రాయలసీమ ~ Rayalaseema Profile picture
FB: https://t.co/zAsZHzy9kc Insta : https://t.co/g07orhyHKs RTs and Likes≠ Endorsement Strictly Personal Opinions
5 subscribers
Jul 23 4 tweets 1 min read
జులై 23 - #సీమచరిత్రలోఈరోజు

1846 - అప్పటికే బ్రిటీషు వారిపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అతని సైన్యంతో లెఫ్టినెంట్ వాట్సన్ నేతృత్వంలోని కుంఫిణీ సైన్యం గిద్దలూరు వద్ద తలపడింది. రెండు పక్షాల మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. రెడ్డి అనుచరులు చాలా మంది చనిపోయారు. Image అధిక సంఖ్యలో ఉన్న నరసింహా రెడ్డి సైన్యం ముందు నిలవలేక వాట్సాన్, వెనుకంజ వేసి తన సైన్యాన్ని తీసుకుని శెట్టివీడు (కృష్ణం శెట్టిపల్లె?) చేరుకున్నాడు. నరసింహారెడ్డి తన అనుచరులతో ముండ్లపాడు చేరుకున్నాడు.
Feb 1 10 tweets 3 min read
శ్రీశైల ప్రాకారంపై ఉన్న కొన్ని అరుదైన శిల్పాలు

1. ఒక తల - నాలుగు శరీరాలు Image 2. సూర్య చంద్రులు - మధ్యలో చతుర్ముఖ లింగం Image
Jul 8, 2023 15 tweets 5 min read
తెలుగు సాహిత్య సేవలో కట్టమంచి కుటుంబం

కట్టమంచి.. ఒకప్పటి ఉత్తర ఆర్కాడు జిల్లా కేంద్రం అయిన చిత్తూరు పట్టణాన్ని ఆనుకొని ఉండే ఒక గ్రామం. ఆ చిన్న గ్రామం తెలుగు సాహిత్యానికి, విద్యారంగానికి ఎనలేని సేవ చేసింది.

ఆ గ్రామంలో కట్టమంచి కొళంద రెడ్డి కుటుంబం పేరెన్నికగన్నది. ప్రముఖ విద్యావేత్త, రచయిత, విమర్శకుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయ మొట్టమొదటి ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు కొళందరెడ్డి కుటుంబంలో 5వ తరము వారు. కట్టమంచి కుటుంబంలో కవితా ప్రవాహం కేవలం రామలింగారెడ్డి గారితో మొదలు కాలేదు. వీరికి రచనా వ్యాసంగం, సాహిత్యాభిలాష పారంపర్యంగా లభించాయి
May 18, 2023 9 tweets 2 min read
వారి పేరు మణిమేకల శివశంకర్. నాకు శాసనాల శంకర్ పేరుతో @tuxnani ద్వారా పరిచయం. చదువుకున్నది 5వ తరగతి. వృత్తి ముఠా కూలీ. ప్రవృత్తి: శాసనాల శోధన, చరిత్ర పరిశోధన. ఇటీవలే గుంటూరు జిల్లాల అదృశ్య గ్రామాల చరిత్ర అనే పుస్తకం రచించారు. Image ఎంతో కష్టపడి రచించిన ఆ పుస్తకాన్ని నెలలు గడవక ముందే చరిత్రాభిమానులకు ఉచితంగా PDF రూపంలో పంపించారు. నాకు గురుతుల్యులు. రాయలసీమ చరిత్రపై పరిశోధన చేయాలని నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదైనా రాయలసీమ గురించి మంచి పుస్తకం వారి దృష్టికి వస్తే
Apr 1, 2023 5 tweets 2 min read
గుడిమల్లం అసలు పేరు తిరువిప్పిరంబేడు (శాసనాల ప్రకారం).

తిరు అంటే శ్రీ / గొప్ప / పుణ్యమైన అని అర్థాలు ఉన్నాయి
విప్పిర అన్నది సంస్కృత ' విప్ర ' నుండి వచ్చింది. అంటే బ్రాహ్మణుడు అని అర్థం
పేడు అన్న పదం గ్రామ సూచి (ఉదా: ఏర్పేడు)

తిరువిప్పిరంబేడు అంటే గొప్ప బ్రాహ్మణుడి ఊరు అని అర్థం ఎవరా గొప్ప బ్రాహ్మణుడు ?

స్థలపురాణం ప్రకారం ఈ ప్రాంతం పరశురాముడు శివుడిని కొలిచిన ప్రాంతం. బహుశా శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురాముడే ఊరి పేరులో ఉన్న గొప్ప బ్రాహ్మణుడు అయ్యుండాలి.

'జయన్ గొండచోళమండలం'లోని 'పేరుంబాణప్పాడి'లోని 'వెంకటకొట్టం'లోని 'శిలైనాడు'లోని 'తిరువిప్పిరంబేడు'
Mar 31, 2023 6 tweets 3 min read
శ్రీశైల పంచ మఠాలు

1. ఘంటా మఠం 2. సారంగధర మఠం
Mar 30, 2023 4 tweets 3 min read
ప్రపంచ సాహిత్యంలో అతిపెద్ద పదం

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి ప్రకారం ప్రపంచ సాహిత్యంలో ఏ భాషలో నైనా సరే ఉపయోగించబడ్డ అతిపెద్ద పదం కృష్ణదేవరాయల సోదరుడు అచ్యుతదేవరాయల భార్య తిరుమలాంబ రచించిన సంస్కృత చంపూ కావ్యం 'వరదాంబికా పరిణయం'లోనిది. ImageImage అచ్యుతదేవరాయలతో సలకం వారి ఆడపడుచు వరదాంబిక వివాహం ఇతివృత్తంగా రాయబడిన ఆ కావ్యంలో తుళువ నరస నాయకుడి (కృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయల తండ్రి) దండయాత్రలో భాగంగా 'తుండీర దేశం'(కంచి రాజధానిగా కలిగిన తొండమండలం) వర్ణించే క్రమంలో 195 సంస్కృత అక్షరాలతో (428 రోమన్ అక్షరాలు)ఒకే పదం వాడబడింది. Image
Mar 30, 2023 6 tweets 2 min read
ఒంటిమిట్ట రామాలయం కట్టించింది ఎవరు ?

స్థానిక చరిత్రలు ఒంటిమిట్ట కోదండ రామాలయం బుక్కరాయల సోదరుడు / కుమారుడు కంపరాయలు కట్టించినట్టు చెబుతాయి. అయితే ఒంటిమిట్ట కైఫీయత్తు మాత్రం ఒంటిమిట్ట ఆలయాన్ని సంపెట నల'కంపరాయలు' కట్టించినట్టు చెబుతుంది. శాసన, కైఫీయత్తుల ప్రకారం సంపెట నలకంపరాయలు ImageImage కృష్ణదేవరాయలు - అచ్యుతదేవరాయల కాలం నాటి సామంత రాజు (పైన పేర్కొన్న బుక్కరాయల కంపరాయలకు సుమారు 200 సంవత్సరాల తరువాత వాడు).

ఆలయం కట్టించినది సంగమ వంశ కంపరాయలా (14వ శతాబ్దం) లేక సంపెట వంశ కంపరాయలా (16వ శతాబ్దం) అన్నది తేల్చడానికి ఎటువంటి శాసన ఆధారాలు లేవు.
Mar 29, 2023 7 tweets 2 min read
కర్నూలు రాజ్య రక్షణకై రణరంగాన వీరమరణం పొందిన కడప రాజు - మట్ల తిరువెంగళనాథ రాజు

మట్ల తిరువెంగలనాథుడు తండ్రికి మట్ల అనంతరజుకు తగ్గ మానధనుడు. ఒకనాడు కందనూరి (కర్నూలు) రాజు ఆరవీటి గోపాలరాజు తిరువెంగళనాథుడితో - మీ తాత(మట్ల ఎల్లమరాజు), తండ్రి(మట్ల అనంతరాజు) గొప్ప పరాక్రమవంతులు. నీవు చిన్నవాడివి. అనవసరపు శౌర్య ప్రదర్శనకు యత్నించకుండా సమయోచితానుసారము కాలము గడిపితే మంచిది అని హితువు చెప్పగా ఆ మాటలగొకు నొచ్చుకున్న తిరువెంగళ హనాథరాజు కందనూరు గోపాలరాజుతో మీరు మమ్మల్ని బాలురుగా అనుకున్నప్పటికీ మీ వంటి వారికి శత్రువుల నుండి ప్రమాదం
Mar 29, 2023 5 tweets 2 min read
తలయేరు గుండు

