Telugu Tribe Profile picture

Sep 1, 2020, 9 tweets

సారీ ! చంద్రబాబు గారు!
--------------------
విభజిత రాష్ట్రం ..రెవెన్యూ లోటు...

వీటికి తోడు స్వపక్షం లోనూ..విపక్షం లోనూ..

గుది బండలు...బ్రహ్మ జెముడు ముళ్ళు...

కంచిత్తనం కంపలు...ఇంగ్లీషు తుమ్మ పొదలు..కంకర రాళ్ళు...గుంతల దారులు..
#AndhraPradesh

ఇచ్చినహామీలు..ప్రతిపక్షాలు..ప్రజాసంఘాలు..పవన్ జగన్ కేవీపి...మోదీ షాలు..రెవెన్యూ లోటు..

భూసమీకరణ...రాజధాని నిర్మాణం.... కేంద్రం మోకాలు...జగన్ ఆటంకాలు...ఆపేస్తానంటూ పవన్ తీవ్రవ్యాఖ్యలు..

నిధులకొరత..!
పరిష్కారం ...అమరావతి బాండ్స్ విడుదల..

వర్షాభావం... తాగు సాగు నీటి కొరత..అడుగంటిన భూగర్భ జలాలు...ఎండిన జలాశయాలు...

పరిష్కారం ..

పట్టిసీమ..రెయిన్ గన్ లు..గోదావరి నీళ్ళు కృష్ణాడెల్టాకి...డెల్టా వాటా సీమకు...చెరువులు..కుంటలు నీటితో నింపటం..

ఆదాయం లేదు...ఉద్యోగాలు లేవు...
కియా లాంటి దిగ్గజ కంపెనీల ను రప్పించటం..ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ప్రధమ స్దానం లో నిలిచి సాఫ్ట్ వేర్ కంపెనీలను ఆకర్షించి...నెలకొల్పటం..చేసారు.

ఋణ మాఫీ దశలవారీగా చేయటం...గ్రామాల్లో రోడ్లు..నిరుద్యోగ భృతి కొంతమందికైనా ఇవ్వగలగటం...

డ్వాక్రా..సాధికారమిత్ర ..మహిళల ఆత్మ విశ్వాసం పెంచారు..

ఇళ్ళు...పెన్షన్ లు...చంద్రన్న బీమా...కానుకలు..
నష్టాల్లో ఉన్న ఆర్టీసీ కోలుకునేలా చేసారు...

ఉద్యోగులు...హోంగార్డులు..అంగన్ వాడీలు..రైతులు..విద్యార్దులు.. అన్ని వర్గాలను సంతృప్త పరిచే కార్యక్రమాలు...

అన్నిటికన్నా....అంతకు మించి అన్నకేంటీన్ లు...

పవన్ ..జగన్..మోదీ ..షా..కమ్యూనిష్టులు..స్వయంప్రకటిత మేధావులు..విశ్రాంత ఉద్యోగ రాష్ర్ట ద్రోహులు...మూలకూర్చున్న ..ముట్లుడిగిన నేతలు..విషం కక్కే విశ్లేషకులు...ఆగర్భ శత్రువులు..పక్కలో బళ్ళెం కేసీఆర్..

పక్క రాష్ట్రం తో పోల్చుకుంటే అరాచకం లేదు...ఆదర్శం ఉంది...నిర్బంధం లేదు...స్వేచ్ఛ ఉంది...కరువుని తరిమే కార్యదక్షత ఉంది...ఇంకా సంక్షేమం ఉంది...సాధికారత ఉంది..

పోలవరం ఆధునిక దేవాలయానికి అంతులేని ఆటంకాలు...పళ్ళ బిగువున అధికమించారు.

ముళ్ళదారులు క్లియర్ చేసుకుంటూ...గుదిబండలు మోస్తూ...

మీ భవిష్యత్తు నా బాధ్యత!

అంటూ తలవంచి వినమ్రంగా అర్దించారు!

తినే కూట్లో మన్ను పడింది...
మనమే వేసుకున్నామా!?
ఎవరైనా వేసారా అన్నది ప్రశ్నార్దకమే!
అయినా తప్పు జరిగింది..

ఏడాదిన్నర లోనే శరవేగం గా వెనక్కి పరిగెడుతున్నది రాష్ట్రం..

దానికి తోడు పులి మీద పుట్రలా కరోనా వైరస్..

కులవైరస్ ఎలాగూ ఉండనే ఉన్నది..చికిత్స అత్యావశ్యం..!

సారీ ! చంద్రబాబునాయుడు గారు!

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling