Discover and read the best of Twitter Threads about #తెలుగు_భాష

Most recents (2)

#తెలుగు_భాష

తెలుగు భాషను మన ఇళ్లలోనే వాడటం మానేశామా?

డోర్ లాక్ చెయ్యకండి..

నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో..

నా కార్ కీస్ ఎక్కడ?

ఇందులో 'డోర్', 'లాక్', ‘కీస్’ కు అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. కానీ మనం వాడం..

ఎందుకు ?

ఓ ముప్పై యేళ్ళు వెనక్కి వెళితే,
తలుపు తాళం వేసుకో,
గడియ పెట్టుకో అనే వాళ్ళం..

ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం.
నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?

మన తెలుగులో మాటలు లేవా ?
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !
కానీ మనం పలకం.
వంటింటిని... #కిచెన్ చేసాం..
వసారా... #వరండాగా మారింది...
ఇలా #చావడి, #పంౘ, #ముంగిలి, #నట్టిల్లు, #తలవాకిలి, #నడవ, #పెరడు, ఇవన్నీ మరచిపోయాం..

మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌ లే వస్తారు..
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు..
Read 13 tweets
సేకరణ.. ఏ.ఆర్.కే నారాయణ మూర్తి..

మా లెక్కల మరియు ఫిజిక్స్ పంతుళ్ళ పని కొంచెం తేలిక చేశారు..

అమ్మ చేసిన రొట్టె #వృత్తము
సగానికి మడిచిన దోసె #అర్ధ_వృత్తము
మనం కూర్చునే స్టూల్ #చతురస్త్రం
పడుకునే మంచం #దీర్ఘ_చతురస్త్రం
మనకిష్టమైన లడ్డూ ఒక #గోళము
సగం మన మిత్రునికిస్తే #అర్ధ_గోళము
మన తరగతి గది ఒక #ఘనం
మనం కూర్చునే బెంచీ ఒక #దీర్ఘ_ఘనం
మన జెండా కర్ర ఒక #స్థూపం
కొడవలి మలుపు ఒక #చాపం
ధాన్యపు రాశి ఒక #శంఖువు
రూపాయి రూపాయి కలిపితే #కూడిక
కొనడానికి కొంత తీస్తే #తీసివేత
తలా పది పంచితే #భాగహారం
హెచ్చిస్తే #గుణకారం
కూర్చుంటే #జడత్వం
కదిలితే #చలనం
పరిగెత్తితే #వేగం
ఆగి ఆగి పరుగు తీస్తే #త్వరణం
పడిపోతే #ఆకర్షణ
విడిపోతే #వికర్షణ
తన చుట్టూ తాను తిరిగితే #భ్రమణం
గుడి చుట్టూ తిరిగితే #పరిభ్రమణం
మాట్లాడడానికి #శక్తి
పనిచేయడానికి #బలం
గంటకు ఎంతపని చేస్తావో అది #సామర్థ్యం
వింటున్నామంటే #శబ్దం
చూస్తున్నామంటే #వెలుగు
రంగులన్ని #వర్ణ_పటం
Read 5 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!