సొంత వాహనాల్లో ప్రయాణం చేసే మిత్రులందరికీ ఒక 4 జాగ్రత్తలు*
* బ్రేకులు చక్రాలకే గాని కారుకు కాదు. 70-80 కిలోమీటర్ల లోపు అయితే, సడెన్ బ్రేకేస్తే కారు ఆగుతుంది. కానీ అంతకు మించితే బ్రేకు వల్ల ఉపయోగం లేదు.
* ప్రమాదాలు ఎవరూ ఆపలేరు గాని... మరీ ఆగిఉన్న లారీలను ఢీకొట్టడం మాత్రం కచ్చితంగా స్వయంకృతాపరాధమే.
డ్రైవింగ్‌లో జాగ్రత్త లేనపుడు మాత్రమే ఇది జరుగుతుంది.
* మీరు హర్టయినా పర్లేదు గాని.. మీరేమీ ప్రధాని కాదు, సీఎం కాదు.. మీరు కొంచెం లేటెల్తే ఎవరి కొంపలేం మునిగిపోవు. పైగా మీ కొంప మునిగిపోయే అవకాశాలే ఎక్కువ. స్పీడు 160 దాకా కూడా వెళ్లొచ్చు.
కానీ స్ట్రెయిట్ హైవేలు కానపుడు 80 కి.మీ. కంటే, రాత్రి ప్రయాణములలో80-100 కంటే ఎక్కువ స్పీడు కచ్చితంగా ప్రమాదకరం.
అయినా రాత్రిపూట సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ అర్జెంటుగా మీరు ఉద్దరించాల్సిందేంటో ఆలోచించాలి.
*రిస్కు.*
*వ్యాపార ములో చేస్తే డబ్బులు పోతాయి*
*రోడ్ల మీద చేస్తే ప్రాణములు పోతాయి*
*మీరు లేకుంటేమిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు పడే బాధను ఊహించి జాగ్రత్త గా డ్రైవ్ చేయండి*
జాగ్రత్తగా డ్రైవ్ చేయడం ద్వారా మన ప్రాణములను నిలుపుకుందాం...
ఎదుట వచ్చే వారి ప్రాణమునకు హామీ ఇద్దాం......
వేగం వద్దు....ప్రాణం ముద్దు
నిదానమే ప్రదానం అని ఊరికే అనలేదు భయ్యా, ఆలోచించండి, ఆచరించండి.. ☝☝
80Kmph స్పీడ్ కి 100-120kmph స్పీడ్ కి మధ్య తేడా కేవలం 10 నిమిషాలు మాత్రమే లేటయితే పోయేది ఏమీ లేదు, కానీ తొందర పడితే పోయేది కొన్ని జీవితాలు...
ఇట్లు --మీ
శ్రేయోభిలాషి .
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
