Sai Bollineni ™ ⭕️ Profile picture
IT Analyst | Entrepreneur | #TDPTwitter 🚲 | #NRITDP 🇺🇸 | TANA Regional Coordinator | NRI’s For Amaravati | Swing Trader | Crypto

Sep 21, 2020, 10 tweets

ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్ నిజాలు :

1
అబద్ధం :
ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో 2,000 కోట్ల అవినీతి

నిజం :
2019 మే నెల వరకు 770 కోట్ల ఖర్చు పెడితే 2,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది?
Phase I - 307.86 Cr
CPE Boxes - 395.12 Cr
Other Expenditure - 67.11 Cr
#APFiberGrid (1/10)

ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్ నిజాలు :

2.
అబద్ధం :
తన తండ్రి శాఖలోని ఫైల్‌ తెప్పించుకుని, లోకేశ్‌ సంతకం చేసారు

నిజం :
ఏ ఫైల్ పై సంతకం చేశారు? ఆ ఫైల్ లో ఏముంది? బురద చల్లే వారు, ఇది కూడా చెబితే బాగుండేది

#APFiberGrid (2/10)

3.
అబద్ధం :
కేంద్రం అనుమతి లేకుండా అంచనా వ్యయం రూ.500 కోట్లకుపైగా పెంచేసి ఖరారు చేసారు

నిజం :
ఈ టెండర్, కేంద్ర సంస్థ అయిన, భారత్‌ బ్రాడ్‌బాండ్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ పర్యవేక్షణలోనే జరిగింది. మొత్తం బీబీఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలోనే జరిగింది. అంచనా పెంపు అనేది అవాస్తవం. (3/10)

4
నిజం :
అంచనా వ్యయం 907.94 కోట్లు అనేది అవాస్తవం. టెండర్‌ ప్రక్రియ మొత్తం బీబీఎన్‌ఎల్‌ మార్గదర్శకాలు ప్రకారమే జరిగింది. టెండర్ పిలవటం దగ్గర నుంచి, కట్టబట్టే దాకా.
టెండర్ లో TCIL, L&T, HFCL, VTL, TSL, Sterilite అనే సంస్థలు పాల్గున్నాయి.

- TCIL & L&T ఎల్ 1 గా నిలిచారు.

(4/10)

5
మొత్తం 10 లక్షల బాక్సుల్లో, 95 శాతం పైగా దాసాన్ కొరియన్ కంపెనీ సప్లై చేసింది. మిగతా 5 శాతం మూడు కంపెనీలు సప్లై చేసారు.
అమర రాజా కి, పైలట్ మ్యానుఫాక్చరింగ్ కింద 30 వేల బాక్సులు మాత్రమే ఆర్డర్ ఇచ్చింది.
9.7 లక్షల బాక్సులు, దాసాన్ అనే కొరియన్ కంపెనీ నుంచి ఇంపోర్ట్ అయ్యాయి. (5/10)

6
అబద్ధం :
కొనుగోలు చేసిన 12 లక్షల‌ బాక్సుల్లో 3.40 లక్షల బాక్స్‌లు పని చేయకపోవడమే ఇవి ఎంత నాసిరకంగా ఉన్నాయో నిరూపిస్తోంది.

నిజం :
ప్రాజెక్టులో 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయని, మేకపాటి గారే చెప్పారు.
3.40 లక్షల బాక్స్‌లు ఇక నాసిరకం అంటున్నారు, అవి ఎక్కడ ఉన్నాయి ?

(6/10)

7.
అబద్ధం :
టెరా సాఫ్ట్ అనే కంపెనీలో వేమూరి హరి ప్రసాద్ డైరెక్టర్ గా ఉన్నారు. అందుకే ఆ కంపెనీకి అప్పచెప్పారు

నిజం :
టెరా సాఫ్ట్ అనేది లిస్టెడ్ కంపెనీ. హరి ప్రసాద్ కి టెరా సాఫ్ట్ తో కానీ, భాగస్వామ్య కంపెనీలతో కానీ అసలు సంబంధమే లేదు. కేవలం విష ప్రచారం చేస్తున్నారు.

(7/10)

8
అబద్ధం :
రూ.1200 ఉన్న సెట్ టాప్ బాక్సును రూ.4వేలకు కొని అవినీతి చేసారు

నిజం :
కేవలం టీవీకి అయితే రూ.1200 కూడా కాదు, రూ.700 కే వస్తుంది.
కానీ ఇక్కడ జీ-పాన్ టెక్నాలజీతో టీవీ, వైఫై రోటర్, టెలిఫోన్ కనెక్షన్ అందించే బాక్సును రూ.3,900కు కొన్నారు

#APFiberGrid (8/10)

9
అబద్ధం :
ఫైబర్ నెట్ ప్రాజెక్టు భోగస్ అంటూ ప్రచారం :

నిజం :
ఫైబర్ నెట్ లో అసలేం చేయలేదు అంటున్న నేటి ప్రభుత్వం, నాడు ఇచ్చిన కనెక్షన్ల ద్వారానే నెలకు రూ.14 కోట్లను సర్వీస్ ఛార్జీలుగా వసూలు చేస్తోంది.

#APFiberGrid (9/10)

10.
అబద్ధం :
చంద్రబాబు, లోకేష్ స్కాం చేసారు

నిజం :
అవినీతికి పాల్పడ్డారు అంటున్నారే తప్ప, గత 16 నెలల పాలనలో ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు.
ఫైబర్ నెట్ ప్రారంభ దశలో నారా లోకేశ్ అసలు ప్రభుత్వంలోనే లేరు.

#APFiberGrid (10/10)

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling