చదువులమ్మ సేవలో చౌడేపల్లి
చిత్తూరు జిల్లా ఎందరో విద్యావేత్తలు, తత్వవేత్తలకు జన్మస్థానం. అసలు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునేదే ఈ గడ్డ మీద పుట్టిన సర్వేపల్లి రాధాకృష్ణయ్య గారి జయంతిని పురస్కరించుకుని. రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థుల భవితను తీర్చిదిద్దడంలోనూ, #chittoor
వారి పాఠ్యాంశాలను వారు సులభ రీతిలో అర్థం చేసుకునేలా తోడ్పడడంలోనూ చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లిది దశాబ్దాల చరిత్ర
బడికి వెళ్లే పిల్లల నేస్తంగా, వారిలో పఠనాశక్తి పెంపొందించుతూ పరీక్షలలో వారు మంచి ప్రతిభతో ఉత్తీర్ణులు అయ్యే లక్ష్యంతో దశాబ్దాలుగా వెలువడుతున్న పత్రికలు మాబడి, పాఠశాల
ఈ రెండు పత్రికలను ప్రారంభించింది నాయుని కృష్ణమూర్తి గారు. 7 వ తరగతి విద్యార్ధుల కోసం మాబడి మాసపత్రిక, 10వ తరగతి విద్యార్ధుల కోసం పాఠశాల మాసపత్రిక 1970ల నుండి ప్రచురితం అవుతున్నాయి. విజయవాణి ప్రింటర్స్ ఈ రెండు పత్రికలు చిత్తూరు జిల్లా చౌడేపల్లి నుండి ప్రచురిస్తోంది.
చౌడపల్లి విజయవాణి ప్రింటర్స్ ను నాయుని సోదరులు నెలకొల్పారు. మాబడి, పాఠశాల వంటి పత్రికలే కాక, క్రమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు కూడా ఇక్కడ ప్రచురితమయ్యేవి. ఇప్పుడు కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల పాఠ్యపుస్తకాలు కూడా చౌడేపల్లి నుండి ప్రచురితమవుతున్నాయి.
కేవలం మసపత్రికలే కాకుండా పిల్లలకు ఉపయోగపడే నిఘంటువులు వంటి ఎన్నో పుస్తకాలు చౌడేపల్లి నుండి వెలువడుతున్నాయి. విజయవాణి వ్యవస్థాపకుల్లో ఒకరైన నాయుని కృష్ణమూర్తిగారు 2018 మార్చి 1న పరమపాదించారు. అయినా చౌడేపల్లి నుండి విజయవాణి వారి అక్షర యజ్ఞం నేటికీ అప్రతిహంగా కొనసాగుతోంది.
*చౌడేపల్లె @tuxnani
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
