నావికుల తిరుగుబాటులో పాల్గొన్న మన స్వాతంత్య్ర సమరయోధులు - రాజన్న
1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అఖిల భారత కాంగ్రెస్ నేతలు, స్వాతంత్ర్య సమరయోధులు ఖైదు చేయబడ్డారు. అలా కొంతకాలం స్వాతంత్ర్య పోరాటంలో స్తబ్దత నెలకొన్న సమయంలో రెండు ఘటనలు భారతదేశంలో బ్రిటీషు వారి మూలాలను
కదిలించి దేశాన్ని స్వాతంత్య్రం వైపు నడిపించాయి. ఒకటి సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ పోరాటం కాగా రెండోది 1946లో భారత నావికా దళంలో తిరుగుబాటు
రాయల్ ఇండియన్ నేవీ (RIN Matinee)తిరుగుబాటులో పాల్గొన్న వారిలో అనంతపురం జిల్లాకు చెందిన రాజన్న గారు కూడా ఉన్నారు
రాజన్న గారిది అనంతపురం జిల్లా కదిరి మండలం కాళసముద్రం గ్రామం. SSLC వరకు చదివి రాయల్ ఇండియన్ నేవీలో చేరారు.
1946 ఫిబ్రవరి 18న తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా నాటి బాంబాయి హార్బరులోని తల్వార్ ఓడకు(HMIS Tawar) చెందిన రేటింగ్స్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు.
త్వరలోనే ఈ వార్త, తిరుగుబాటు దేశంలోని ఇతర పోర్ట్లు, ఓడలకు పాకింది. తిరుగుబాటు జరిగే సమయానికి రాజన్న పోర్ట్ బ్లెయిర్ లో పనిచేస్తూ ఉన్నారు. తిరుగుబాటు సమయంలో ఓడపై యూనియన్ జాక్ జెండాను దించి భారతదేశ జెండాను (గాంధీజీ చారఖా వడుకుతున్న మూడు రంగుల జెండా)ను ఎగిరేశాడు.
తరువాత తిరుగుబాటులో పాల్గొన్న నావల్ రేటింగ్స్ ను కోర్ట్ మార్షల్ చేసి డిస్మిస్ చేశారు. తరువాత రాజన్న స్వగ్రామానికి తిరిగి వచ్చి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు.
భారత స్వాతంత్ర్య పోరాట గతిని మార్చిన నావికాదళ తిరుగుబాటులో రాయలసీమ వాసి పాల్గొనడం ఎంతో గర్వకారణం.
చిత్రం మరియు మూలం : స్వతంత్ర భారత స్వర్ణోత్సవ సావనీర్ - రాయలసీమలో స్వాతంత్ర్యోద్యమం (1998) పుస్తకంలో "మహత్తర నావికాదళ తిరుగుబాటులో 'అనంత' యోధుడు రాజన్న" పేరిట విద్వాన్ పి. దస్తగిరి గారు రాసిన వ్యాసం
#సీమరత్నాలు #Anantapur
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