ఈ ఫోటోలో కనిపిస్తున్న పెద్ద బండను తలయేరు గుండు అంటారు అలిపిరి నుంచి తిరుమల వెళ్లే కాలినడక మార్గంలో ప్రథమ గోపురం దాటిన తరువాత ఈ తలయేరు గుండును చూడవచ్చు. తలయేరు అంటే తలనొప్పి అని అర్థం. ఏడుకొండలు ఎంతో శ్రమతో ఎక్కి, దిగే భక్తులకు తలనొప్పి, ఒంటినొప్పులు మోకాళ్ల నొప్పులు వంటివి రాకుండా ఉండడానికి తమ తలను మోకాళ్ళను ఆ గుండుకు తాకించి చిన్నగా రుద్దుతారు అలా చేస్తే ఒంటినొప్పులు రావని ఉన్న నొప్పులు పోతాయని భక్తుల నమ్మకం. అలా అనేక శతాబ్దాలుగా భక్తులు తమ తల, మోకాళ్లు ఆ గుండుకు ఆనించి ఆనించి ఏర్పడిన గుంతలను మనం నేటికీ చూడవచ్చు. దీనికే మరొక కథ కూడా ఉంది
Mar 28, 2023 4 tweets 2 min read
అవ్వాచారి కోన అక్కగార్లు.

ప్రతీ రోజూ రాత్రి తిరుమల శ్రీవారు పవళింపు సేవ అయిపోయాక, ఆనందనిలయానికి బీగం (తాళం ) వేసి కిందకి నడక మార్గాన వస్తూ అవ్వాచారికోన అక్కగార్లకు బీగించెవులు(తాళం చెవి) ఇచ్చి అలా కిందకి నడుచుకుంటూ వచ్చి అలిపిరి దగ్గర ఉన్న పాదాల మండపంలో ఉన్న తన మెట్లు(చెప్పులు) వేసుకుని అలా నేరుగా తిరుచానూరు పద్మావతీ అమ్మవారి వద్దకు వెళ్లి, రాత్రి అమ్మవారితో ఉండి తిరిగి ఉదయాన పాదాల మండపంలో చెప్పులు వదిలి నడుచుకుంటూ పైకి ఎక్కి అక్కగార్ల వద్ద బీగించెవి తీసుకుని సుప్రభాత వేళకు ఆనంద నిలయం చేరుకుంటాడట. అలా స్వామి కూడా కొండను చెప్పులు లేకుండానే ఎక్కుతాడని
Feb 19, 2023 25 tweets 3 min read
దేవబ్రాహ్మణ అగ్రహారాల సీమ - కమలాపురం

కడప జిల్లాలోని కమలాపురం మరియు కమలాపురం చుట్టుపక్కల చాలా ప్రధాన గ్రామాలు బ్రాహ్మణులకు, కవులకు లేదా ఆలయాలకు సర్వమాన్యాలుగా / అగ్రహారాలుగా ఇవ్వబడిన గ్రామాలు. వీటిల్లో అనేక గ్రామాలకు ఇప్పుడున్న పేరు కాకుండా దానసమయంలో ఇవ్వబడిన పేర్లు ఉండేవి -a 🧵 1. కమలాపురం-మండల/తాలూకా కేంద్రం

పుష్పగిరి క్షేత్రం ఉన్న కుసుమాచల పర్వతానికి పశ్చిమాన పాపాగ్ని పాగేరు అనే నదుల మధ్య ఉండే కమలాపురం గ్రామం పుష్పగిరిలో ఉన్న బ్రహ్మదేవ ప్రతిష్ట కమలేశ్వర స్వామికి పడితరానకు నడిచేది. పుష్పగిరిలోని కమలేశ్వర స్వామి పేరిటే ఈ ఊరికి కమలాపురం అనే పేరొచ్చింది
Feb 19, 2023 4 tweets 2 min read
శ్రీశైల ఘంటా మండపంలో లభించిన తామ్ర శాసనం

Śrīśailam copper plate grant of Kopaṇa,

This set of copper plate is recovered recently during the course of renovation work in Ghanṭā-maṭhaṁ at Śrīśailam, Kurnool district, Andhra Pradesh. It is dated Śōbhakṛt, Vaiśākha, śu. 15, written in Sanskrit language and Nāgarī characters of the 15th-16th century C.E.

It records the gift of a village Yaḍadapura situated in Yalabarga for providing food offerings, burning perpetual lamp and conducting festivities to the god
Nov 12, 2022 11 tweets 3 min read
ఈ కార్తీక మాసం మీరు దర్శించడానికి సీమలోని కొన్ని ప్రసిద్ద ఆలయాలు

1. శ్రీశైలం, నంద్యాల జిల్లా 2. శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా
Nov 7, 2022 4 tweets 1 min read
పొన్నియిన్ సెల్వన్ - రాయలసీమ

చోళ చక్రవర్తి రాజరాజ చోళ / అరుళ్ మొళి వర్మన్ / పొన్నియిన్ సెల్వన్ జీవిత కథ ఆధారంగా ఇటీవల వచ్చిన చిత్రం పొన్నియిన్ సెల్వన్ -1 / PS -1.

రాజరాజ చోళుడి సహా అనేక మంది చోళ చక్రవర్తులు రాయలసీమను పాలించారు. ఇక్కడి శివాలయాలకు భూరి విరాళాలు ఇచ్చారు. వారు / వారి సామంతులు / వారి అధికారులు వేయించిన అనేక శాసనాలు నేటికీ సీమలో అనేక చోట్ల లభిస్తున్నాయి.

అయితే ఈ రాజరాజ చోళ / పొన్నియిన్ సెల్వన్ జేజి / నాయనమ్మ వైదుంబల ఆడపడుచు.

వైదుంబులు రాయలసీమ ప్రాంతాన్ని ముఖ్యంగా కడప, చిత్తూరు ప్రాంతాలను 9- 12 వ శతాబ్దాలలో ఏలినవారు.
Sep 5, 2022 9 tweets 2 min read
'యాడికి' పట్టణానికి ఆ పేరేలా వచ్చింది ?

యాడికి -

భైరవకొండ సమీపంలోని మాత్యేని కోట అనే పేరు గల కొండ మీద మాల్యవంతుడు అనే మిక్కిలినేని కమ్మ నాయకుడు ఉండేవాడు. అతన్ని అండలో అనేకమంది వేటగాళ్లు ఉండేవారు. వారు ఉదయమంతా తలో దిక్కుకు వేటకు వెళ్లి, సాయంత్రం గ్రామం చేరేవారు. ఒక నాడు మాల్యవంతుడు ఈ వేటగాళ్లను పిలిచి తాను మాత్యేని కోట సమీపంలో ఒక గ్రామము నిర్మించదలచానని, మీరంతా వేట నిమిత్తం అరణ్యాలలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి, గ్రామం కట్టడానికి ఉత్తమమైన ప్రాంతం తనకు తెలియపరచమని వారిని అడిగాడు.
Sep 5, 2022 4 tweets 1 min read
'సైరా' సినిమాలో బాలుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని వారసులు లేని నొస్సం పాలేగాడు(నరసింహారెడ్డి తాత) జయరామిరెడ్డి దత్తత తీసుకున్నాడని, బ్రిటీషు వారి అరాచకాల గురించి నరసింహారెడ్డి జయరామిరెడ్డిని ప్రశ్నించి, మీరెందుకు వారిని ఎదురించట్లేదు అని అడిగితే, తెల్లవాళ్లు బలవంతులని వాళ్లని ఎదురించలేక వారిచ్చే తవర్జీ (పెన్షన్) తీసుకోవాల్సి వస్తోందని జయరామిరెడ్డి చెప్తాడు.

చారిత్రకంగా ఈ రెండూ శుద్ధ తప్పులు.

1. జయరామిరెడ్డికి నరసింహారెడ్డి అని ఒక కొడుకు ఉండేవాడు. అతడిని నొస్సం నరసింహారెడ్డి అని అనేవారు. జయరామిరెడ్డి మరణాంతరం ఈ నొస్సం నరసింహారెడ్డి పాలేగాడు
Jul 19, 2022 17 tweets 5 min read
Images of Gods and Goddesses from Rayalaseema - A compendium of 100 years old photos

రాయలసీమలోని దేవుళ్ల ప్రతిమలు - 100 సంవత్సరాల క్రితం నాటి ఫోటోల సమాహారం

నరసింహోద్భవం, అహోబిలం ఉగ్రనారసింహ, అహోబిలం
Jul 18, 2022 20 tweets 5 min read
రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి గారి ఎన్నిక - విశేషాలు

ఫిబ్రవరి 11, 1977 భారతదేశ 5 వ రాష్ట్రపతి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఆకస్మికంగా మరణించారు. అప్పటికి ఎమర్జెన్సీ ఇంకా అమలులో ఉంది. తాత్కాలికంగా నాటి ఉపరాష్ట్రపతి శ్రీ BD జత్తి గారు రాష్టపతిగా ప్రమాణస్వీకారం చేశారు. తరువాత కొంతకాలానికే సార్వత్రిక ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ ఓడిపోయి జనతాపార్టీ గెలిచి, మొరార్జీ దేశాయి గారు ప్రధాని అవ్వడం జరిగింది. ఆ ఎన్నికలో నంద్యాల నుండి ఎన్నికై నీలం సంజీవరెడ్డి గారు లోకసభ స్పీకర్ గా ఎన్నుకోబడ్డారు.
Jul 9, 2022 13 tweets 4 min read
పులగం

రాయలసీమలో పులగం పేరు తెలియని వారు ఉండరు. శనివారాల్లో, పండగ దినాల్లో ( ముఖ్యంగా సంక్రాంతి పండుగకు) సీమ ఇండ్లల్లో ఎక్కువగా పులగం చేసుకుంటూ ఉంటారు. అందరూ సాధారణంగా చేసుకునే వంటకమైనా, పులగానికి చాలా పెద్ద చరిత్ర ఉంది.

పులాక అనే సంస్కృత పదము నుండి పులగము అనే పేరు వచ్చింది. పులాకము అంటే అన్నపు మెతుకు అని అర్థము. పెసర పులాకము / పెసర పులగాన్నే సంక్షిప్తంగా పులగం అంటున్నారు. బియ్యానికి, పొట్టుతో కూడిన పెసరపప్పు (పెసర బేడలు) కలిపి చేసే అన్నమే పులగం. పులగాన్ని ముద్గాన్నాము లేదా ముద్గలాన్నాము అని కూడా అంటారు.
Jun 12, 2022 5 tweets 2 min read
హిందూపురం - సూగూరు

రాయలసీమలోని ప్రముఖ పట్టణాలలో అతి నూతనమైన పట్టణాలలో ఒకటి హిందూపురం (పుట్టపర్తి కూడా ఆ కోవలోకే వస్తుంది). హిందూపురం ఏర్పడేకంటే ముందు అక్కడ 'సూగూరు' అనే ఊరు ఉండేది. 18వ శతాబ్దంలో మరాఠా సర్దారు మురారి రావు గుత్తి కోట నుండి పరిపాలన చేసే కాలంలో, వారికి, మైసూరు సుల్తానులకు నిత్యం యుద్ధాలు జరిగేవి. రాజ్యరక్షణకు, మైసూరు సుల్తానులను ఎదుర్కొనేందుకు మురారి రావు తండ్రి సిద్ధోజి నేతృత్వంలో పెద్ద సైనిక పటాలంతో ఈ సూగూరు పరిసరాల్లో చాలా కాలం ఉండేదట. సైనికులకు అవసరమైన సేవలు అందించేందుకు అనేక వృత్తుల వారు కూడా సూగూరుకు వచ్చి ఉండేవారు