,
Read 31 tweets
మొన్న విఖ్యాత తెలుగు నిఘంటుకారుడు, రచయిత, విద్యావేత్త, భాషా శాస్త్రవేత్త ఆచార్య జి.ఎన్. రెడ్డి గారి ౯౪వ జయంతి. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా, ఉపకులపతిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులుగా కూడా ఉండేవారు.
ఆయన సంపాదకత్వంలో "తెలుగు పర్యాయపద నిఘంటువు," "తెలుగు నిఘంటువు (౧౯౭౩)," "ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు (౧౯౭౮)," "మాండలిక వృత్తి పదకోశం (కుమ్మర, వడ్రంగం)" వంటి పదకోశాలు వెలువడ్డాయి.
ఆయన ఆంగ్లంలో "ఎ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్," "ది ఇన్‍ఫ్లుయన్స్ ఆఫ్ ఇంగ్లిష్ ఆన్ తెలుగు లిటరేచర్" లాంటి సిద్ధాంత గ్రంథాలను రచించారు. ఈ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన తెలుగు భాషా శాస్త్రంకు, నిఘంటు నిర్మాణ శాస్త్రంకు చేసిన విశిష్ట కృషిని గుర్తుచేసుకుందాం.
Read 12 tweets
మొన్న ప్రఖ్యాత తెలుగు కవి, నాటకకర్త, రంగస్థల నటుడు, భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి ౧౪౦వ జయంతి. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గా ప్రసిద్ధిచెందిన ఆయన తెలుగు సినీవినీలాకాశంలో నటుడిగా, కథా రచయితగా, సంభాషణ రచయితగా, గేయ రచయితగా కూడా పేరుపొందారు.
ఆయన రచించిన తెలుగు నాటకం "సత్యహరిశ్చంద్రీయము" ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఇంకా ఆయన రాసిన ప్రముఖ నాటకాలు ఏమిటంటే, "సాత్రాజితీయము," "ఉత్తరరాఘవము," "బుద్దిమతీ విలాసము." గుంటూరులో ఫస్టు కంపెనీ అనే నాటక సమాజాన్ని స్థాపించిన ఆయన "పుంభావ సరస్వతి," "కవితా కళానిధి" లాంటి బిరుదులను పొందారు.
ఆది శంకరాచార్యులు వారు రచించిన "శివానందలహరి" ని తెలుగులోకి "శివానందలహరి శతకం" గా అనువాదించారు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి జయంతి సందర్భంగా ఆయన తెలుగు సినీ, రంగస్థల, నాటక, సాహిత్య రంగాలకు చేసిన సేవల్ని స్మరించుకుందాం. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి జయంతి శుభాకాంక్షలు. జై తెలుగు తల్లి.
Read 11 tweets
ఈరోజు పీవీ నరసింహారావు గారి ౧౭వ వర్ధంతి. "పీవీ" గా, "పీవీఎన్నార్" గా మనందరికీ చిరపరిచితులైన పాములపర్తి వెంకట నరసింహారావు గారిని బహుముఖ ప్రజ్ఞాశాలి అనచ్చు అలాగే బహుముఖ మేధావి అని కూడా పిలవచ్చు ఎందుకంటే ఆయన అనేక రంగాల్లో మేధావి కనుక. Image
పీవీ నరసింహారావు గారు న్యాయవాది, పాత్రికేయుడు, నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు, భారత రాజకీయాల్లో తలపండిన దురంధురుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఆయన భారతదేశ ప్రధాని పదవిని అలంకరించిన ఏకైక తెలుగు వ్యక్తి. ImageImage
తన రాజనీతితో అపర చాణక్యుడిగా పేరొందిన ఆయనను భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా కూడా పరిగణిస్తారు. పీవీ గారి సాహితీ అన్వేషణ గమనిస్తే ఆయన బహుభాషా కోవిదుడు, పదిహేడు భాషలు మాట్లాడగలరు. అనేక పుస్తకాల్ని రాశారు, అనువాద రచనలు చేశారు. Image
Read 19 tweets
నిన్న ప్రఖ్యాత తెలుగు చరిత్రకారుడు, రచయిత, శాసన పరిష్కర్త మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి ౧౩౦వ జయంతి.
ఆయన చారిత్రిక పరిశోధన చేసి, రాసిన పుస్తకాల్లో "ముసునూరి నాయకులు - ఆంధ్రదేశ చరిత్రలో ఒక విస్మృత అధ్యాయం"(ఏ ఫర్‌ గాటెన్‌ చాప్టర్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ), "రెడ్డి రాజ్యాల చరిత్ర"(హిస్టరీ ఆఫ్‌ ది రెడ్డి కింగడమ్స్‌) చాలా విశిష్టతను సంతరించుకున్నాయి.
ఇంకా ఆయన చేసిన చారిత్రిక రచనల్లో ప్రముఖమైనవి ఏమిటంటే, "ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము," "అమరావతీ స్తూపము," "చారిత్రక వ్యాసమంజరి," "బౌద్ధయుగము." సుప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త సి. నారాయణరెడ్డి గారు "కర్పూర వసంతరాయలు" అనే గేయకావ్యాన్ని రచించి మల్లంపల్లి గారికి అంకితమిచ్చారు.
Read 12 tweets
ఈరోజు విఖ్యాత తెలుగు కవి, ఆధ్యాత్మిక వేత్త భైరవయ్య గారి ౭౯వ జయంతి. తెలుగు సాహిత్యంలో "దిగంబర కవులు" గా ప్రఖ్యాతిగాంచిన ఆరుగురి కవుల్లో "భైరవయ్య" గారు ఒకరు. ఆయన అసలు పేరు "మన్‌మోహన్‌ సహాయ్." ఆయన "నవత" త్రైమాసిక పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. Image
"రా," "విషాద భైరవం" అనే గ్రంథాల్ని రచించిన ఆయన "ఎముకుల కేకలు," "దిగంబరి," "అగ్ని ప్రవేశం," "కరువు బిచ్చం," "నరమాంసం రుచి మరిగి," "నేను దేవుణ్ణి నమ్ముతున్నాను" అనే కవితలను రాశారు. పిమ్మట "భైరవానంద స్వామి" అనే పేరుతో ఆధ్యాత్మిక వేత్తగా మారిన ఆయన ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సాహితీవేత్త జయంతి సందర్భంగా ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన కృషిని గుర్తుచేసుకుందాం. భైరవయ్య గారి జయంతి శుభాకాంక్షలు. జై తెలుగు తల్లి.
Read 8 tweets
నేడు తెలుగు విప్లవ సాహిత్యంలో పేరుమోసిన కవి, రచయిత, అనువాదకుడు, కమ్యూనిస్టు చలసాని ప్రసాద్ గారి ౮౯వ జయంతి. "విరసం" అనగా విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన దానికి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. "సాహిత్య వ్యాసాలు," "చలసాని ప్రసాద్ రచనలు" లాంటి రచనా సంకలనాలను ఆయన రాశారు. Image
మహాకవి శ్రీ శ్రీ గారి సమగ్ర సాహిత్యం "శ్రీ శ్రీ సాహిత్య సర్వస్వం" అనే పేరుతో ఇరవై సంపుటాలుగా వెలువడింది. దానికి సంపాదకత్వం వహించింది చలసాని ప్రసాద్ గారే. శ్రీ శ్రీ గారి సాహిత్యం మీద "చిరంజీవి శ్రీ శ్రీ" అనే పుస్తకాన్ని కూడా రచించారు.
ఈ సాహితీవేత్త జయంతి సందర్భంగా ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవల్ని మననం చేసుకుందాం. చలసాని ప్రసాద్ గారి జయంతి శుభాకాంక్షలు. జై తెలుగు తల్లి.
Read 9 tweets
కొన్ని మంచి ట్వీట్లు మళ్ళీ👍

#తెలుగు
#పంచపాషాణాలు
తెలుగులో పంచపాషాణాలు అని ఐదు పద్యాలు ఉన్నాయి.అవి తెలుసా మీకు? చదవడమే చాలా కష్టం.

ఆంగ్లంలో చెప్పాలి అంటే
Most difficult & tongue-twisting poems

చాలా బాగుంటుంది నేర్చుకుంటే.పెద్ద వాళ్లు కూడా ప్రయత్నం చేయవచ్చు.
అందులో ఒకటి కవి భారవి రచించారు. మరో నాలుగు మహాకవి వీరశైవకవి పాల్కురికి సోమనాధుడు రచించారు (శివతాండవము చూసిసినట్టే అనిపిస్తుంది చదువుతుంటే).
అవధరించి తరించండి👍
షడ్జామడ్జ ఖరాడ్జ వీడ్జ వసుధాడ్జాలాంశ్చ మడ్గాఖరే|
జడ్జట్కిట్కి ధరాడ్జరేడ్ఫణ ఘణః ఖడ్జోత వీడ్యద్భ్రమా |
వీడ్యాలుఢ్భ్రమ లుట్ప్రయట్రియపదాడ్గ్రయ డడ్గ్రడ్గ్రహా |
పాదౌ టేట్పర్టటట్ప్రటప్రటట్రసప్రఖ్యాస సఖ్యోదయా

--- భారవి కవి రచన
Read 9 tweets
నేడు తెలుగువారికి బహుముఖ ప్రజ్ఞాశాలిగా, తెలంగాణ వైతాళికుడిగా సుపరిచితులైన సురవరం ప్రతాపరెడ్డి గారి ౬౮వ వర్ధంతి. నిజాం నిరంకుశత్వ పాలనలో మ్రగ్గుతున్న తెలంగాణ ప్రజలకు అండగా నిలిచిన "గోల్కొండ పత్రిక" కు ఆయన సంపాదకత్వం వహించారు.
తెలంగాణలో అసలు తెలుగు కవులు లేరంటూ ఎవరో విమర్శిస్తే, దానికి సమాధానంగా ఆయన తెలంగాణ ప్రాంతమంతటా పర్యటించి, ౩౫౪ మంది కవుల, రచయితల వివరాలను సేకరించి "గోల్కొండ కవుల సంచిక" అనే పేరుతో ప్రచురణ చేశారు.
తెలుగువారి సాంఘిక చరిత్రను తెలుపుతూ ఆయన పరిశోధన చేసి, రాసిన మహత్తరమైన సాధికారిక గ్రంథం "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ పుస్తకం కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకున్న తొలి తెలుగు పుస్తకంగా చరిత్రగాంచింది.
Read 15 tweets
ఈరోజు విఖ్యాత తెలుగు రచయిత, బహుభాషా కోవిదుడు దాశరథి రంగాచార్య గారి ౯౩వ జయంతి. తన అన్న, ప్రఖ్యాత సాహితీవేత్త దాశరథి కృష్ణమాచార్య గారి లాగానే, దాశరథి రంగాచార్య గారు కూడా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.
అహింసావాదం ప్రతిపాదకుడు మహాత్మా గాంధీ, సామ్యవాద పితామహుడు కార్ల్ మార్క్స్ లను అభిమానించే ఆయన వైష్ణవాన్ని, వేదాంత కర్మ సిద్ధాంతాల్ని కూడా నమ్మిన, పాటించిన ఒక విలక్షణ వ్యక్తి.
తన తొలి రచన "చిల్లర దేవుళ్ళు" అనే నవలతోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని, ఎంతో ఖ్యాతిని అందుకున్న ఆయన నాలుగు పవిత్ర వేదాలను సంస్కృతం నుండి తెలుగులోకి పూర్తిగా అనువదించిన తొలి వ్యక్తి కూడా.
Read 11 tweets
అమ్మకం!

పీడరు బాబూ సెప్తున్నాను ఇను!
నువ్వే కాదు, ఈ బాబే కాదు,
ఏ మనిసి మంచోడని ఒవురు సెప్పినా నాను నమ్మను.
ఈ నోకంల డబ్బూ యాపారం తప్ప మరేట్నేదు.
పశువులూ-నోర్లేని సొమ్ములు – ఆటికి నీతుంది కానీ మనకి నేదు.
సదువు లేందాన్ని నాకూ నేదు; సదువుకున్నాడివి నీకూ నేదు.
డబ్బు కోసం...1/3
....నోకం – నొకమంతా నడుచుకుంటోంది.
డబ్బుకు నాను సారా అమ్ముతున్నాను,
డబ్బుకి సదువుకున్న సదువంతా నువ్వమ్ముతున్నావు.
డబ్బుకి పోలిసోళ్ళు నాయ్యేన్నమ్ముతున్నారు.
మందు కోసం పెద్దాసుపత్రికెల్తే అక్కడ మందులమ్ముతున్నారు.
గుళ్ళోకెళ్లి కొబ్బరికాయ సెక్కా కాన్డడబ్బూ ఇస్తే
ఆ దేవుడి దయే...2/3
...అమ్ముతున్నారు.
వొట్లొస్తే ( ఎన్నికలు) పీడరు బాబూ నువ్వూ,
నానూ ,ఈ బాబూ, అందరం అమ్ముడయిపోతున్నాం.
అమ్మకం! అమ్మకం! అమ్మకం!
అమ్మకం తప్ప మరెట్నేదీలోకంలో.”
-- ముత్తేలమ్మ, 'మాయ'లో (రావిశా స్త్రి)

#తెలుగు #సాహిత్యం #తెలుగుసాహిత్యం
Read 3 tweets
🔴 *సామజవరగమన..అంటే అర్ధం ఎంత మందికి తెలుసు?*
#తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా , ఒక పాట హోరెత్తుతోంది . అదే *సామజవరగమన* చాలా మందికి ఈ పాట నోటికి కంఠస్తా వచ్చి ఉంటుంది , అలానే ఈ పాట చాలా మందికి బాగానే అర్థమయ్యి ఉంటుంది ... కానీ చాలా మందికి " సామజవరగమన " అంటే ఏంటో తెలీదు..
*సామజవరగమన ' అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది* ... ' సామజ ' అనగా " ఏనుగు " అని ..' వరగమనా ' అనగా " చక్కని నడక " అని అర్థం ... అలానే సామవేదం అనగా సంగీతం! .. మన భారతీయ సంగీతానికి మూలం సామవేదం! " సామజవరగమన " అంటే ఏనుగు లా గంభీరంగా , హుందాగా , ఠీవిగా నడిచేవారు అని అర్థం ..
*మరి అసలైన " సామజవరగమన " ఎవరు ??*...
అసలైన " సామజవరగమన .." శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు ..". వాల్మీకి తన రామాయణం లో 'అరణ్యవాసం'లో రాముడిని "గజవిక్రాంతగమను"డంటారు ... అంటే ఏనుగులా హుందాగా నడిచే వాడు అని ...
Read 7 tweets
If you haven’t watched #AKvsAK (@VikramMotwane 🇮🇳 2020) yet, watch it! It’s amazing and kaleidoscopic! 🤩 1/10
Chances are you’ll need #subtitles, though. And since you people don’t sit through the end credits 🙄, I have compiled a list of (nearly all) #subtitlers. 😇 #loveyoursubtitler #nameyoursubtitler 2/10
The film is in both #हिंदी and #English, so let’s mention these two first:
🙏🏼 HI,EN>EN Sheela Sijin Matthews
🙏🏼 HI,EN>HI शालिनी शुक्ला Shalini Shukla 3/10
Read 10 tweets
🌻#ఓయ్ తెలుగు తమ్ముడా .... #నిన్నే..!!

🔥నువ్వు మనస్పూర్తిగా పార్టీకి పని చేశావా..!!

🔥ఎదుటి పార్టీ వాడితో ఎందుకు లాలూచీ రాజకీయం చేశావు ..!!

🔥తల్లి లాంటి పార్టీ పై ...మన నాయకులపై విమర్శలు చేస్తుంటే ...మనకెందుకులే అని ఎందుకు ఊరుకున్నావు ...!!
🔥స్థానిక నాయకులు పైన ఉన్న కోపంతో ఎందుకు పార్టీకి ద్రోహం చేశావు..!!

🔥దెబ్బలాడి పని చేయించుకోకుండా ఎందుకు కుటిల నీతి చూపించావు..!!

🔥చిన్న పని కాలేదని,ఎవడో తినేశాడని నీ సొంత కొమ్మనే ఎందుకు నరుక్కున్నావు..!!

🔥టిడిపి ప్రభుత్వం చేసిన మంచి పనులను ఎందుకు సరిగా చెప్పలేకపోయావు..!!
కులాల్ని రెచ్చగొట్టే వాళ్ల చెప్పుడు మాటలకు ఎందుకు చెవులు ఊపావు..!!

🔥అనాది కాలం నుండి ఉన్న సీనియర్ నాయకుల మాటలు పట్టించుకోకుండా , నా మాట నెగ్గాలి అని ఎందుకు కుటిల రాజకీయము చేశావ్...!!

🔥పార్టీ, పార్టీ అని కోతలు కోస్తూ సరిగ్గా ఓట్ల సమయానికి ఎందుకు కాడి దించేసావు ..!!
Read 6 tweets
వింజమూరి వారి వింజామరం !: కిన్నెరసాని కథ 🌹 adugutha.blogspot.com/2020/09/blog-p… Image
కిన్నెరసాని కథ 🌹

🚩#తెలుగు సాహితీ కవితా ప్రపం చంలో విశ్వనాథవారి

అపూర్వ అమృత వృష్ఠి ‘కిన్నెరసాని’.

ఈ ‘కిన్నెరసాని’ భారతీయ సంస్కృతికి దర్పణం పట్టే ఈ పాటల కావ్యం విశ్వనాథకే గాక యావత్ తెలుగు సాహిత్యానికే కలికితురాయిగా నిలిచింది. Image
ఈ కావ్యరచనకు ప్రధాన ప్రేరణ ఆయన చదివిన ‘వసుచరిత్ర’ ప్రబంధవేునట. అందులోని నాయిక సుక్తిమతి ఎలా తన నాథుడు ‘కోలాహలపర్వతాన్ని’ నదీ రూపంతో ఆలింగనం చేసుకుందో ఈ కిన్నెరసాని కూడా తన విభుడి ఆత్మీయ కౌగిలిలో కరిగి నీరై నదిలా ప్రవహిస్తుంది.

వాస్తవ సమాజంలో ‘‘కిన్నెరసాని’’ ఒక వాగు Image
Read 3 tweets
🌹కిన్నెరసాని కథ 🌹

🚩#తెలుగు సాహితీ కవితా ప్రపం చంలో విశ్వనాథవారి

అపూర్వ అమృత వృష్ఠి ‘కిన్నెరసాని’.

ఈ ‘కిన్నెరసాని’ భారతీయ సంస్కృతికి దర్పణం పట్టే ఈ పాటల కావ్యం విశ్వనాథకే గాక యావత్ తెలుగు సాహిత్యానికే కలికితురాయిగా నిలిచింది.
ఈ కావ్యరచనకు ప్రధాన ప్రేరణ ఆయన చదివిన ‘వసుచరిత్ర’ ప్రబంధవేునట. అందులోని నాయిక సుక్తిమతి ఎలా తన నాథుడు ‘కోలాహలపర్వతాన్ని’ నదీ రూపంతో ఆలింగనం చేసుకుందో ఈ కిన్నెరసాని కూడా తన విభుడి ఆత్మీయ కౌగిలిలో కరిగి నీరై నదిలా ప్రవహిస్తుంది.

వాస్తవ సమాజంలో ‘‘కిన్నెరసాని’’ ఒక వాగు
#తెలం గాణ ప్రాంతంలోని ‘గుండాల’ అడవుల్లో ‘వుర్కోడు’ దాని జన్మస్థలం. అడవులు గుట్టలు గుండా ప్రవహిస్తూ పాల్వంచ సమీపంలోని ‘యానంబయలు’ గ్రామం వద్ద ఒక గుట్టను పెనవేసుకున్నట్టు ప్రవహిస్తుంది. అక్కడే 1966లో జలాశ యం నిర్మించారు.
Read 13 tweets
🚩ప్రజాకవి కాళోజీ.!🙏🏿🙏🏿
✍🏿ఒక్క సిరా చుక్క చాలు, లక్ష మెదల్లను కదిలించటానికి !
--
#తెలుగు మాట్లాడవు..
తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడవు
సంకోచపడియెదపు సంగతేమిటిరా
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవేటి
#కాళోజి .
-
*
తెలంగాణ ‘యాస’ నెపుడు యీసడించు
తెలంగాణ ‘యాస’ నెపుడు
యీసడించు భాషీయుల
‘సుహృద్భావన’ ఎంతని
వర్ణించుట సిగ్గుచేటు
-#కాళోజి .
*వాక్యంలో మూడుపాళ్ళు
ఇంగ్లీషు వాడుకుంటు
తెలంగాణీయుల మాటలో
ఉర్దూపదం దొర్లగానే
హిహీ అని ఇగిలించెడి
సమగ్రాంధ్ర వాదులను
ఏమనవలెనో తోచదు.
#కాళోజి .
*
రోడ్డని’ పలికేవారికి
సడకంటె ఎవగింపు
ఆఫీసని అఘొరిస్తూ
కచ్చేరంటే కటువు
సీరియలంటే తెలుగు
సిల్సిల అంటే ఉరుదు
సాల్టు, షుగర్, టిఫిన్ తెనుగు
షర్కర్, నాష్తంట్ కొంప మునుగు
-#కాళోజి .
*
Read 4 tweets
కళ్ళముందే తెలుగు లిపి ఎలా మారింది

150-200 సంవత్సర వయసున్న కైఫీయత్తులు గమనించినా, 100 ఏళ్ల కిందటి శాసనాలు గమనించినా ఈ 100 -200 ఏళ్లలో తెలుగు లిపిలో వచ్చిన కొన్ని మార్పులు గమనించవచ్చు.

అవేంటో కింద చూద్దాం #తెలుగు #telugu
“ర” హల్లుకు ఇతర హల్లుల వత్తుతో వచ్చే సంయుక్తాక్షరాలు

అర్కావతి అనే పదాన్ని తెలుగులో ఇప్పుడు ఇలా రాస్తున్నాం కానీ కైఫియత్తులో 20వ శతాబ్దం తొలినాళ్లలో వేరే విధంగా అని రాసేవాళ్ళు. కన్నడలో ఇప్పటికీ అలాగే రాస్తున్నారు. Image
హల్లులకు ఒత్వం / ఓత్వం

క హల్లుకు ఓత్వం ఇస్తే ‘కో’ అవుతుంది.ఇప్పుడంటే ‘కో’ ఇలా రాస్తున్నాం కానీ, 150-200 సంవత్సరాల ముందు ‘కో’ రాయడానికి ‘కె’ కు ఉకార కొమ్ముపెట్టేవాళ్ళు (అంటే మోహనం లో ‘మో’ రాసినట్టు). Image
Read 4 tweets
ఎరికల్ - ఎర్రగుడిపాడు

'ఎరికల్' అన్న పదానికి తెలుగు భాషా చరిత్రలో, తెలుగువారి చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలి తెలుగు శాసనం కలమళ్ల శాసనం ఎరికల్ ముతురాజు ధనుంజయుడు వేయించగా, ఎర్రగుడిపాడు శాసనంలో కూడా 'స్వస్తిశ్రీ ఎరికల్ముత్తుర్రాజు' అని ఉంటుంది.
తొట్టతొలి తెలుగు శాసనాల్లో (కలమళ్ళ, ఎర్రగుడిపాడు, తిప్పలూరు, ఇందుకూరు మొ.) మనకు ప్రధానంగా మూడు సారూప్యతలు కనిపిస్తాయి.

1. అన్నీ కడప జిల్లాలో లభ్యమైనవి
2. అన్నీ రేనాటి చోళులు వేయించినవి
3. వాటిల్లో 'ఎరికల్' అన్న పదం ఉండటం

రేనాటి ప్రాంతాన్ని పాలించిన చోళులు కాబట్టి రేనాటి చోళులు
వీరి రాజధాని చెప్పలి. అయితే వీరి శాసనాలలో ఎక్కువగా కనిపించే 'ఎరిగల్' వీరి తొలి రాజధాని అయ్యుంటుంది అని చరిత్రకారుల అభిప్రాయం. ఇప్పుడు 'ఎరిగల్' పేరుతో ఏ ఊరు లేదు. రేనాడులో ఉన్న ఊరు, రేనాటి చోడులకు సంబంధించిన ఊరు అని తప్ప మరే ఇతర ఆధారాలు లేవు.

వీటి ఆధారంగా చరిత్రకారులు
Read 13 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!