Telugu Tribe Profile picture

Aug 18, 2020, 6 tweets

1984 ఆగష్టు... ఎన్టీఆర్ జీవితంలో అత్యంత సంక్లిష్ట కాలం. ఒకవైపు గుండెకు శస్త్రచికిత్స. మరోవైపు తన సతీమణి బసవతారకం గారికి క్యాన్సర్ అని నిర్థారణ. మరోవైపు నాదెండ్ల భాస్కరరావు, ఇందిరా కాంగ్రెస్ లు కలిసి చేసిన కుట్ర కారణంగా ముఖ్యమంత్రిగా బర్తరఫ్ కావడం...
#AndhraPradesh #TDPTwitter

ఇవన్నీ విధి కన్నెర్ర చేసిందా అన్నట్టు నలువైపుల నుంచి ఒకేసారి వచ్చిపడ్డ సమస్యలు.

సరిగ్గా ఆ సంవత్సరం ఇదే ఆగష్టు 18 తేదీన ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయంపై... కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై తెలుగుదేశం, దాని మిత్రపక్ష పార్టీలు బంద్ కు పిలుపునిచ్చాయి. పౌరజీవనం స్థంభించింది.

కేంద్రం నుంచి అదనపు పోలీసు బలగాలు దిగాయి. ఎన్టీఆర్ కు మద్దతుగా వీధుల్లోకి వచ్చి నిరసన జరిపిన వారిపై పోలీసులు జులుం ప్రదర్శించారు.
దేశవ్యాప్తంగా 15 జాతీయ ప్రతిపక్షాలు ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచాయి.

ముఖ్యంగా శస్త్రచికిత్స చేయించుకున్న తమ అభిమాన నాయకుడిని అరెస్టు చేయడం,

బర్తరఫ్ చేయడం సహించలేకపోయారు. 'ఎన్టీఆర్ మీరు విశ్రాంతి తీసుకోండి. మేము ఉద్యమిస్తాం' అంటూ ఉద్వేగంతో ఊగిపోయారు, ఉద్యమించారు. ఫలితంగా కేంద్రం తలొగ్గి గవర్నరు రాంలాల్ చేత రాజీనామా చేయించి, శంకర్ దయాళ్ శర్మను ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియమించింది.

అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు అన్నివిధాలా అండగా నిలిచి, తన చతురతతో, వ్యూహాలతో ఎన్టీఆర్ బలాన్ని నిరూపించగలిగారు. నెల రోజుల కీలక పరిణామాల అనంతరం, జాతీయస్థాయిలో జరిగిన పోరాట తదనంతరం...

ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నరు శంకర్ దయాళ్ శర్మ ఎన్టీఆర్ ను ఆహ్వానించారు. దాంతో 1984, సెప్టెంబర్ 16న తిరిగి రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు ఎన్టీఆర్. అప్పటి చిత్రమే ఇది.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling