Discover and read the best of Twitter Threads about #సీమరత్నాలు

Most recents (7)

మనం మరచిన ధర్మదాతలు

The man who once saved Bellary from an epidemic - Right Honorable Kolachalam Venkatrao

శ్రీ కోలాచలం వెంకట్రావు స్వాతంత్ర సమరయోధులు, ధర్మదాత, ప్రముఖ న్యాయవాది, ది లయన్ ఆఫ్ ది బార్, సంఘ సంస్కర్త, భారత జాతీయ కాంగ్రెస్ తొలితరం నాయకులలో ఒకరు,
రాజనీతి దురంధరులు, బళ్ళారి మాజీ మున్సిపల్ ఛైర్మన్. విజయనగర సామ్రాజ్య ఆస్థానంలోని విద్వాంసులు మహా వ్యాఖ్యాత అయిన మల్లినాథ సూరి వంశంలో కోలాచలం వెంకట్రావు గారు 1850 ఫిబ్రవరి 28న బళ్ళారి లో జన్మించారు. వీరి తండ్రి కోలాచలం సేతుపతి శాస్త్రి అనెగొంది సంస్థానంలో దివాన్ గా ఉండేవారు.
వీరి సోదరులు ఆంధ్రచరిత్రనాటకపితామహుడు కోలాచలం శ్రీనివాసరావు గారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, అనంతపురం- బళ్ళారిలలో తొలి వైద్యురాలల్లో ఒకరు అయిన డా. నివర్తి లక్ష్మీదేవి శాస్త్రి వీరి భార్యకు మేనకోడలు.

1902 వ సంవత్సరంలో బళ్లారిలో ప్లేగు వ్యాధి దావానలంలా వ్యాపించింది.
Read 12 tweets
మనం మరచిన ధర్మదాతలు - యాదాల్ల నాగమ్మ

కడప పట్టణానికి చెందిన ధర్మాత్మురాలు. వైశ్య ప్రముఖులు. (వీరి వంశం పేరనే కడపలో YV స్ట్రీట్ కి ఆ పేరు వచ్చింది). వీరి గురించి పరిశోధించే క్రమంలోనే అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టరు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారితో పరిచయం ఏర్పడింది.
యాదాల్ల వారు బళ్లారి చెందిన ప్రముఖ వర్తక కుటుంబమట. అప్పట్లోనే బర్మాతో పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవారట. ఏ కారణంతో వలస వచ్చారో తెలీదు కానీ బళ్లారి నుండి కడపాకు వచ్చి స్థిరపడ్డారు. వీరి కుటుంబంలో యాదాల్ల నాగమ్మ గారు , యాదాల్ల రంగమ్మ గారు ధర్మదాతలుగా పేరుపొందారు.
నాగమ్మ గారు చేతికి వెన్నెముక లేనట్టు దానాలు చేసేవారని, పేద పిల్లల చదువులకి భూరి విరాళాలు ఇచ్చారని, కరువుకాటకాల సమయంలో పేదలను భోజనం పెట్టి ఆదుకున్నారని చెప్తారు. నేటికీ కడప చుట్టుపక్కల పల్లెలలో యాదాల్ల నాగమ్మ గారి పేరు చెబితే పెద్దలు తమ జ్ఞాపకాలు చెబుతారు.
Read 4 tweets
నావికుల తిరుగుబాటులో పాల్గొన్న మన స్వాతంత్య్ర సమరయోధులు - రాజన్న

1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అఖిల భారత కాంగ్రెస్ నేతలు, స్వాతంత్ర్య సమరయోధులు ఖైదు చేయబడ్డారు. అలా కొంతకాలం స్వాతంత్ర్య పోరాటంలో స్తబ్దత నెలకొన్న సమయంలో రెండు ఘటనలు భారతదేశంలో బ్రిటీషు వారి మూలాలను ImageImage
కదిలించి దేశాన్ని స్వాతంత్య్రం వైపు నడిపించాయి. ఒకటి సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ పోరాటం కాగా రెండోది 1946లో భారత నావికా దళంలో తిరుగుబాటు

రాయల్ ఇండియన్ నేవీ (RIN Matinee)తిరుగుబాటులో పాల్గొన్న వారిలో అనంతపురం జిల్లాకు చెందిన రాజన్న గారు కూడా ఉన్నారు
రాజన్న గారిది అనంతపురం జిల్లా కదిరి మండలం కాళసముద్రం గ్రామం. SSLC వరకు చదివి రాయల్ ఇండియన్ నేవీలో చేరారు.

1946 ఫిబ్రవరి 18న తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా నాటి బాంబాయి హార్బరులోని తల్వార్ ఓడకు(HMIS Tawar) చెందిన రేటింగ్స్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు.
Read 6 tweets
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలి అనగానే గుర్తుకు వచ్చే పేరు - భానుమతి రామకృష్ణ గారు

తెరపైన కథ -స్క్రీన్ ప్లే- మాటలు - పాటలు - సంగీతం - దర్శకత్వం అన్నిటికీ ఒకే పేరు కనపడితే వెంటనే గుర్తుకు వచ్చేది SV కృష్ణారెడ్డి గారు Image
ఆ బహుముఖప్రజ్ఞ, అలాగే ఒకేచిత్రంలో ఒకరే కీలక విభాగాలలో పనిచేయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొదలయ్యింది తొలితెలుగు సూపర్ స్టార్, పాల్ ముని ఆఫ్ ఇండియా, దక్షిణాదిన పద్మశ్రీ అవార్డు పొందిన తొలి నటుడు, జాతీయఅవార్డు గ్రహీత, చిత్తూరు నాగయ్యగా ప్రసిద్ధి చెందిన ఉప్పలదడియం నాగయ్య శర్మ గారితో
1946లో విడుదలైన త్యాగయ్య చిత్రం లో స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించడమేకాక, ఆ చిత్రానికి కథ, సంగీతం, స్క్రీన్ ప్లే (ఇతరులతో పాటు) కూడా పాలుపంచుకున్నారు. ఆ చిత్రంలో అద్భుతమైన పాటలు కూడా పాడారు. Image
Read 4 tweets
మాయాబజార్

90 ఏళ్ల తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యద్భుత చిత్రాలలో మొదటి స్థానం ఏ చలనచిత్రానిది అంటే ఏ మాత్రం తడుముకోకుండా 'మాయాబజార్' అని చెప్పవచ్చు.

1957 మార్చి 27 విడుదల అయిన ఈ చిత్ర నటన, సంగీత, ఛాయాగ్రాహణం, సాహిత్యం, నిర్మాణ విలువలు, కళ, దర్శకత్వం ఇలా ప్రతీ విభాగం అత్యద్భుతం ImageImageImageImage
దర్శక నిర్మాతలకు ఈ చిత్రం మీద ఎంత నమ్మకం లేకుంటే అప్పుడప్పుడే విడుదల అయిన చిత్రం యొక్క కథ మొత్తం (ప్రతీ సన్నివేశం ) ఏప్రిల్ నెల చందమామ సంచికలో విడుదల చేసారు.

మహాభారతం లోని కథే కదా అందరికీ తెలిసిన కథే కదా అనుకోవచ్చు . మాయాబజార్ అచ్ఛంగా పౌరాణిక కథ కాదు . కల్పిత కథ. ImageImage
నాగిరెడ్డి & చక్రపాణి (విజయా సంస్థ ) మరియు కె.వి రెడ్డి గార్ల అద్భుత సృష్టి 'మాయాబజార్' కథ సంగ్రహంగా ఏప్రిల్ 1957 చందమామ మాసపత్రికలో ప్రచురితమైనది .

ఆ కథ మీకోసం

#సీమరత్నాలు #మాయాబజార్

కర్టెసీ : చందమామ ImageImage
Read 3 tweets
నిజ జీవిత హీరోలు-మేజర్ జనరల్ చిత్తూరు వేణుగోపాల్

భారతదేశ యుద్ధ విజయాలలో అత్యంత చిరస్మరణీయమైంది 1971 ఇండో- పాక్ యుద్ధ విజయం(బాంగ్లాదేశ్ విమోచన యుద్ధం ). ఆ యుద్దంలో భారత సైన్యం ఇటు తూర్పున(తూర్పు పాకిస్తాన్), అటు పశ్చిమాన పాకిస్తాన్ సైన్యంతో ఏక కాలంలో తలపడాల్సి వచ్చింది@46Kartheek ImageImage
భారత దేశం త్రివిధ దళాలతో పాకిస్తాన్ ఓటమి లక్ష్యంగా 1971 డిసెంబర్ లో 'ఆపరేషన్ కాక్టస్ లిల్లీ' మొదలుపెట్టింది. అందులో ప్రముఖ పాత్ర వహించి 1971యుద్ధ సమయంలో చూపిన తెగువకు గుర్తింపుగా 'మహావీర చక్ర' పురస్కారం అందుకున్నారు మేజర్ జనరల్ చిత్తూరు వేణుగోపాల్(అప్పటికి లెఫ్టినెంట్ కల్నల్)
చిత్తూరు వేణుగోపాల్ గారు చిత్తూరు జిల్లా తిరుపతి నివాసి.
గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్ కమాండింగ్ అధికారిగా అప్పటికి లెఫ్టినెంట్ కల్నల్ గా ఉన్న చిత్తూర్ వేణుగోపాల్ ఉన్నారు. వీరి నేతృత్వంలో గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్ భారత దేశ తూర్పు సరిహద్దులో పాకిస్తాన్ సైన్యంతో తలపడింది.
Read 7 tweets
#సీమరత్నాలు

ఆంధ్ర రాష్ట్రంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి ఎవరో తెలుసా?

రాయలసీమలో మొదటి సిమెంటు పరిశ్రమ అయిన పాణ్యం సిమెంట్స్ వ్యవస్థాపకులు ఎవరో తెలుసా?

సహకార రంగంలో అతి పెద్ద చేనేత సంస్థలలో ఒకటైన YWCS(ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ) స్థాపకుడు ఎవరో తెలుసా? ImageImage
1960లలోనే విదేశీ కంపెనీల భాగస్వామ్యంతో భారత ఉపఖండంలోనే మొట్టమొదటి స్ప్రింగ్స్ తయారీ పరిశ్రమ కంపెనీ అయిన SSSను స్థాపించింది ఎవరో తెలుసా?

అన్నిటికీ ఒకే సమాధానం-మాచాని సోమప్ప

అయన పారిశ్రామికవేత్త, విద్యావేత్త, సహకారరంగంలో చేనేత పితామహుడు, జాతీయ స్థాయిలో అనేక హోదాల్లో పనిచేసినవారు
శతబ్దాలుగా ఎమ్మిగనూరు చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. వందలాది చేనేత కుటుంబాలకు ఎమ్మిగనూరు ఆవాసం. మాచాని సోమప్ప1904వ సంవత్సరంలోఒక చేనేత కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి మాచాని సోమన్న మాస్టర్ వీవర్. ఐదుగురు అన్నదమ్ముల మాచాని కుటుంబంలో సోమప్ప నాలుగవవాడు.
Read 16 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!