మహాలయ పితృపక్షం సందర్భంగా - 'అంటు' - సీమ సంప్రదాయం
అమ్మ ఫోన్ చేస్తుంది. అంటు ఉంది, ఇంట్లో దీపం పెట్టకు, గుడికి వెళ్లకు, తీపు తినకు, తలస్నానం చేయకు అని.
ఎవరు చనిపోయారు అని అడుగుతాను నేను.
మా దాయాదుల పేరు చెపుతుంది. నేనెప్పుడూ ఆ మనిషిని చూసి ఉండను కనీసం పేరు కూడా విని ఉండను.
కానీ తన పెద్ద కర్మ అయిపోయినంత వరకు శ్రద్ధగా 'అంటు' పాటిస్తాం. అది వారికి మనం ఇచ్చే గౌరవం.
“When there's no one left in the living world who remembers you, you disappear from this world. We call it the Final Death” - Quote from ‘COCO’ Movie
#సీమసంప్రదాయాలు
ఎవరన్నా చనిపోతే పెద్ద కర్మ /దినం /దివసం అయిపోయేంతవరకు వారి సొంత కుటుంబ సభ్యులే కాక, వారి దాయాదులు సైతం ‘అంటు’ పాటించే సంప్రదాయం ఉంది. దాయాదులు అంటే స్వగోత్రీకులు / Kinsmen. ఒకే గోత్రం, ఒకే ఇంటిపేరు కలవారు. సాధారణంగా ఒకే గ్రామానికి చెందినవారు అయి ఉంటారు. ‘అంటు’ అంటే సూతకం / మైల
పూర్వం దాయాదులంతా పక్క పక్క ఇండ్లలోనే ఉండేవారు. అటువంటి సమయంలో ఎవరి కుటుంబంలోని వ్యక్తి చనిపోయినా అందరూ ‘అంటు’ పాటిస్తారు. తరువాత కాలంలో కుటుంబలో
జీవితంలో కనీసం ఒక్కసారి కూడా చూడని వారికోసం, కలవనివారికోసం కూడా అంటు బాపుకుంటారు.
అంటు సమయంలో
ఇంట్లో ధూప / దీప / నైవేద్యాలు / దేవతార్చన నిషేధం
శుభకార్యాలు / కొత్త కార్యాలు తలపెట్టడం నిషేధం
ఈమోరు వాళ్ళు మనింటికి రావడం , వాళ్ళింటికి మనం వెళ్లడం నిషేధం
బెల్లం , నువ్వులు, తీపి పదార్థాలు, మాంసాహారం భుజించడం నిషేధం
పూజా గదిలోకి వెళ్లడం నిషేధం
ఆలయ ప్రవేశం నిషేధం
తలస్నానం చేయం, కొత్త బట్టలు లేదా కొత్త వస్తువులు వాడటం నిషేధం
బట్టలు ఉతకడం , ఇల్లు అలకడం నిషేధం
పెద్ద కర్మ అయిపోయాక, ఇళ్లు అలుక్కుని, పటాలు శుభ్రం చేసి, తల స్నానం చేసి, పూజ చేసుకుని, ఇంత బెల్లం, కొన్ని నువ్వులు తిని 'అంటు' పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరి జీవితం వారిది
సమాజంలో మార్పులతో ఈ సంప్రదాయం కూడా కనుమారుగవుతోంది. దగ్గరివారు తప్ప దాయదులు చనిపోతే ఇప్పుడు ఎవరో కానీ 'అంటు' పాటించట్లేదు. పాటించినా నియమాలు అన్నీ పాటించడం లేదు. తల్లిదండ్రులను పట్టించుకోవడానికే సమయంలేని జనాలకు పెద్దలను తలుచుకోవడానికి తీరిక ఎక్కడిది? ‘అంటు’పాటించే ఓపిక ఎక్కడిది
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
