Varaprasad Daitha Profile picture
Retired.

Sep 20, 2020, 5 tweets

ధర్మసూక్ష్మము(చిరుకధ )

సుశీలమ్మ, యాదమ్మ గుడినుంచి ఇంటికి
షేర్ ఆటోలో బయలు దేరాడు . మార్గమధ్యంలో
ఆటోని ఓలారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడి కక్కడే
మరణించారు.

యాదమ్మ ని విష్ణు దూతలు పూలవిమానంలో తీసుకు పోయారు. సుశీలమ్మ ని యమధర్మరాజు
గారి వద్ద హాజరు పరిచారు.

సుశీలమ్మ యమధర్మరాజు ముందు

మొత్తుకుంది
నేను ఎన్ని లలితా పారాయణాలు చేసాను,
ఎన్ని విష్ణు సహస్రనామ పారాయణాలు చేసాను
ఎన్ని నోములు,వ్రతాలు ఆచరించాను నాకీ
నరకలోకమేమిటి?గుడిముందు కొబ్బరికాయ లు
పూలు అమ్మే ఆ యాదమ్మ కి వైకుంఠము ఏమిటి?
అన్యాయం కదా!

యమధర్మరాజు వివరణ:

అమ్మా! నువ్వు అవన్నీ చేసిన మాట వాస్తవం

కానీ అవన్నీ నీ నగలూ,చీరలూ,నీదర్పాన్ని
ప్రదర్శించడానికే చేసావు.నువు పూజలుచేసిన
ప్రతిసారీ మీ ఆయన,పిల్లలు, ఎన్నో సార్లు
తిండితిప్పలు లేక ఎంతో ఇబ్బంది పడ్డారు.
నీకు చెప్పలేక మీ ఆయన సేవలు చేయలేక
మీ అత్తగారిని మావగారిని వృద్దాశ్రమంలో చేర్పించాడు.

కానీ యాదమ్మ ఉదయం లేచి భర్త కి పిల్లల కి
కావలసిన ఏర్పాట్లు చేసి గుడికి వచ్చే ది.
మధ్యాహ్నం భోజనానికి వచ్చి నప్పుడు సాయం
కాలం రాత్రి భర్త కి పిల్లల కూ కావలసిన అన్ని
సదుపాయాలు పూర్తి చేసి వచ్చే ది.

కర్తవ్యనిర్వాహణే దైవారాధన. ఎవరినీ అగౌరవ
పరిచేదికాదు.

ఈ ధర్మసూక్ష్మము తెలియక చేసే పూజలు యాగాల వల్ల ప్రయోజనం శూన్యం.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling