రాయలసీమ ~ Rayalaseema Profile picture
FB: https://t.co/zAsZHzxBuE Insta : https://t.co/g07orhy9UU YT: https://t.co/44nxdobW9n Strictly Personal Opinions

May 28, 2020, 7 tweets

ప్రొద్దుటూరు అమ్మవారిశాల

కడప జిల్లాకు ప్రొద్దుటూరు వాణిజ్య కేంద్రం వంటిది. బంగారం, బట్టలు, ఫైనాన్స్ వ్యాపారానికి ప్రొద్దుటూరు కేంద్రం. అందుకే అందరూ ప్రొద్దుటూరుకు పుత్తడిపురి / పసిడిపురి అని కూడా అంటారు. అటువంటి ప్రొద్దుటూరుకి మరో పేరు కూడా ఉంది. అదే “రెండవ మైసూరు”.

దసరా ఉత్సవాలు కర్ణాటకలోని మైసూరులో ఎంత ఘనంగా జరుగుతాయో, ఇటువైపు ప్రొద్దుటూరులో అంత ఘనంగా జరుగుతాయి.

వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరులో ఆర్య వైశ్య కుటుంబాలు అధికంగానే ఉంటాయి. ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు.

ప్రొద్దుటూరులోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం (స్థానికంగా అమ్మవారిశాల అని పిలుస్తారు ) అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం. వందకుపైగా సంవత్సరాల చరిత్ర ఈ ఆలయం సొంతం

#KnowRayalaseema #Kadapa_Temples #Rayalaseema_Temples #Proddutur #Kadapa #Ravishing_Rayalaseema

ఆలయ చరిత్ర :

ప్రొద్దుటూరు అమ్మవారిశాలను 1890లో నిర్మించారు. కడప జిల్లా, రాజుపాళెం మండలం, పర్లపాడు గ్రామానికి చెందిన కామిశెట్టి చిన్నకొండయ్య అను శ్రేష్ఠికి (వ్యాపారికి ) కలలో కనిపించిన వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు తనకు ప్రొద్దుటూరులో మంచి ఆలయం నిర్మించాలని చెప్పడంతో,

ఆయన పూనుకుని, ఇతరుల సహకారంతో ప్రొద్దుటూరు పట్టణం, రామేశ్వరం పేటలో ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. గుంప్రమాన్ దిన్నె గ్రామ(ఆళ్లగడ్డ) శిల్పకారుల చేతిలో రూపుదిద్దుకున్న శిల్పాలు, బహుళ అంతస్తుల ఆలయ గోపురం, అమ్మవారిశాలకు మరింత వన్నెతెచ్చాయి.

మహాత్మాగాంధి (1929లో), కంచికామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి వంటి మహనీయులెందరో ఈ ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి పూజలు చేశారు.

దసరా ఉత్సవాలు

ఇక్కడ నిత్యం జరిగే పూజలు ఒక ఎత్తైతే దసరా సందర్భంగా జరిగే అలంకారాలు, ప్రత్యేక పూజలు, బాణసంచా, మెరవని మొ. ఉత్సవాలు మరో ఎత్తు.

130 సంవత్సరాలుగా అత్యంత అంగరంగవైభవంగా జరుగుతున్న ఈ దసరా ఉత్సవాల కారణంగానే ప్రొద్దుటూరుకు రెండవ మైసూరు అన్న పేరు ఏర్పడింది.

ఈ ఉత్సవాలను చూడటానికి రాష్ట్రవ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటారు.

కర్టెసీ : సాక్షి, Fairs and Festivals (Cuddapah Dist, AP) - Census of India,1961

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling