Varaprasad Daitha Profile picture
Retired.
Siddharth Misra Profile picture BS.Rudra Profile picture Anno Alex Profile picture Venkata Ganesh Profile picture 6 subscribed
Jul 12, 2023 6 tweets 1 min read
రోజుకు 12 గంటలు చదివాక కూడా కొడుకు చరిత్ర పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు.

నా కొడుకు ఎందుకు తప్పాడా అని తండ్రికి అనుమానం వచ్చింది.

స్కూల్ కి వెళ్లి కొడుకు రాసిన ఆన్సర్ షీట్ చెక్ చేసాడు.

ప్రశ్న : భారత దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది ?
కొడుకు సమాధానం : 2014 ప్రశ్న : పాల విప్లవం ఎప్పుడు మొదలైంది ?
కొడుకు సమాధానం : 2014

ప్రశ్న : హరిత విప్లవం ఎప్పుడు మొదలైంది ?
కొడుకు సమాధానం : 2014

ప్రశ్న : దేశంలో పౌర విమానయాన సేవలు ఎప్పుడు మొదలయ్యాయి ?
కొడుకు సమాధానం : 2014

ప్రశ్న : దేశంలో రైలు సేవలు ఎప్పుడు మొదలయ్యాయి ?
కొడుకు సమాధానం : 2014
Jun 19, 2023 22 tweets 3 min read
అత్తయ్య గారూ ! ఎలా వున్నారూ"? ఆషాడమాసంలో పుట్టింటికి వెళ్లిన కొత్త కోడలు మంజూష అత్తగారికి ఫోన్ చేసి కుశలమడిగింది.

"నేను బావున్నానమ్మా! నువ్వెలా వున్నావు?"

"నేనూ బాగున్నానండీ! అత్తయ్య గారూ! మా అమ్మ నేనూ చీరలు కొనడానికి షాపింగ్ మాల్ కి వెళుతున్నామండీ! ఆషాడమాసం కదా చీరలకి డిస్కౌంట్ పెట్టారు. మీకు కూడా చీర కొందామను కుంటున్నాను. మీకు ఎలాంటి చీర కొనమంటారు ?"

"అలాగా! మంచిదమ్మా! నాకు షాపింగ్ కు వెళ్లే శ్రమ తగ్గించావు.  నువ్వు అడిగావు కాబట్టి చెపుతున్నాను. చీర మీద నా అభిప్రాయాలు నా ఇష్టాఇష్టాలు చెపుతాను. దాన్ని బట్టి ఒక చీర సెలెక్ట్ చేయమ్మా.
Jun 19, 2023 13 tweets 2 min read
*'మానవులు' గా బతకటం కాదు.. # 'మానవత్వం' తో బతకాలి!*

@ _*'ఐకమత్యం' - అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే... తేనెతుట్ట మీద రాయి విసిరితే మనమే పారిపోవాలి !*_

# _*ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు !*_ @ _దేవుడికోసం తీర్ధాలు, పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడోలేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె' లోనేవున్నాడు._

@ _సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు._

@ _కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు.
Jun 19, 2023 9 tweets 2 min read
*మౌనం : Silence*

_వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది._

_అయిదు విధాల ‘శాంతి’ లలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు._ _‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత.   *‘మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’* అన్నారు స్వామి వివేకానంద._

_మౌనం మూడు రకాలు._
1. _*ఒకటవది: వాక్‌మౌనం.* వాక్కును నిరోధించడమే వాక్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు.
Jun 11, 2023 6 tweets 1 min read
*_ఇది సోమరిపోతుల_* *_కర్మాగారం!_*

_______________________

పని చేయని వాడు
సోమరిపోతనేది పాతమాట..
ఇప్పుడు వాడే
సర్కారు ముద్దుబిడ్డ..
వాడికి తెల్ల కార్డిచ్చి
దానికి జతగా
బోలెడు స్కీములిచ్చి
ఆపై పించనిచ్చి
సోమరిపోతును
సొమ్మరిపోతుగా
తీర్చిదిద్దుతోంది ప్రభుత్వం..
ఓటుమారి స్కీములు దండగమారి స్కాములు..
వారు వీరు అంతా
స్వాహాస్వాములు..!

నిజానికి మన వ్యవస్థలే
సోమరిపోతుల
కర్మాగారాలు..
ఎవరికి ఎప్పుడు
ఏమిస్తాయో తెలియదు..
కులవృత్తులను
సబ్సిడీలకు
అనుకూలవృత్తులుగా మార్చి
పంచేస్తున్నాయి సొమ్ములు..
పెంచేస్తున్నాయి అప్పులు..
ప్రతి కులానికి
ఓ కార్పొరేషన్..
Jun 11, 2023 15 tweets 2 min read
*శంకర నారాయణ డిక్షనరి* కథ

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.
ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి....
వాడి భాష మనకి రాదు...
వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు.
మనకి అది "గాడిద గుడ్డు" గా అర్థమైంది.
మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది.
మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు.
వ్యాపారం, పరిపాలన వాళ్ళ అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు.
Jun 11, 2023 13 tweets 2 min read
*తప్పులెన్నువారు…*
(దివ్య దర్పణం)
ఒకానొకప్పుడు గురుకులంలో,   ఒక ఆచార్యుడు తన శిష్యుని సేవకు చాలా ముగ్ధుడయ్యాడు. విద్యాభ్యాసం పూర్తి చేసి, ఆ శిష్యుడు వెళ్లిపోయేటప్పుడు, గురువు అతనిని ఆశీర్వదించి, ఒక దర్పణం బహుమతిగా ఇచ్చాడు.

అది మామూలు దర్పణం (అద్దం) కాదు. వ్యక్తి యొక్క అంతరంగిక భావాలను ప్రతిబింబించగలిగే దివ్య దర్పణం.

గురువుగారి నుండి ఈ బహుమతిని స్వీకరిస్తూ, శిష్యుడు చాలా సంతోషించాడు. వెళ్లేముందు ఆ దర్పణ సామర్థ్యాన్ని చూడాలి అని అనుకున్నాడు.

ఆ దర్పణాన్ని పరీక్షించాలనే తొందరలో ముందుగా దాన్ని తన గురువుగారి వైపు తిప్పాడు.
Jun 11, 2023 9 tweets 2 min read
మన ఈ జన్మలో కర్మ ఎలా పనిచేస్తుందో ప్రతి ఒక్కరూ చదవాల్సిన జీవిత సత్యం.
1891లో ఓ వర్షం రాత్రి ఒంటిగంటకి అమెరికాలో ఫిలడెల్ఫియలోని బ్రాడ్ స్ట్రీట్లో ఉన్న డిలియన్ హోటల్లోకి విలియం, తన భార్యతో వెళ్ళి ఓ గది కావాలని అడిగాడు.
"సారీ! మా హోటల్లోని ఇరవై నాలుగు గదులు ఫిలప్ అయిపోయాయి. మీరు ముందే రిజర్వేషన్ చేసుకోవాల్సింది." జవాబు చెప్పాడు హోటల్ మేనేజర్ జార్జ్ సి బోల్ట్.
ఆ దంపతులు ఇద్దరూ కాసేపు తమలో తాము ఏం చెయ్యాలని చర్చించుకుని తలుపు వైపు వెళ్తుంటే జార్జ్ వాళ్ళతో చెప్పాడు.

"వర్షంలో ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తారు? మీరు నా గదిలో ఈ రాత్రికి
Jun 11, 2023 11 tweets 2 min read
పరమాత్ముడి ప్రణాళిక తెలుసుకోవడం ఎవరితరం?

వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుగొచ్చింది.
దేవుడితో మొరపెట్టుకున్నాడు.
"రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు.
నా బతుకు చూడు. ..ఎంత కష్టమో.
ఒక్క రోజు... ఒక్కటంటే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా,"అని సవాలు విసిరాడు.

దేవుడు వినీ వినీ సరేనన్నాడు.
"అయితే ఒక్క షరతు. నువ్వు ఎవరేమన్నా నువ్వు         మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు.
నోరు మెదపకూడదు."  అన్నాడు దేవుడు.
"సరే" అన్నాడు మనోడు.

తెల్లారికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు.
కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు.
Jun 11, 2023 5 tweets 1 min read
వానల పలురకాలు:
1. గాంధారివాన = కంటికి ఎదురుగా ఉన్నది  కనిపించనంత జోరుగా కురిసే వాన
2. మాపుసారివాన = సాయంత్రం కురిసే వాన
3. మీసరవాన = మృగశిరకార్తెలో కురిసే వాన
4. దుబ్బురువాన = తుప్పర/తుంపర వాన
5. సానిపివాన = అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వాన 6. సూరునీల్లవాన = ఇంటి చూరు నుండి ధార పడేంత వాన
7. బట్టదడుపువాన = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన
8. తెప్పెవాన = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన
8. సాలువాన = ఒక నాగలిసాలుకు సరిపడా వాన
10. ఇరువాలువాన = రెండుసాల్లకు & విత్తనాలకు సరిపడా వాన
11. మడికట్టువాన = బురదపొలం దున్నేటంత వాన
Jun 9, 2023 22 tweets 3 min read
తెలుగు తోటలో పండిన విక్రమకేళి - #వైకుంఠపాళి

గుర్తు ఉందా చిన్నప్పటి ఈ నేస్తం.. వైకుంఠపాళి... అదేనండీ మన పాములపటం.... పరమపదసోపాన పఠము..

జీవితంలో ఎత్తు పల్లాలు సహజం అనీ, గెలుపు  ఓటమి శాశ్వతం కావు అనీ, లోకమంతా మంచి చెడు  సమానంగా వ్యాప్తి చెంది ఉందని, పరమపదం అనగా వైకుంఠం, మోక్షం చేరుకునే మార్గం మన భారతీయ పూర్వీకులు అందరికీ చేరువుగా సులువైన రీతిలో సుమారు 2వ  శతాబ్దంలో ఇలా సరదాగా ఆట రూపంలో పొందుపరిచారంటే వాళ్ళ జ్ఞానదృష్టికి, సృజనాత్మకతకి నేటి తరం సరితూగగలదా అనిపిస్తుంది. ఆ మహానుభావులందరికీ 📷📷📷
Jun 8, 2023 10 tweets 2 min read
తెలివి_ఎవరు సొత్తు.......!!?

'చదువుకొన్నవాడు' మాత్రమే మేధావా.....!!?    'చదువుకొననివాడు' మేధావి కాదా.........!!?

దీనికి మీకు ఒక మంచి ఉదాహరణను అందిస్తాను, చదవండి.
ఒక వ్యక్తి మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, కృషి, పట్టుదలతో కష్టపడి బాగా డబ్బు సంపాదించి, జీవితంలో బాగా సెటిల్ అయ్యాడు. అతను ఒకసారి అర్జెంటు పని బడి సమయానికి డ్రైవర్ లేకపోవడం వల్ల తానే స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఉన్నట్టుండి ఒక టైర్ పంచర్ అయ్యింది. టైర్ మార్చడానికి డ్రైవర్ లేడు. అటు పక్కగా ఎక్కడా ఎవరి రాకపోకలు లేవు. ఇక తప్పని పరిస్థితిలో తానే ఎలాగోలా స్టెప్ని
Jun 7, 2023 15 tweets 3 min read
మన అందరిలో ఎప్పుడో ఒకప్పుడు
దేవుడు ఎలా ఉంటాడు అనే సందేహం కలుగుతుంది.
అలాగే ఒక పిల్లాడికి అదే సందేహం కలిగింది
అమ్మ ఎప్పుడు దేవుడిని తలుస్తుంది
దేవుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు .
అనుకున్నదే తడవుగా బుధ్ధుడిలా ఇంటినుండి బయలుదేరాడు .
అయితే ఇంటినుండి బయలుదేరినపుడు ఒక బ్యాగ్ లో రెండు జతల బట్టలు
కొన్ని కేకులూ  పెట్టుకుని బయలుదేరాడు.
నడిచి నడిచి అలసిపోవడంతో విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు...
దగ్గరలో కనబడిన ఒక పార్కులోకి వెళ్ళాడు .
అక్కడ చక్కని చెట్లు పక్కన ఒక బెంచ్ మీద కూర్చున్నాడు.
ఆ తర్వాత ఆకలి అనిపించింది .
ఒక కేక్ ప్యాకెట్ విప్పాడు .
May 9, 2023 9 tweets 2 min read
*వాల్తేరు*. (విశాఖపట్నం)
..ఆ పేరు ఎలా వచ్చింది ? వైజాగ్ లో కొన్ని ప్రాంతాలకు ఆ పేరుతో ఉన్న సంబంధం ఏమిటి ?
విశాఖకు జీవ జలాలు ఇచ్చిన వాల్తేరు..అదే

వాల్తేరు ఓ ఝరి.. ఓ జీవన ప్రవాహం. లక్షల మందికి తాగేందుకు నీరు..బతికేందుకు ఆసరా ఇచ్చిన సెలయేరు..తప్పితే ఒక వ్యక్తి పేరు కాదు. తూర్పు కనుమల్లో పుట్టిన నీటి గెడ్డలు..ఒకప్పుడు రెండు పెద్ద ఏటి ప్రవాహాలుగా విశాఖ మీదుగా ప్రవహించేవి. ఒకటి *హనుమంత వాగు*. ఇది సింహాచలం కొండల్లో పుట్టిన గెడ్డల నుంచి ముడసర్లోవ మీదుగా 15 కి.మీ.ల దూరం ప్రవహించి లాసన్స్ బే వద్ద సముద్రంలో కలిసేది. 1902లో ముడసర్లోవ పార్కు/రిజర్వాయరు
May 7, 2023 6 tweets 1 min read
తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు నెలలు అకాల వర్షాలతో వరి పంట దెబ్బ తిన్నట్టు మనం చూస్తున్నాము.

తడిసిన ధాన్యం తేమ కారణంగా మార్కెట్ లో దళారులు తమ విశ్వ రూపం చూస్తోయించి వ్యాపారులతో కుమ్మక్కై రైతులను దెబ్బ తీస్తున్నారు. 

ఈ సందర్భంగా మన సంప్రదాయ పద్ధతులు ఆచరిస్తే బాగుంటుందని నా భావన. అవేంటో చూడండి.

సుమారు 40 సంవత్సరాల పూర్వం వారి కోతలు ఐపోయాక పంటను కుప్పలు వేసి 2 - 3 నెలల తర్వాత నూర్పిడి చేసేవారు.

దీని వలన పంట పక్వము ఐయ్యేది.

నూర్పిడులయినాక పంటను పురి లలో గాదెలలో మరొక 3 నెలలువుంచేవారు.

పురి అంటే వారి గడ్డి తోనే తాడు పేని, కిందుగా ఒత్తుగా వరిగడ్డి
May 4, 2023 11 tweets 2 min read
*మనో వైకల్యం*

ఒక రాజ్యం లో ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక కాలు, ఒక కన్ను మాత్రమే వున్నాయి. కానీ ఆ రాజు చాలా తెలివైనవాడు మరియు ధైర్య వంతుడు కాబట్టి ఆ రాజ్యంలోని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఒకసారి రాజుకు తన  బొమ్మను గీయించాలని  ఎందుకో  ఆలోచన వచ్చింది. అప్పుడా రాజు దేశ విదేశాల నుండి చిత్రకారులను పిలిపించాడు. ఒకరికి మించిన ఒకరు చిత్ర కారులు రాజసభ ముందు హాజరు అయ్యారు. రాజు అందరికి నమస్కరించి వారందరికి తన అందమైన  బొమ్మను గీయాలని కోరాడు దానిని రాజదర్బార్ లో  ఏర్పాటు చేయాలనుకున్నట్లు చెప్పాడు.
చిత్రకారులందరూ  ఆలోచించడం మొదలు పెట్టారు,
May 4, 2023 5 tweets 1 min read
*అదే మరి మన భాష ప్రత్యేకత!*

*నెలవంక* ఉంటుంది గానీ...
*"వారంవంక"* ఉండదు అదేంటో!!!

*"పాలపుంత"* ఉంటుంది గానీ...
*"పెరుగుపుంత"* ఉండదు.

*"పలక'రింపు"* ఉంటుంది గానీ...
*"పుస్తకంరింపు"* ఉండదెందుకు?

*"పిల్ల"కాలవ"* ఉంటుంది గానీ...
*"పిల్లోడి కాలవ"* ఉండదు...ఎందువల్లనో? *"పామా"యిల్"* ఉంటుంది గానీ...
*"తేలు ఆయిలు"* ఉండదండి.
*"కారు మబ్బులు"* ఉంటాయి గానీ...

*"బస్సు మబ్బులు"* ఉండవేమిటో!
*"ట్యూబ్ లైటు"* ఉంది గానీ...

*"టైర్ లైటు"* ఉండదు.
*"ట్రాఫిక్ జామ్"* ఉంటాది గానీ...

