EVM @the game changer
-------------------------
ఎన్నికల ప్రక్రియ సులభతరం అవ్వటం కోసం..ప్రవేశపెట్టిన యంత్రం.
అది మంత్రాలకు ..తంత్రాలకు లొంగుతుందో లేదో కాని అనుమానాలున్నాయి.
రుజువులు లేవు..అయితే హేతుబద్ద వాదనలు అనేకం ఉన్నాయి.
#AndhraPradesh
సాంకేతిక విప్లవం..ప్రపంచాన్ని కుగ్రామం చేసింది..అరచేతిలో వైకుంఠాన్నుంచింది.
అదే సమయంలో..
వ్యక్తిగత జీవితంలోకి చొరబడింది..సంభాషణలు ఆలకించింది.
బాంకుల్లో సొమ్ము ఖాళీ చేస్తున్నది..
ఏ మూలనక్కినా వెతికి పట్టుకుంటున్నది..
ఎక్కడనుండి ఎక్కడి కెళ్ళాలన్నా క్షణాలలో దారి చూపిస్తున్నది..
ఒక దృశ్యం క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తుంది...
స్పందన తెలియచేస్తుంది.
మాయాఅద్దం లో దిగంతాలు దాటి చూపిస్తుంది..మాట్లాడిస్తుంది.
మనషికి సౌకర్యంగా మారింది..మనిషి చెప్పినట్టు ఆడుతుంది.
మనషి అదుపులో ఉంటుంది..
మనిషి ని అదుపులో ఉంచుతుంది.
ఇన్ని చేసిన సాంకేతిక విప్లవం..
ఈవీయమ్ లను మాత్రం తనపని తనను చేసుకోనిస్తుందా!?
యస్ ! ఓడిన వారే ఈవీయమ్ ల గురించి ఆరోపణ చేస్తారు..
ఎందుకంటే మడతకాజా వాళ్ళే తిన్నారు కాబట్టి..
ఒక్కసారి ..వ్యయప్రయాసలకోర్చి..
బాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించండి.
త్వరలో జమిలీ ఎన్నికలు రావచ్చు అంటున్నారు కదా!
జమిలీ ఎన్నికలు దేశం అంతా బాలెట్ ద్వారా జరుగుతాయని..ఎన్నికల కమీషన్ ప్రకటించి చూడండి.
ఎన్ని గొంతులు లేస్తాయో...!
ప్రజాస్వామ్య వాదులు బెంగ తీరి మాట్లాడటం మొదలెడతారు.
నిర్మొహమాటంగా ప్రభుత్వ వైఫల్యాలు గురించి ప్రశ్నిస్తారు.
సున్నా ఓటు బేంక్ పార్టీలోకి వలసలేమేయినా ఉంటాయేమో చూడండి.
ప్రజల అభిప్రాయం..ప్రజలు ఇచ్చిన తీర్పే ప్రామాణికం అని అర్దమయితే..పాలకుల వైకిరి ఎలా ఉంటుందో చూడండి..
అవకతవకలు చేసి ఆడు మగాడ్రా బుజ్జీ అనిపించుకుంటాడో..
ప్రజల చేత ఛీ కొట్టించుకుంటాడో చూడండి.
ప్రజోపయోగ కార్యక్రమాలు చేసి బలపడతారో..సరిహద్దుల తగదాలు..భావోద్వేగాలు..ఫొటో సెషన్స్ ..సోషల్ మీడియా ట్రెండింగ్ మీద ఆధిక్యం సాధిస్తారో చూద్దాం..
ఉల్లి ధర పెరిగిందంటే..నేను ఉల్లిపాయలు తినను అంటారో..ధర తగ్గించటానికి ప్రయత్నాలు చేస్తారో..చూడొచ్చు.
పేపర్ బేలట్ ద్వారానే ఎన్నికలు జరుగుతాయంటే..మొత్తం వ్యవస్దలు సెట్ అయిపోతాయి..
అధికారం శాశ్వతం కాదని తెలుస్తుంది కదా!
ఎవరైనా రావచ్చని ఒళ్ళు దగ్గర పెట్టుకుని..కొమ్ము కాసే కార్యక్రమం వాయిదా వేసుకుంటారు.
అసలు ఇన్నెందుకు..పేపర్ బేలట్ ద్వారా ఎన్నికలని ప్రకటించండి...చాలు..
మొత్తం సెట్ అయిపోతది..
వలస కూలీలకు సోనూసూద్ సహాయం చెయ్యక్కరలేదు.
చప్పట్లు కొట్టమనరు..దీపాలు వెలిగించమనరు..
అసలు ఆ దుర్గతి పట్టనివ్వరు.
ధనమేరా అన్నిటికీ మూలం ..దానితో పాటు..ఈవీయమ్ లే అష్ట దరిద్రాలకు ..ఆగత్యాలకు కారణం..
ఎవరు నమ్మినా నమ్మక పోయినా...
ఇప్పుడు ఇది అసందర్భం అయినా..ప్రస్తుత రాజకీయం..పాలకుల విపరీతాలు..పైత్యాలకు ఆదిమూలం ఈ యంత్రాలే కదా..మూల మంత్రాలు.
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
