రాయలసీమ ~ Rayalaseema Profile picture
FB: https://t.co/zAsZHzxBuE Insta : https://t.co/g07orhy9UU YT: https://t.co/44nxdobW9n Strictly Personal Opinions

Jul 3, 2020, 5 tweets

చరిత్ర విలువ తెలిసిన రాజు

ఏ ఆలయ ఆధునీకరణ చూచినా ఏమున్నది గర్వకారణం
చారిత్రక స్పృహ మృగ్యం, సాంస్కృతిక రక్షణ శూన్యం
ఏ ప్రాచీన దుర్గవైభవం చూసినా ఏమున్నది గర్వకారణం
గుప్తనిధుల పేర ఘనవారసత్వ విధ్వంసం

ఏ కోట, ఆలయం చూసినా ఆధునీకరణ పేరిట శాసనాలు, శిల్పసంపద విధ్వంసం, గుప్తనిధుల తవ్వకాలు

అతివంటిది 800 సంవత్సరాల కిందట ఒక రాజు చారిత్రక స్పృహతో, దూరదృష్టితో, భవిష్యత్తును భావితరాలకు అందజేయలన్న తలంపుతో చేసిన ఒక పని నేటి తరానికి ఆదర్శనీయం.

వీర నరసింహ యాదవరాయ

యాదవరాయులు 12-13 శతాబ్దంలో తొండమండల ప్రాంతాన్ని ఏలిన ప్రభువులు. వీరు చోళుల సామంతులు.

వీరిలో వీర నరసింహ యాదవరాయులు ప్రస్తుత తిరుమల, తిరుపతి, కాళహస్తి, కార్వేటినగరం మొదలైన ప్రాంతాలున్న చిత్తూరు, చెంగల్పట్టు జిల్లాలో కొంత ప్రాంతంగా ఉండిన 'తొండమండలం' చోళుల తరపున పాలించేవారు.

అప్పట్లో తిరుమలలో ఆలయ బాధ్యత స్థానత్తార్ అనే అధికారులు చూసేవారు. #TTD #తిరుమల

తిరుమల ఆలయంలో కొంత భాగం దెబ్బతిన్నదని, దాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని తిరుపుల్లాని దాసర్ అను భక్తుడు వీర నరసింగ దేవరయకు విజ్ఞప్తి చేశాడు. ఆ మేరకు దెబ్బతిన్న భాగాలను పునరుద్ధరించాలని, అలా చేసేటప్పుడు ఆ ప్రదేశంలో ఏవైనా శిలా శాసనాలు ఉన్నాయేమో పరిశీలించి, #Tirumala #tirupati

వాటి నమూనాలు సేకరించి, ఆ ప్రాంతం పునరుద్ధరించాక ఆయా కొత్తగోడలపై ఇంతకు ముందు ఉన్న శాసనాలను యథాతథంగా చెక్కించాలని ఆలయ స్థానత్తార్ లను అదేశించాడు

అంతటి చారిత్రక స్పృహ, ముందుచూపు వల్ల కొన్ని అమూల్యమైన శాసనాలు ఇప్పటికీ తిరుమల గోడలపై భద్రపరచబడ్డాయి

ఈ చారిత్రక స్పృహ ఇప్పుడు అత్యవసరం.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling