Discover and read the best of Twitter Threads about #సీమచరిత్రలోస్త్రీలు

Most recents (3)

ప్రపంచ సాహిత్యంలో అతిపెద్ద పదం

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి ప్రకారం ప్రపంచ సాహిత్యంలో ఏ భాషలో నైనా సరే ఉపయోగించబడ్డ అతిపెద్ద పదం కృష్ణదేవరాయల సోదరుడు అచ్యుతదేవరాయల భార్య తిరుమలాంబ రచించిన సంస్కృత చంపూ కావ్యం 'వరదాంబికా పరిణయం'లోనిది. ImageImage
అచ్యుతదేవరాయలతో సలకం వారి ఆడపడుచు వరదాంబిక వివాహం ఇతివృత్తంగా రాయబడిన ఆ కావ్యంలో తుళువ నరస నాయకుడి (కృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయల తండ్రి) దండయాత్రలో భాగంగా 'తుండీర దేశం'(కంచి రాజధానిగా కలిగిన తొండమండలం) వర్ణించే క్రమంలో 195 సంస్కృత అక్షరాలతో (428 రోమన్ అక్షరాలు)ఒకే పదం వాడబడింది. Image
ఇప్పటివరకు ఏ భాషలోనైనా వచ్చిన సాహిత్యంలో ఇన్ని అక్షరాలతో వాడబడిన పదం మరొకటి లేదు.. ఈ వరదాంబిక కడప జిల్లా చెన్నూరు సీమను, ప్రకాశం జిల్లా కొచ్చర్లకోట సీమను ఏలిన సలకం వారి ఆడపడుచు.

చిత్రం: reddit.com/r/interestinga… Image
Read 4 tweets
గండికోట ఏకైక పాలకురాలు - మదీనా బీబీ

సుమారు వెయ్యి సంవత్సరాల గండికోట చరిత్రలో అనేక మంది పాలకులు గండికోటను పాలించారు. ఒకప్పుడు స్వతంత్ర కాయస్థ రాజ్యానికి రాజధానిగా ఉండి విజయనగర సామ్రాజ్యంలోని శత్రుదుర్భేద్యమైన దుర్గాలలో ఒకటిగా నిలిచిన గండికోటను పాలించిన ఏకైక మహిళ మదీనా బీబీ.
మదీనా బీబీ కడప సుబాను పాలించిన అతిగొప్ప మాయాణా నవాబు అబ్దుల్ నబీ ఖాన్ కోడలు మరియు కడప నవాబు అయిన మోచ మియ్యా భార్య. మదీనా బీబీ గండికోట పాలనపై కడప కైఫియత్తు మరియు గండికోట కైఫియత్తుల కథనాలలో కొంచెం వైరుధ్యం ఉంది.
అయినప్పటికీ దాదాపు రెండు కైఫియత్తులు గండికోట జాగీర్దార్ గా మదీనా బీబీని, ఆమె చేసిన యుద్ధాలను స్పష్టం చేస్తున్నాయి

విజయనగర సామ్రాజ్యం పతనానంతరం కడప మొదట గోల్కొండ ఆ తరవాత మొఘలుల స్వాధీనంలోకి వెళ్లిపోయింది. కడప సుబాలో మాయణా నవాబులుగా పిలవబడ్డ కడప నవాబులు పాలన మొదలయ్యింది.
Read 14 tweets
#సీమశాసనాలు #సీమచరిత్రలోస్త్రీలు #సీమచరిత్ర

వెలుగులోకి వచ్చిన రాణి లక్ష్మీదేవి (లక్కుమదేవి) గుండ్లూరు (చిత్తూరు జిల్లా) శాసనం -13 వ శతాబ్దం

రాణి లక్ష్మీదేవి చంద్రగిరి రాజధానిగా చిత్తూరు ప్రాంతాన్ని పాలించిన యాదవరాయ వంశం వారి ఆడపడుచు. నెల్లూరు చోడరాజు తిక్కచోడుడి భార్య
Yādavarāya king Vīra-Nārasingadēva inscription from Gunḍlūru, Andhra Pradesh

This inscription is engraved on a slab kept in front of the Chēnnakēśava temple in Gunḍlūru,Kalikiri Mandalam,Chittoor district,AP.
It is written in Tamil language and characters dated Śaka 1167 (1245 C.E),Vīśvāvasu, Makarasaṅkrānti.

It records the gift of taxfree lands in the village Araisamputtai to the god Kēśavaperumāḷ in Gunḍalūr of Kilaimarayarpaḍi-nāḍu in Iraṭṭapāḍikoṅḍa Chōḷa maṇḍalam by
Read 5 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!