రాయలసీమ ~ Rayalaseema Profile picture
FB: https://t.co/zAsZHzxBuE Insta : https://t.co/g07orhy9UU YT: https://t.co/44nxdobW9n Strictly Personal Opinions

Sep 3, 2020, 6 tweets

రాయలసీమ నీటి ప్రాజెక్టులు-వాటి పేర్లు -మూడవ భాగం

శ్రీ బిజివేముల వీరారెడ్డి

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి అనేక మార్లు MLAగా చేశారు. రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు. తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన కడప జిల్లాలోని బ్రహ్మం సాగర్ ఎడమ కాలువకు (Brahmam Sagar Left Canal)

వీరి పేరు మీద “Sri B. Veera Reddy Canal” అని నామకరణం చేశారు. (GO MS-32 Dt 26-04-2017)

శ్రీ పరిటాల రవీంద్ర

అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గానికి అనేక మార్లు MLAగా చేశారు. రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు.

#సీమజలాలు

అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్ నుండి ఎగువపెన్నార్ (అప్పర్ పెన్నార్) ప్రాజెక్టుకు నీటిని లిఫ్ట్ చేసే పథకానికి వీరి పేరు మీద “PARITALA RAVINDRA IRRIGATION SCHEME” అని నామకరణం చేశారు. (GO MS-2 Dt 04-01-2019)

శ్రీ బుడ్డా వెంగళరెడ్డి

రేనాటి చంద్రుడిగా, కలియుగ దాన కర్ణుడిగా వినుతికెక్కిన వారు. కర్నూలు జిల్లాలోని వెలుగోడు రిజర్వాయర్ నుండి సిద్దాపురం చెరువుకు నీటిని ఎత్తిపోసే పథకానికి “Sri Budda Vengala Reddy Siddapuram Lift Irrigation Scheme” అని నామకరణం చేశారు.(GO MS-17 Dt 12-03-2018)

శ్రీ కే ఈ మాదన్న

కర్నూలు జిల్లాకు చెందిన సామాజికవేత్త, ప్రజాప్రతినిథి. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన KE కృష్ణమూర్తి గారి తండ్రి. హంద్రీ - నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన క్రిష్ణగిరి జలాశయానికి “K.E. MADANNA JALASAYAMU” అని పేరు పెట్టారు. (GO MS-68 Dt 30-10-2017)

శ్రీ మద్దూరు సుబ్బారెడ్డి

కర్నూలు జిల్లా రాజకీయ నాయకులు. MLAగా MPగా వివిధ హోదాల్లో పనిచేశారు. హంద్రీ నీవా సుజల స్రవంతి పథకానికి ఎంతో ముఖ్యమైన మాల్యాల ఎత్తిపోతలకి వీరి పేరు మీద Maddur Subba Reddy Malyala Lift Irrigation Scheme” అని నామకరణం చేశారు. (GO MS-24 Dt 14-02-2013)

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling