రాయలసీమ ~ Rayalaseema Profile picture
FB: https://t.co/zAsZHzxBuE Insta : https://t.co/g07orhy9UU YT: https://t.co/44nxdobW9n Strictly Personal Opinions

Sep 18, 2020, 9 tweets

రాముడు, రామాయణం, రాయలసీమ -Part 7

రాముడు, రామాయణంతో సంబంధం ఉన్న తీర్థాలు, చిత్తూరు జిల్లా

శ్రీకోదండరామ స్వామి ఆలయం - తిరుపతి, చిత్తూరు జిల్లా

త్రేతాయుగంలో రామలక్ష్మణులతోపాటు ఈప్రాంతంలో జాంబవంతుడు, హనుమంతుడు మొదలగువారు ఇక్కడ సంచరించారని, ఇక్కడి శ్రీసీతారామలక్ష్మణుల విగ్రహాలు

జాంబవత ప్రతిష్టితమని ఐతిహ్యం. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ రామలక్ష్మణులు తెల్లని ఊర్ధ్వపుండ్రాలు ధరించి తిరుమల శ్రీవారి విగ్రహాన్ని గుర్తుకుతెచ్చేలా ఉంటారు.

శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం , అరగొండ

రామ-రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోగా

వారిని రక్షించేందుకు సంజీవని మొక్క కోసం హనుమంతుడు పర్వతం తెచ్చే సమయంలో దివ్యమూలికలతో కూడిన ఒక భాగం ఇక్కడ పడిందని అదే అరకొండ క్షేత్రమని ఆలయ చరిత్ర. ఈ క్షేత్రంలో వనమూలికా ప్రభావంతో వెలసిన శ్రీ సంజీవరాయ పుష్కరిణి తీర్థాన్ని సేవిస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయాని భక్తుల విశ్వాసం.

వాలీశ్వర ఆలయం - రామగిరి

ఒకప్పుడు ఈ ప్రాంతంలో కాలింగ మడుగు అని పెద్ద సరస్సు ఉండేదట. రావణ సంహారానంతరం బ్రహ్మహత్యా దోషం తొలగించుకునేందుకు శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట చేయ సంకల్పించి హనుమంతుడిని శివలింగం తెమ్మని చెప్పాడట. హనుమంతుడు వారణాసి నుండి శివలింగం తెస్తూ ఉండగా

కాలభైరవుడు ఎలా అయినా ఆ శివలింగాన్ని అక్కడే ప్రతిష్టింపజేయాలని, ఎండలు ఎక్కువగా ఉండాలని సూర్యుడిని, కాశీ నుండి ఇక్కడి వరకు మధ్యలో ఎక్కడా నీరు దొరకకుండా గంగమ్మ ను, గాలి విపరీతంగా వీయాలని వాయుదేవున్ని, ప్రార్థించాడట. శివలింగంతో కాశీ నుండి బయలుదేరిన హనుమంతుడు ఎండ, గాలి వల్ల అలసిపోయి

నీరు ఎక్కడా దొరకక ఇక్కడ ఆగి మంచినీటి గురించి వెతుకుతుంటే కాలభైరవుడు పశువులకాపరి వేషంలో ఎదురొచ్చాడట. హనుమంతుడు నీటి గురించి అడగగా, కాలభైరవుడు గంగమ్మని వేడుకుని అక్కడి నీటిమడుగును హనుమంతుడికి చూపించాడట. నీరు తాగడానికని హనుమంతుడు లింగాన్ని పశువులకాపరి వేషంలో ఉన్న కాలభైరవుడికి ఇవ్వగా

స్వామి ఆ లింగాన్ని కింద పెట్టడంతో హనుమంతుడు ఎంత ప్రయత్నించినా మళ్లీ ఆ లింగం రాలేదట. హనుమంతుడు కోపంతో ఒక కొండను ఆ సరస్సుపై వేసి ఆ ప్రాంతం అడవైపోతుందని శపించాడట. రాముడికోసం తెచ్చిన శివలింగం, ఆంజనేయ స్వామి విడిచిన కొండ (గిరి) ఉండటం వల్ల ఈ ప్రాంతం రామగిరి అయ్యిందని ఐతిహ్యం.

హనుమంతుడు తన వాలంతో (తోక) లింగాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు కాబట్టి ఈ లింగానికి వాలీశ్వర లింగం అని పేరు.

సశేషం

#Rayalaseema_Temples #Ravishing_Rayalaseema #Chittoor_Temples #Tirupati

Image : By Raji.srinivas at en.wikipedia, CC BY-SA 3.0, commons.wikimedia.org/w/index.php?cu…

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling