Discover and read the best of Twitter Threads about #ధర్మరాజు

Most recents (3)

పాండవ ప్రథముడు #ధర్మరాజు దాన ధర్మాలకు పేరు. రాజ్యంలో ప్రజలకు ఎక్కువ ధర్మాలు చేశాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని #కృష్ణుడికి అనిపించింది. అందుకోసం #కృష్ణుడు #ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకువెళ్ళాడు.
ఆ రాజ్యం ఒక మహా చక్రవర్తి పాలనలో ఉండేది. అక్కడ వారు ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్ళు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు చెంబులో నీళ్ళు ఇచ్చింది. వారు తాగేశాక ఆమె ఆ చెంబును తిరిగి ఇచ్చేస్తూ మా రాజ్యంలో ఒకరికి ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోము అని బదులు చెప్పిలోనికి వెళ్ళిపోయింది !!!
ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు #ధర్మరాజు. ఇక రాజును కలవడానికి ఇద్దరూ వెళ్లారు.

రాజా.. ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు #ధర్మరాజు అని చెప్పాడు #కృష్ణుడు. అయినా ఆ మహారాజు #ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా #కృష్ణుడితో ఇలా అన్నాడు…
Read 6 tweets
#నర్తనశాల

తన నట సామర్థ్యం మీద నమ్మకం ఉన్న నటుడు ఎలాంటి పాత్రని చేసి మెప్పించినా, ఇమేజితో సంబంధం లేకుండా అభిమానులు ఆదరిస్తారని య్యేళ్ళ క్రితమే నిరూపించిన తెలుగు నటుడు #నందమూరి_తారకరామారావు. అప్పటికే వందకి పైగా సినిమాల్లో నటించి, అటు పౌరాణికాలు, ఇటు సాంఘికాలు మధ్యే మధ్యే జానపదాలు
ఇలా అది ఇది ఏమని అన్ని రకాల సినిమాలు చేస్తూ ఆంధ్రదేశాన్ని ఉపేస్తున్న వేళ, అటూ ఇటూ కాని #బృహన్నల పాత్ర పోషించడమంటే ఏ నటుడికైనా అదో పెద్ద సాహసమే..

పైగా ఆ పాత్రలో కనిపిచాల్సింది ఏ ఐదు పది నిమిషాలో కాదు, మూడుగంటల పాటు సాగే సినిమాలో దాదాపు రెండున్నర గంటల పాటు!! అయినప్పటికీ సాహసానికి
సై అన్నాడు #తారకరాముడు. ఫలితమే రాజ్యం పిక్చర్స్ నిర్మించిన '#నర్తనశాల' అనే #విరాటపర్వం. మరో రెండేళ్లలో యాభయ్యేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ పౌరాణిక చిత్రానికి దర్శకుడు 'పౌరాణిక బ్రహ్మ' గా పేరుపొందిన #కమలాకర_కామేశ్వర రావు. కథ, మాటలు, పద్యాలతో పాటు కొన్ని పాటలని రాసింది సముద్రాల
Read 21 tweets
😄ధర్మరాజు మీద ఒక చిన్న వ్యాసం...మార్కులు నావి.. వ్యాసం మీది!😄
.
#ధర్మరాజు శాంతమూర్తి. మృదు స్వభావి.
ధర్మాధర్మ విచక్షణ కలవాడుఅందుకనే అతనిని ధర్మరాజు అనేవారు. అసలు పేరు యుధిష్టరుడు.
అతను భీమార్జున నకుల సహదేవులకు అన్నగారు.
వారు ఇతని సోదరులు.
#భీమార్జునులు మహా బలవంతులైనను ఇతని చెప్పుచేతలలో ఉండెడివారు.
అన్నగారనిన వారికి అనురాగము, ప్రేమ, వాత్సల్యము మెండుగా యుండెడివి.
ఇంత ప్రేమ బడయుట అతని వ్యక్తిత్వము వల్లనే కదా.
-
ఇంత గొప్ప వ్యక్తిత్వము గల ధర్మరాజునకు జూదమాడుట యందు కడు నాశక్తి. జూదమాడినను ధర్మమును వదిలెడు వాడు కాదు. #ధర్మ జూదమే ఆడెడివాడు.
-
#జూదమనగా ఆ కాలమున పాచికలతో నాడెడి వారు.
నేటి పేకాటలు నాడు బహుశా ఉండిఉండవు.
Read 4 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!