ఈ కథ
*నెవ్వర్ బిఫోర్ - ఎవ్వర్ ఆఫ్టర్*
👉🏻👉🏻 అనేక మలుపులతో కూడిన
*ఓ భార్యాభర్తల కథ..*
👉🏻*మీరు చదవండి - మీ స్నేహితులచే చదివించండి*
👉🏻 ఒక మహిళ షాపింగ్‌కు వెళ్ళింది. అంతా పూర్తయ్యాక క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి, బిల్లు చెల్లించడానికి తన హేండ్ బ్యాగ్ తెరిచింది.
క్యాషియర్ ఆమె బ్యాగు లో
*ఒక టీవీ రిమోట్* గమనించాడు.
అతను ఉండబట్టలేక ఆడిగేసాడు..
"మీరు ఏప్పుడూ మీ టీవీ రిమోట్‌ను మీతో తీసుకువెళతారా?" అని.
ఆమె "లేదండీ, ఎప్పుడూ ఇలా తీసుకురాను, అప్పుడప్పుడు మాత్రమే..ఈరోజు మావారు క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పి నాతో పాటు షాపింగ్ కి రాలేదు అందుకే నేను రిమోట్ తీసుకుని వచ్చేసా."
అంటూ *తన క్రెడిట్ కార్డ్* ఇచ్చింది.
👉🏻 *నీతి: మీ భార్య మాట వినండి, ఆమెకు అవసరమైన పనుల్లో సహకారం అందించండి.....*
👉🏻*కథ ఇంతటితో అయిపోలేదు..*
క్యాషియర్ నవ్వుతూ ఆమె కొన్న వస్తువులన్నీ తిరిగి తీసుకున్నాడు.
ఊహించని ఈ సంఘటన చూసి ఆమె నిర్ఘాంతపోయింది..
*"ఏమైంది..!!??"
అని క్యాషియర్ని అడిగింది.*
అతను చెప్పాడు, *“మీ భర్త మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేసారు...”*
👉🏻👉🏻 *నీతి: మీ భర్త అభిరుచులను ఎల్లప్పుడూ గౌరవించండి.*
*కథ కొనసాగుతుంది...*
భార్య ఈసారికి *తన భర్త క్రెడిట్ కార్డును* పర్స్ నుండి తీసి స్వైప్ చేసింది. దురదృష్టవశాత్తు *అతను తన సొంత
కార్డును బ్లాక్ చేయలేదు.*
👉🏻 *నీతి: మీ భార్య యొక్క శక్తిని మరియు జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయవద్దు..*
*కథ ఇంకా అయిపోలేదు...*
స్వైప్ చేసిన తర్వాత, ఆ యంత్రం,
"మీ మొబైల్ ఫోన్‌కు పంపిన పిన్ను నమోదు చేయండి" అని సూచించింది...
👉🏻*నీతి: ఒక్కోసారి మనిషి ఓడిపోయినప్పుడు, సాంకేతికత కూడా
రక్షిస్తుంది..!*
👉🏻 *కథ కొనసాగుతుంది...*
ఆమె మరలా నవ్వి, తన పర్సులో మెసేజ్ శబ్దంతో మోగిన మొబైల్ ను బయటకు తీసింది.
*అది తన భర్త ఫోన్.*
ఆమె దానిని రిమోట్ కంట్రోల్‌తో బాటుగా తీసుకుని వచ్చేసింది..
ఎందుకంటే, తన షాపింగ్ సమయంలో భర్త తనకు కాల్స్ చేసి విసిగించకుండా ఉండేందుకు. చివరకు
ఆమె తన షాపింగ్ పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది.
👉🏻👉🏻 *నీతి: ఎప్పుడూ మీ భార్యని తక్కువ అంచనా వేయవద్దు!!*
*కథ కొనసాగుతుంది....*
ఆమె ఇంటికి చేరుకునేసరికి ఇంటి బయట ఆమెకు *తన భర్త కారు* కనిపించ లేదు.
ఒక నోట్ *తలుపు మీద* అతికించబడి ఉంది.
అందులో ఇలా రాసి ఉంది..
*"రిమోట్ దొరకలేదు.. మ్యాచ్ చూడటానికి ఫ్రెండ్స్ తోబాటు బయటకు వెళ్తున్నాను... నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది.... నీకు ఏదైనా అవసరమైతే నా ఫోన్ కు కాంటాక్ట్ చెయ్యు....."*
👉🏻👉🏻 *ఇంటి తాళాలు కూడా తనతోబాటే తీసుకుపోయాడు.*
😀😃😄
👉🏻👉🏻 *నీతి: మీ భర్తను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు.*
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
