రాయలసీమ ~ Rayalaseema Profile picture
FB: https://t.co/zAsZHzxBuE Insta : https://t.co/g07orhy9UU YT: https://t.co/44nxdobW9n Strictly Personal Opinions

Apr 6, 2020, 8 tweets

ఏప్రిల్ 6 - తిరుమల తిరుపతి దేవస్థానముల నిత్యాన్నదాన పథకం దినోత్సవం

శ్రీవారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని చూడటానికి దేశం నలువైపులనుండి భక్తులు వస్తూ ఉంటారు.

#తితిదే #TTD #Tirumala

స్వామివారి సన్నిధిలో అటువంటి భక్తుల ఆకలి తీర్చడానికి వెంకటేశ్వర నిత్య అన్నదానం పథకం 1985 ఏప్రిల్6 వ తేదీన రోజూ రెండు వేలమందికి ఉచిత భోజనం అందించేవిధంగా మొదలైంది. నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభమైన అన్నదాన పథకం ఇంతితై వటుడింతై అన్నవిధంగా

నేడు మూడు పూటలా రోజుకు సుమారు 1,70,000 మందికిపైగా, వారాంతరాల్లో 2 లక్షలకు పైగా భక్తులకు తితిదే భోజనం అందిస్తోంది. మొదట్లో పరిమిత టోకెన్లు ఇచ్చేవారు, తరువాత దర్శనం చేసుకునేవారికే టోకెన్లు ఇచ్చేవారు. ఇప్పుడు దర్శనంతో సంబంధం లేకుండా, అనేక చోట్ల అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు.

వందల మంది తితిదే ఉద్యోగులు, వేల మంది శ్రీవారి సేవకులు ఈ యజ్ఞంలో భాగం పంచుకుంటున్నారు.

తరువాత పథకం అమలుకు 1994 ఏప్రిల్ 1 న శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం ట్రస్ట్ మొదలైంది. 20 ఏళ్ల తరువాత, 2014 ఏప్రిల్ 1 నుండి ఆ ట్రస్ట్ పేరు “శ్రీవెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్”గా మార్చారు

పేరుకు తగ్గట్టుగానే భక్తులు తితిదే భక్తులకు అందించే భోజనాన్ని శ్రీవారి ప్రసాదంగానే భావిస్తారు. నిత్యాన్నదాన కాంప్లెక్ లో మాత్రమే కాకుండా క్యూ లైన్లు, భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్సు, CROవద్ద, PAC వద్ద ఇలా అనేక ప్రదేశాలలో తితిదే భోజనం, పాలు వంటివి భక్తులకు అందజేస్తోంది

పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక కిచెన్ తో, ఒకే సారి వేల మంది తినే విధంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదానం కాంప్లెక్ ను తితిదే నిర్మించింది. నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు 2011 జులై 7న ఈ కాంప్లెక్స్ ను ప్రారంభించారు.

ఈ అన్నదానం కాంప్లెక్ లో ప్రతిరోజూ 50 వేలకు మంది పైగానే భోంచేస్తుంటారు. మూడుపూటలా భోజనంతో పాటు (బ్రేక్ఫాస్ట్, రెండు పూటలా భోజనం) భక్తులకు తితిదే పాలు కూడా అందిస్తోంది.

తితిదే తిరుమలలోనే కాక తిరుపతిలోనూ మరియు కొన్ని అనుబంధ ఆలయాలలో కూడా నిత్య అన్నదానం కార్యక్రమం చేపడుతోంది.

ఈ అన్నప్రసాద యజ్ఞాన్ని చేస్తోన్న తితిదేకి విరాళాల రూపంలో అనేక మంది భక్తులు, దాతలు తమ వంతు చేయూతను ఇస్తున్నారు.

తితిదేకి, అటువంటి భక్తులందరికీ వెంకటేశ్వర నిత్య అన్నదాన పథకం ప్రారంభమైన ఈ రోజు (ఏప్రిల్ 6) - ధన్యవాదాలతో - అన్నదాతా సుఖీభవ

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling