రాయలసీమ ~ Rayalaseema Profile picture
FB: https://t.co/zAsZHzxBuE Insta : https://t.co/g07orhy9UU YT: https://t.co/44nxdobW9n Strictly Personal Opinions

May 9, 2020, 11 tweets

జపాలి క్షేత్రం

అవతరించిడానికంటే ముందే హనుమంతుడు రూపాన్ని భక్తునికి దర్శన భాగ్యం అనుగ్రహించిన అత్యంత పవిత్రమైన క్షేత్రం ఏమిటో తెలుసా?

పరమ పవిత్ర తిరుమల క్షేత్రంలో శ్రీరాముడు స్నానమాచరించిన రామ గుండం ఎక్కడ ఉందో తెలుసా?

అనేక విశేషాలకు నెలవైన ఆ క్షేత్రమే జపాలి క్షేత్రం.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న వేంకటాచలం అణువణువూ పవిత్రమైన స్థలమే. 108 దివ్య తీర్థాలతో అలరారుతున్న తిరుమలలో తప్పక చూడవలసిన క్షేత్రాలలో ఒకటి జపాలి తీర్థం / జపాలి ఆంజనేయ స్వామి గుడి

#Rayalaseema_Temples #Chittoor_Temples #Ravishing_Rayalaseema #Tirumala

స్థల పురాణం :

త్రేతాయుగంలో దుష్ట సంహారం చేయడానికి శ్రీ మహావిష్ణువు శ్రీ రామచంద్ర స్వామి అవతారం ఎత్తగా, శ్రీరాములవారికి సహాయము చేయడానికి శివుడే / శివుడి అంశనే ఆంజనేయ స్వామిలా అవతరించారని ప్రతీతి.

అయితే జావాలి అనే మహర్షి హనుమంతుడి అవతారనికంటే ముందే ఆ రూపాన్ని దర్శించి, ప్రసన్నం చేసుకోవాలని అనేక చోట్ల ఘోర తపస్సు చేస్తూ తిరుమల కొండపై అనేక జప / హోమాలు చేసిన పిమ్మట స్వామి భవిష్యత్తులో అవతరించబోయే హనుమంతుని రూపాన్ని ఇక్కడ స్వయంభుగా వెలసి జావాలి మహర్షికి చూపించినాడని స్థల పురాణం

జపాలి క్షేత్ర పేరు.

జావాలి మహర్షి జాపాలకు మెచ్చి స్వామి స్వయంభుగా వెలసినందువల్ల ఈ క్షేత్రం జాపాలి క్షేత్రంగా పిలవబడుతోంది. ఈ క్షేత్రంలోనే పరమ పవిత్రమైన తీర్థాలైన రామగుండం, సీతాగుండం, ధృవతీర్థం వంటి తీర్థాలు ఉండటం వల్ల జపాలి తీర్థం అయ్యింది.

రామగుండం / సీతాగుండం /హనుమాన్ తీర్థం/ ధృవ తీర్థం

శ్రీరాముడు రావణాసురున్ని సంహరించి సీతా మాత సమేతంగా అయోధ్య వెళుతూ ఇక్కడ స్నానామాచరించినారట. అందుకే శ్రీరాముల వారు స్నానం చేసిన తీర్థాన్ని రామగుండం (ఆలయం ఎదురుగా) అనీ, సీతమ్మవారు స్నానమాచరించిన తీర్థాన్ని సీతాగుండం అనీ పిలుస్తారు.

భక్త ధృవుడు మొదట ఇచటనే తపమాచరించినాడాట. ఇప్పటికీ ఇక్కడ ధృవ తీర్థం నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటినే ఆంజనేయ స్వామి వారి కైంకర్యాలకు వినియోగిస్తున్నారు. ఈ తీర్థములోని నీరు అనేకఔషధ గుణాలు కలిగి ఉన్నవని ప్రతీతి. ఆలయానికి పశ్చిమాన ఉన్న తీర్థాన్ని హనుమాన్ తీర్థం అని పిలుస్తున్నారు

ఆలయ విశిష్టత :

ఎటువంటి కష్టానష్టాలున్నా స్నానం చేసి తడిబట్టలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కష్టాలు తీరుతాయని విశ్వాసం. జన్మశని కలిగినవారు తమ పుట్టినరోజు నాడు ఇక్కడ స్వామి వారికి పూజ, అభిషేకము చేస్తే శని ప్రభావం వల్ల కలిగే అనేక బాధలు కలగవు అని మరో విశ్వాసం.

అలాగే పంచమహా పాతకాలు, భూత, ప్రేత, పిశాచాది బాధలు ఉన్నవారు ధృవ తీర్థంలో స్నానామాచారిస్తే ఆ కష్టాలు తీరుతాయని స్కాందపురాణంలోని వేంకటాచల మహాత్మ్యంలో చెప్పబడిందట. జావాలి మహర్షి ఇక్కడి రామగుండంలో స్నానమాచరించి వాక్కు దోష విముక్తుడైనాడట.

శ్రీవారి ప్రియ భక్తులైన శ్రీ హాథీరాం బావాజీ కూడా ఇక్కడే సంచరిస్తూ తపస్సు చేసుకునేవారట. ఈ ఆలయం ప్రస్తుతం శ్రీ హాథీరాంజీ మఠం వారి ఆధీనంలో ఉన్నది.

ఆలయం ఎదురుగా ఉన్న చెట్టు భాగం వినాయకుడి ఆకారంలో ఉండటం మరో విశేషం

ఈ సారి తిరుమల వెళ్లినపుడు తప్పకుండా జపాలి క్షేత్రాన్ని దర్శించుకోండి

ఆలయం తిరుమల కొండపై ఉన్నది. ఆలయం వరకు వాహనాలు వెళ్లే వీలు లేదు. భక్తులు నడక మార్గం/మెట్ల మార్గం ద్వారా జాపాలి ఆలయం చేరుకోవచ్చు. తిరుమలలో పాపవినాశనం వెళ్లే మార్గంలో శ్రీవారి పార్వేట మండపం దాటిన తరువాత జపాలి తీర్థ ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. అక్కడి నుండి ఆలయం వరకు మెట్ల దారి ఉంది.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling