రాయలసీమ ~ Rayalaseema Profile picture
FB: https://t.co/zAsZHzxBuE Insta : https://t.co/g07orhy9UU YT: https://t.co/44nxdobW9n Strictly Personal Opinions

Mar 30, 2020, 6 tweets

నేత్ర దర్శనం - నిత్య నేత్ర దర్శనం

శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. తిరుమల శ్రీవారిని నిత్యం పూమాలలతో, ఆభరణాలతో, చీనాంబరాలతో అలంకరిస్తూ ఉంటారు. శ్రీవారికి వివిధ కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు.

#TTD #తిరుమల #నారాయణవనం #చిత్తూరు
#Rayalaseema_Temples

శ్రీవారి తిరునామం, నుదుటిన కస్తూరి వంటివి అలంకరించడం వల్ల స్వామివారి కన్నులు మామూలు రోజుల్లో భక్తులకు పూర్తిగా కనిపించవు.కానీ గురువారం ఉదయం పూజ అయిపోయిన తరువాత మూలవిరాట్టుకు ఆభరణాలు, పూమాలలు తీసేస్తారు. ఆ రోజు స్వామి కేవలం అంగవస్త్రాలతో (ఉత్తరీయం, ధోతీ ) దర్శనమిస్తారు.

ఆ రోజు స్వామివారికి తిరునామం, నుదుటిన కస్తూరి చిన్నగా అలంకరించడం వల్ల, కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి. అందుకే ఆ దర్శనాన్ని నేత్ర దర్శనం అంటారు.

గురువారం నాడు స్వామివారికి ఉన్నపెద్ద నామాన్ని తీసేసి, కనుబొమ్మల మధ్య పట్టే విధంగా చిన్న నామం అలంకరిస్తారు.

స్వామివారి కనుచూపులు ఒక్కసారిగా మానవమాత్రులపై పడితే భరించలేరు.అందువల్ల స్వామివారికి ఎదురుగా పులిహోర రాశిగా పోసి స్వామివారి మొదటి చూపు ఆ అన్నరాశి మీద పడేలా చేస్తారు. శ్రీవారి చూపుల తీవ్రత తగ్గించడంలో ఆ అన్నరాశి ‘తెర’లాగా (పావడ) ఉంటుంది కాబట్టి ఈ సేవను తిరుప్పావడ సేవ అంటారు.

శ్రీవారి నేత్ర దర్శనం అత్యంత విశేషమైనది. స్వామివారి ‘నేత్రదర్శనం’ చేసుకున్నవారికి సకల శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.

అయితే తిరుమలలో శ్రీవారినేత్ర దర్శనం వారంలో అన్ని రోజులూ సాధ్యమవదు.

కానీ వెంకటేశ్వర స్వామి పద్మావతిఅమ్మవారిని వివాహం చేసుకున్న నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి ‘నిత్య నేత్రదర్శనం’ లభ్యమవుతుంది.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling