కొంచెం ఎక్కువైనా పర్వాలేదు..
------------------------
#చంద్రబాబు బీజేపి ని నాశనం చేసాడు....
#చంద్రబాబు బీజేపి ని తొక్కేసాడు...
#చంద్రబాబు బీజేపి తో ఎలా ఉన్నాడో అలాగే ఉంటాం...
సోమువీర్రాజు.
#AndhraPradesh @BJP4Andhra
అయ్యా నడమంత్రపు సిరి నరం మీద కురుపులా సలుపుతున్నట్టుంది..
టీడీపి బీజేపి బంధం ఈనాటిది కాదు...
అవసరాలకోసం స్నేహం కాదు..
వాజ్ పాయ్..అద్వానీల జమానా..నుండి పరస్పరం సహకరించుకున్న రాజకీయ పక్షాలు..
మిత్రపక్షం గా తెలుగుదేశం ఏనాడూ యన్డీయే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేదు..
మిత్రధర్మాన్ని విస్మరించి పిచ్చికూతలు కూయలేదు..
పదవుల పంపకాల్లో వాటా అడగలేదు..
వాజ్ పాయ్ మహాశయుడు ఎంత ఉన్నతంగా వ్యవహరించారో అంతే హుందాగా చంద్రబాబు వ్యవహరించారు..
ఇప్పటి ప్రధాని..అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నిర్వాకానికి..ఒక రకంగా ఆ పాపఫలాన్ని టీడీపి కూడా భరించింది..నష్టపోయింది.
తప్పు ఒప్పులు ఏమైనా అయివుండవచ్చు...
ప్రపంచం మొత్తం..వేలెత్తి చూపింది...
అప్పుడు వదిలిన చేతులు మళ్ళీ దశాబ్దం తరువాత కలిసాయి..
మీలాంటి వారు కులద్వేషం తో అసూయ తో విడిపోయే దాకా నిద్రపోలేదు.
అడుగడుగునా అడ్డుపడ్డారు..
ఒంగి దణ్ణం పెట్టిన సీనియర్ నాయకుడ్ని..సహనానికే అసహనం కలిగించే..చంద్రబాబు ని...
విసిగించారు..వేధించారు..అవమానించారు..అనుమానించారు..
దానికి తోడు...ఈర్ష్యా అసూయలతో అభివృద్ధి ని అడ్డుకోవటానికి కేంద్ర పెద్దలు ..ప్రత్యర్దులతో చేతులు కలిపారు..
పదమూడు జిల్లాల ముఖ్యమంత్రి ని..ఆయన పార్టీ ని ఓడించటానికి ...చేసిన విన్యాసాలు..తొక్కిన అడ్డదారులు..వ్యవస్దలని ఒడిసి పట్టిన తీరు..పక్క రాష్ట్రం లో ముందస్తు ఎన్నికల కు వెళ్ళిన తీరు..
ఎవరూ మరచి పోలేదు...
తొండాట ఆడి టీడీపి ని ఓడించగలిగారు..ఎలాగయితే..
మీరేమి సాధించారు!?
నోటా ని కూడా దాటలేక పోయారు..
పార్టీ బలపడాలని మీకెవ్వరికీ లేదు...
మోచేతి నీళ్ళు తాగటానికి అలవాటు పడిన వారు స్వయం ప్రకాశకులు కాలేరు...
ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో మీకు తెలియదా!?
ప్రధాని స్వయంగా శంకుస్దాపన చేసిన రాజధాని అమరావతి ని మార్చటానికి
రాష్ట్రప్రభుత్వం చేసే ప్రయత్నాలను అడ్డుకోలేని మిమ్మల్ని ఎవరు మాత్రం పాడుచేయగలరు..
మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్నంతగా ఎవరూ పాడు చెయ్యలేరు..
దేశంలో మీ గెలుపు అనుమానస్పదం..
అనుమానాన్ని తొలగించే ప్రయత్నం అసలెప్పుడూ చెయ్యలేదు..
ఒక పది జతల అరకోట్లు కుట్టించి..జనాల మీదకు వదిలారు అంతే!
మీరు కేరళ లో అయినా అధికారం దక్కించుకోగలరేమో గాని...ఆంధ్రలో నోటాను దాటి ఎప్పటికీ వెళ్ళ లేరు...
మీ తోడు ఎవరున్నా...గాని వారు అభాసు పాలవుతారు అంతే!
టీడీపి ..చంద్రబాబు అంటే ఒంటి కాలి మీద లేచే మీ సారధ్యంలో..మీ పార్టీ కొత్తగా మునిగేదేమి ఉండదు...ఆల్రడీ అగాధంలో ఉన్నది.
టీడీపి నెత్తిన పాలు పోసారు..
ఆల్రడీ వైసీపి కి చెద పట్టింది...మీ రహస్య అవగాహన తో కాండం తొలిచే పురుగు పట్టినట్టే!
ఏ మందుకీ లొంగదు...
మీ స్నేహం వల్ల ఏ వర్గాలైతే టీడీపి ని అనుమానంగా చూసాయో...
ఏ వర్గాలయితే టీడీపి ని దూరంగా పెట్టాయో...
ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నాయి..
చంద్రబాబు మిమ్మల్ని దోషిగా నిలబెట్టారు...
మీరు ఆయన్ని దోషిగా నిలబెట్టటానికి ప్తయత్నం చెయ్యండి..
వాస్తవాలు ప్రజలకు తెలుసు..
చంద్రబాబు బీజేపి ని ఆంధ్రాలో నాశనం చేసారంటున్నారు కదా..
మీరు కూడా టీడీపి ని నాశనం చెయ్యటానికి ప్రయత్నం చెయ్యండి..
టీడీపి కి దూరమైన వర్గాలకు విషయం అవగతమవుతుంది.
చంద్రబాబు బీజేపి తో ఎలాగున్నాడో అలాగే ఉంటామన్నారు...
మీరు అలా ఉండలేరు...ఎందుకంటే మీకు అంత సీను లేదు..
మీకే కాదు మీ పెద్దలకు కూడా లేదు..
ఆ విషయం మీ అధికారాంతమున అర్దం అవుతుంది..
వెక్కి వెక్కి ఏడుస్తారు..కొత్తగా కుట్టించుకున్న అరకోట్లు ..కొత్త బట్డ వాసన పోకుండానే...బేక్ టు పెవిలియన్..
మరి కొందరు నేలకేసి కొట్డిన కొత్త కుండపెంకుల్లా చెల్లా చెదురవటం చూస్తారు..!
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
