రాముడు, రామాయణం, రాయలసీమ -Part 6
రాముడు, రామాయణంతో సంబంధం ఉన్న తీర్థాలు, చిత్తూరు జిల్లా
శ్రీకాళహస్తి - వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తిని రాములవారు, సీతమ్మతల్లి దర్శించుకున్నారని ప్రతీతి. శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో రామ లింగం, సీతమ్మ లింగాలను చూడవచ్చు.
శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం, వాల్మీకిపురం / వాయల్పాడు
శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం శ్రీరామపంచాయతన క్షేత్రం (శ్రీరామ, భరత, లక్ష్మణ శత్రుఘ్నులు, సీతామాత, హనుమంతుల విగ్రహాలు ఈఆలయంలో దర్శనమిస్తాయి) . ఇక్కడ స్వామివారు వల్మీకం నుండి స్వయం ప్రకటితమయ్యారట.
అందుకే ఈక్షేత్రాన్ని వాల్మీకాపురం అంటరాని ఒకకథనం కాగా ఇక్కడ ఒకప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉండేదని, ఆ మహర్షి తపస్సుచేసిన ప్రాంతం కాబట్టి వాల్మీకపురం అయింది అనిమరోకథనం., బోయలు ఇక్కడ ఎక్కువఉండటం వల్ల బోయలపాడు అనీ అదే కాలక్రమేణా వాయలపాడు అయ్యిందని ప్రతీతి.
ఎక్కడా లేనివిధంగా ఇక్కడ శ్రీరాములవారు ధనుర్ధారియై కనిపించరు. రాములవారి చేతిలో బాణం ఉండదు. స్వామివారు ఇక్కడ తత్వోపాసన భంగిమలో కనిపిస్తారు.
“రావణాంతకుఁడు రాజశేఖరుఁడు
శ్రీ వేంకటగిరి సీతాపతి
వావిలిపాటిలో వరమూర్తి దానై
వోవరిఁ గొలువుల నున్నాఁడే చెలియా “
“హితకర శ్రీవేంకటేశ్వరాయ నమో
వితత వావిలిపాటి వీరరామాయ”
“రావయ్య వావిలిపాటి రామచంద్ర
రావాడివలపులు రామచంద్ర”
అంటూ వావిలిపాటి రామచంద్రుడిగూర్చి అన్నమయ్య అనేక కీర్తనలు రచించాడు.
తిరుమల
తిరుమల శ్రీవారి ఆనందనిలయంలో శ్రీసీతారామలక్ష్మణుల విగ్రహాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా?
స్వామివారి గర్భగృహంలో శ్రీవారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీసీతారామలక్ష్మణుల విగ్రహాలు కూడా ఉంటాయి. శ్రీవారిఆలయంలో ఈ విగ్రహాలను పెట్టే ప్రదేశాన్ని రాములవారి మేడ అంటారు. అంతేకాక తిరుమలలోని అనేక తీర్థాలు, క్షేత్రాలు రామాయణ కథతో ముడిపడి ఉన్నవి.
తనకు కొడుకును ప్రసాదించమని అంజనాదేవి తపమాచరించిన ప్రాంతం తిరుమల (అంజనాద్రి / ఆకాశగంగ - ఆకాశగంగ వద్ద అంజనాదేవి, బాలాంజనేయ స్వామి ఆలయం నేటికీ చూడవచ్చు). తను అవతరించాడానికి ముందే భక్తుని తపస్సుకు మెచ్చి ఆంజనేయ అవతారంలో ప్రత్యక్షమైన క్షేత్రం తిరుమల (జాపాలి).
శ్రీరామచంద్రులు, సీతమ్మవారు విహరించిన, స్నానమాచరించిన పుణ్య క్షేత్రం తిరుమల (రామగుండము, సీతాగుండము, జాపాలి తీర్థం) - శ్రీరాముడు రావణాసురున్ని సంహరించి సీతా మాత సమేతంగా అయోధ్య వెళుతూ ఇక్కడ స్నానామాచరించినారట.
అందుకే శ్రీరాముల వారు స్నానం చేసిన తీర్థాన్ని రామగుండం (ఆలయం ఎదురుగా) అనీ, సీతమ్మవారు స్నానమాచరించిన తీర్థాన్ని సీతాగుండం అనీ పిలుస్తారు.
To be Continued..
#Chittoor_Temples #Tirumala #Vayalpadu #Srikalahasti #TTD #Rayalaseema_Temples
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
