Discover and read the best of Twitter Threads about #సీమఆలయాలు

Most recents (10)

గుడిమల్లం అసలు పేరు తిరువిప్పిరంబేడు (శాసనాల ప్రకారం).

తిరు అంటే శ్రీ / గొప్ప / పుణ్యమైన అని అర్థాలు ఉన్నాయి
విప్పిర అన్నది సంస్కృత ' విప్ర ' నుండి వచ్చింది. అంటే బ్రాహ్మణుడు అని అర్థం
పేడు అన్న పదం గ్రామ సూచి (ఉదా: ఏర్పేడు)

తిరువిప్పిరంబేడు అంటే గొప్ప బ్రాహ్మణుడి ఊరు అని అర్థం
ఎవరా గొప్ప బ్రాహ్మణుడు ?

స్థలపురాణం ప్రకారం ఈ ప్రాంతం పరశురాముడు శివుడిని కొలిచిన ప్రాంతం. బహుశా శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురాముడే ఊరి పేరులో ఉన్న గొప్ప బ్రాహ్మణుడు అయ్యుండాలి.

'జయన్ గొండచోళమండలం'లోని 'పేరుంబాణప్పాడి'లోని 'వెంకటకొట్టం'లోని 'శిలైనాడు'లోని 'తిరువిప్పిరంబేడు'
అని గుడిమల్లాన్ని శాసనాలు పేర్కొంటున్నాయి. మరి గుడిమల్లం అన్న పేరు ఎలా వచ్చింది అన్నదానికి మరో కథ ఉంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని పూజించే విషయమై వేటగాడి రూపంలో ఉన్న పరశురాముడు / శ్రీమహావిష్ణువు కు, చిత్రసేనుడు అనే యక్షిణి రూపంలో ఉన్న బ్రహ్మకు ఘోర యుద్ధం జరిగింది అని
Read 5 tweets
శ్రీశైల పంచ మఠాలు

1. ఘంటా మఠం
2. సారంగధర మఠం
3. భీమాశంకర మఠం
Read 6 tweets
ఒంటిమిట్ట రామాలయం కట్టించింది ఎవరు ?

స్థానిక చరిత్రలు ఒంటిమిట్ట కోదండ రామాలయం బుక్కరాయల సోదరుడు / కుమారుడు కంపరాయలు కట్టించినట్టు చెబుతాయి. అయితే ఒంటిమిట్ట కైఫీయత్తు మాత్రం ఒంటిమిట్ట ఆలయాన్ని సంపెట నల'కంపరాయలు' కట్టించినట్టు చెబుతుంది. శాసన, కైఫీయత్తుల ప్రకారం సంపెట నలకంపరాయలు ImageImage
కృష్ణదేవరాయలు - అచ్యుతదేవరాయల కాలం నాటి సామంత రాజు (పైన పేర్కొన్న బుక్కరాయల కంపరాయలకు సుమారు 200 సంవత్సరాల తరువాత వాడు).

ఆలయం కట్టించినది సంగమ వంశ కంపరాయలా (14వ శతాబ్దం) లేక సంపెట వంశ కంపరాయలా (16వ శతాబ్దం) అన్నది తేల్చడానికి ఎటువంటి శాసన ఆధారాలు లేవు.
ఒంటిమిట్ట ఆలయం గురించి పేర్కొన్న మొదటి శాసనం సదాశివరాయల కాలంలో శక 1472/ప్ర.శ 1550 పులపత్తూరు శాసనం. సంగమ కంపరాయలు ఈ ఆలయం కట్టించినట్లైతే సుమారు 200 సంవత్సరాల వరకు ఎందుకని ఈ ఆలయానికి సంబంధించిన శాసనాధారాలు లేవన్న ప్రశ్నకు సమాధానం లేదు. 16వ శతాబ్దంలో సంపెట కంపరాయలు కట్టించినట్లయితే
Read 6 tweets
తలయేరు గుండు

ఈ ఫోటోలో కనిపిస్తున్న పెద్ద బండను తలయేరు గుండు అంటారు అలిపిరి నుంచి తిరుమల వెళ్లే కాలినడక మార్గంలో ప్రథమ గోపురం దాటిన తరువాత ఈ తలయేరు గుండును చూడవచ్చు. తలయేరు అంటే తలనొప్పి అని అర్థం. ఏడుకొండలు ఎంతో శ్రమతో ఎక్కి, దిగే భక్తులకు తలనొప్పి, ఒంటినొప్పులు మోకాళ్ల నొప్పులు
వంటివి రాకుండా ఉండడానికి తమ తలను మోకాళ్ళను ఆ గుండుకు తాకించి చిన్నగా రుద్దుతారు అలా చేస్తే ఒంటినొప్పులు రావని ఉన్న నొప్పులు పోతాయని భక్తుల నమ్మకం. అలా అనేక శతాబ్దాలుగా భక్తులు తమ తల, మోకాళ్లు ఆ గుండుకు ఆనించి ఆనించి ఏర్పడిన గుంతలను మనం నేటికీ చూడవచ్చు. దీనికే మరొక కథ కూడా ఉంది
మాదిగ రామయ్య అనే శ్రీవారి భక్తుడు స్వామివారికి ముత్యాలు గవ్వలు వంటివి జోడించి ఎంతో అందంగా చెప్పులు కుట్టించేవాడు. ఏదో కారణం వలన ఆ చెప్పులు కుట్టే పనికి ఆటంకం ఏర్పడింది. ఆ బాధతో ఆ వృత్తి వారు అక్కడున్న రాతిబండకు తలలు బాదుకోవడం వలన ఆ బండకి గుంతలు ఏర్పడి అదే తలయేరు బండ అయ్యింది
Read 5 tweets
అవ్వాచారి కోన అక్కగార్లు.

ప్రతీ రోజూ రాత్రి తిరుమల శ్రీవారు పవళింపు సేవ అయిపోయాక, ఆనందనిలయానికి బీగం (తాళం ) వేసి కిందకి నడక మార్గాన వస్తూ అవ్వాచారికోన అక్కగార్లకు బీగించెవులు(తాళం చెవి) ఇచ్చి అలా కిందకి నడుచుకుంటూ వచ్చి అలిపిరి దగ్గర ఉన్న పాదాల మండపంలో ఉన్న తన మెట్లు(చెప్పులు)
వేసుకుని అలా నేరుగా తిరుచానూరు పద్మావతీ అమ్మవారి వద్దకు వెళ్లి, రాత్రి అమ్మవారితో ఉండి తిరిగి ఉదయాన పాదాల మండపంలో చెప్పులు వదిలి నడుచుకుంటూ పైకి ఎక్కి అక్కగార్ల వద్ద బీగించెవి తీసుకుని సుప్రభాత వేళకు ఆనంద నిలయం చేరుకుంటాడట. అలా స్వామి కూడా కొండను చెప్పులు లేకుండానే ఎక్కుతాడని
స్వామి వారి ఆలయ బీగించెవులకి అవ్వాచారి కోన అక్కగార్లు కాపలాగా ఉంటారని భక్తుల నమ్మకం. ఈసారి మీరు తిరుమల కాలినడక మార్గాన వెళ్ళినప్పుడు మోకాళ్ళ పర్వతానికి ముందు ఘాట్ రోడ్లో వచ్చే అక్కగార్లను దర్శించి వారి ఆశీస్సులు తీసుకోండి

మూలం: తిరుపతి కథలు - ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి
Read 4 tweets
దేవబ్రాహ్మణ అగ్రహారాల సీమ - కమలాపురం

కడప జిల్లాలోని కమలాపురం మరియు కమలాపురం చుట్టుపక్కల చాలా ప్రధాన గ్రామాలు బ్రాహ్మణులకు, కవులకు లేదా ఆలయాలకు సర్వమాన్యాలుగా / అగ్రహారాలుగా ఇవ్వబడిన గ్రామాలు. వీటిల్లో అనేక గ్రామాలకు ఇప్పుడున్న పేరు కాకుండా దానసమయంలో ఇవ్వబడిన పేర్లు ఉండేవి -a 🧵
1. కమలాపురం-మండల/తాలూకా కేంద్రం

పుష్పగిరి క్షేత్రం ఉన్న కుసుమాచల పర్వతానికి పశ్చిమాన పాపాగ్ని పాగేరు అనే నదుల మధ్య ఉండే కమలాపురం గ్రామం పుష్పగిరిలో ఉన్న బ్రహ్మదేవ ప్రతిష్ట కమలేశ్వర స్వామికి పడితరానకు నడిచేది. పుష్పగిరిలోని కమలేశ్వర స్వామి పేరిటే ఈ ఊరికి కమలాపురం అనే పేరొచ్చింది
2. కోగటం / కోకటం

ఇతర పేర్లు : కమలాజీపురం, శఠగోపపురం

విజయ సింగ్ మహారాజు వకీలు కమలాజీ అనే అతను ఈ గ్రామాన్ని అగ్రహారంగా చేయించాడని అక్కడ స్థలీకులు చెప్పుకుంటున్నారు. కృష్ణదేవరాయల కాలంలో ఈ కూకటం గ్రామాన్ని అల్లసాని పెద్దనకి సర్వమాన్ని అగ్రహారంగా ధారపోసి ఇచ్చినాడు
Read 25 tweets
ఈ కార్తీక మాసం మీరు దర్శించడానికి సీమలోని కొన్ని ప్రసిద్ద ఆలయాలు

1. శ్రీశైలం, నంద్యాల జిల్లా
2. శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా
3. మహానంది, నంద్యాల జిల్లా
Read 11 tweets
Images of Gods and Goddesses from Rayalaseema - A compendium of 100 years old photos

రాయలసీమలోని దేవుళ్ల ప్రతిమలు - 100 సంవత్సరాల క్రితం నాటి ఫోటోల సమాహారం

నరసింహోద్భవం, అహోబిలం
ఉగ్రనారసింహ, అహోబిలం
యోగ నరసింహ, తిరుపతి
Read 17 tweets
శ్రీకృష్ణదేవరాయల ఆగ్రహం - పుష్పగిరి అగ్రహారం

రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకైక అదిశకంర పీఠం కడప జిల్లాలోని పుష్పగిరి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయ సముదాయం పుష్పగిరి. శైవమత కేంద్రంగా, నివృత్తి సంగమంగా, హరిహర క్షేత్రంగా, అదిశంకర పీఠంగా వెలసిల్లిన పుష్పగిరి ImageImage
ఒకప్పుడు నిత్యం వేదపారాయణంతో మారుమోరోగిన అగ్రహారం. ఏనుగుల వీరాస్వామి కాశీ యాత్ర చరిత్రలోనూ, శ్రీ పోతులూరి వీరబ్రహేంద్ర స్వామి జీవిత చరిత్రలోనూ పుష్పగిరి అగ్రహారం ప్రస్తావన ఉంది.
వీరబ్రహేంద్ర స్వామి తన ప్రియశిష్యుడు సిద్దయ్య తో కలిసి పుష్పగిరి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వారిని అవహేళన చేసిన పుష్పగిరి బ్రాహ్మణులు స్వామివారి ఆగ్రహానికి లోనయ్యి, వారి ఇళ్లు తగలబడ్డ తరువాత తమ తప్పు తెలుసుకుని స్వామికి శిష్యులుగా మారినట్టు బ్రహ్మంగారి చరిత్ర చెబుతుంది.
Read 14 tweets
వేసవికాలం సెలవులలో లేపాక్షి వెళితే వీరభద్రస్వామి దర్శనం చేసుకున్నాక తప్పకుండా ఆలయంలో చూడవలసిన / గమనించవలసిన 10 ప్రదేశాలు

1. బసవన్న / ఏకశిలా నంది విగ్రహం
2. వేలాడే స్తంభం
3. విజయనగర కుడ్యచిత్రాలు
Read 11 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!