Discover and read the best of Twitter Threads about #యన్టీఆర్

Most recents (2)

#కాంతారావు ని తన సొంతతమ్మునిలా ఆదరించి ఎన్నో అవకాశాలు కల్పించి చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఎంతో సహకరించారు శ్రీ #యన్టీఆర్

#యన్టీఆర్ షూటింగ్ కు డుమ్మ కొట్టి #ఏఎన్నార్ షూటింగ్ కూ వెళ్ళిన #కాంతారావు.

నటరత్న శ్రీ యన్టీఆర్, కత్తి వీరుడు కాంతారావు దాదాపు 60 చిత్రాల్లో కలిసి
నటించారు. వినయ విధేయతులు, క్రమశిక్షణ, కలుపుగోలుతనం వంటి లక్షణాలు కాంతారావులో ఉండటంతో అవి రామారావు గారికి నచ్చి, ఆయన్ని మరింత ప్రోత్సహించేవారు. ఎన్నో పౌరాణిక చిత్రాల్లో శ్రీకృష్ణుడు, అర్జునుడు వంటి కీలక పాత్రలు రామారావు గారి ఆశీస్సులవల్లే పోషించగలిగారు కాంతారావు గారూ.
రామారావు గారు కృష్ణుడుగా, కాంతారావు నారదుడిగా నటించి, పండించిన హాస్యం ప్రేక్షకులను ఎంతో అలరించింది. రామారావు గారి స్వంత చిత్రం జయసింహాలో తమ్ముడి వేషం కోసం మొదట జగ్గయ్యను అనుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆ అదృష్టం కాంతారావుకి దక్కింది. అప్పటికి మూడు చిత్రాల్లో మాత్రమే నటించి
Read 12 tweets
దసరా ప్రత్యేకం - విజయదశమి ప్రత్యేకం - నటరత్నకు నివాళి, వీరార్జునుడిగా అన్నగారు #యన్టీఆర్

వాఖ్యనం కీ.శే.లు శ్రీధర్ ముప్పిరాల గారు..

అర్జునుడు... వీరార్జునుడు... బీభత్సుడు..!!కురువంశోద్ధారకుడి పాత్రలో అన్నగారి రూప లావణ్య విజయ విలాసాలు అపూర్వాలు!!

త్రిదశపాలతనూజుని గా ముచ్చటగా Image
అన్నగారు రాణించిన మూడు చిత్రాలను ముచ్చటించుకుందాం.

అమరేంద్ర తనయునిగా అన్నగారి వీర విజృంభణకు పరాకాష్ట #నర్తనశాల!! త్రినేత్రునెదిర్చి ఆ దేవదేవునిచే పాశుపతాస్త్రము పొందిన విజయుని అమరలోకానికి అతిథిగా ఆహ్వానిస్తాడు దేవేంద్రుడు. ఆ సన్నివేశంలో అన్నగారి వీరోత్సాహము, పాకారి Image
అర్థ సింహాసనాలంకరణ, ఊర్వశిని తిరస్కరించి శాపగ్రస్తుడు అయిన సన్నివేశాలలో ఆ చెదరని ఆత్మవిశ్వాసము, ఆ ధీరోద్ధత ఆయన ముఖారవిందంలో ప్రతిఫలించిన తీరు అమోఘము. తదుపరి గోగ్రహణ సందర్భంలో వెనుతిరిగి పారజూచిన ఉత్తరకుమారునికి ధైర్యాన్నిచ్చి.. "శతృసంహార సమయం లో నీ ధనస్సు నా బీభత్స వీర విహారాన్ని Image
Read 7 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!