*"ట్రాఫిక్ బ్రెడ్"* ఉండదు.
"వడ"దెబ్బ"* ఉంటుంది గానీ..
*"ఇడ్లీ దెబ్బ"* ఉండదండి.
May 3, 2023 15 tweets 2 min read
భారత్ గురించి 35 'మైండ్ బ్లోయింగ్' నిజాలివి.
వీటిని చదువుతుంటేనే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఆ నిజాలు మీకోసం

Note that these were achieved by all citizen of India and not only by the so called rulers!

1. ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం భారత్. తొలి దేశం అమెరికా. 2. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతి పెద్దది. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది.

3. ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే.

4. ప్రపంచంలో అత్యధిక శాఖాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40 శాతం భారతీయులు మాంసాహారం ముట్టరు.
May 3, 2023 17 tweets 3 min read
కాసేపు నవ్వుకుందాం .
నేనే నర్రోయ్ పిల్లలూ - మీ అభిమాన సూర్య కాంతం అత్తయ్యని. నాకు స్వర్గం నుండి వచ్చేయాలని ఉందర్రా  . వెధవది అందరూ స్వర్గం స్వర్గం అని బోల్డు పుణ్యం చేసుకుని ఇక్కడకు వస్తారు గానీ అయినా ఇక్కడేముందర్రా. తాగడానికి తినడానికి అమృతం తప్ప ఓ బందరు లడ్డునా, తిరుపతి వెంకన్న ప్రసాదమా , తాపేశ్వరం లడ్డునా , కాకినాడ కాజా నా .. కాసింత జున్ను  తిందాం అన్నా గతి లేదాయే  . అసలే నాకు  మరమరాలు, చేగోడీలు , పులిహోర, పకోడీలు అంతే అమిత ఇష్టం అనుకో .. వాటిని తినకుండా ఏనాడైనా ఉన్నానా ? నలుగురికి ఇంత పెట్టి మనం ఇంత తింటే ఉన్న హాయి ఇక్కడెలా వస్తుందర్రా
May 3, 2023 7 tweets 1 min read
ఊరగాయోపనిషత్:
జంబూ ద్వీపే
భారత వర్షే
ఆంధ్ర ప్రదేశే
ఉభయ గోదావరీ తీరే
అథహః
ఊరగాయ వ్రత సంకల్ప ఇతిహి.
ఓం శాంతి శాంతి హీ
నైమిశారణ్యంలో
శుక శౌనకాది మహర్షులు కూర్చొని ప్రాణాయామం చేస్తున్నపుడు
మిగిలిన ఋషులు
స్వామీ ఆశ్రమాల్లో
చప్పిడి కూడు తినీ తినీ నాలిక చచ్చుబడి యోగ సాధన చేస్తున్నపుడు కుండలినీ శక్తి జాగృతం కావడం లేదు. కిం కర్తవ్యం అన్నారు.
అపుడు శుక మహర్షి నాయనలారా నారదుడు వ్యాసునికి చెప్తే వ్యాస మహర్షి నాకు బోధించారు , చెప్తా వినండి:
ఒకా నొక యుగం లో ఆంధ్రస్య మహర్షి ( అగస్త్య మహర్షికి దగ్గర చుట్టం లెండి) సతీ సమేతంగా నైమిశారణ్యంకి వచ్చాడు .
Apr 4, 2023 9 tweets 2 min read
భానుమతి గారి “అత్తగారు - ఆవకాయ”!
ఆవకాయ పెట్టటంకన్న యజ్ఞం చేయటం తేలిక,
యజ్ఞం చేస్తే ఫలం అన్నా దక్కుతుంది,
మరి కొంతమంది ఆవకాయ పెడితేనో ఫలితం కూడా దక్కదు.
అసలు ఆవకాయ పెట్టటం అన్నదే ఓ పెద్ద ప్రహసనం.
అందునా నూజివీడు చిన్నరసాలకు అలవాటుపడ్డ ప్రాణానికి వేరేకాయతో ముద్దదిగదు. విషయానికి వస్తే “ఆధునిక తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా
నిలిచిపోయే పాత్రలు చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నాయి.
ఆ చిరంజీవుల జాబితాలో చేరుతుంది భానుమతి ‘అత్తగారు’,”
అన్నారు శ్రీ కొడవటిగంటి వారు. బహుముఖ ప్రజ్ఞాశాలి
అయిన భానుమతీ రామకృష్ణగారి “అత్తగారు – ఆవకాయ”