@Gajapati (ଗଜପତି) Profile picture
ଅନାଲୋଚିତ ଓଡିଶାର ପ୍ରଚାର ଓ ପ୍ରସାର #polyglot_Techie_Art_Architucture_litrature_culture_Resercher_Epigraphy_Odia. handle by: BM Adhikari

Sep 23, 2020, 5 tweets

మొగదాలపాడు
******
శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉంది మొగదాలపాడు బీచ్ . ఇది సందర్శకుల్ని కనువిందు చేస్తుంది . కళింగపట్నం సముద్రతీరం తర్వాత సందర్శకుల్ని ఎక్కువ ఆకర్షిస్తున్నది ఇదే . జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది .
1/n

రెండు దశాబ్దాల కిందట సముద్రంలోకి నిర్మించిన పొడవాటి వంతెన ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ . తీరం నుంచి సుమారు 200 మీటర్ల పొడవున ఇది ఉంది . కార్తీకమాసం వచ్చినపుడు వందలాదిగా జనం కుటుంబాలతో ఇక్కడికి వస్తుంటారు . వనభోజనాలకు ఇది మంచి ప్రదేశం .
2/n

సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడి వంతెన స్తంభాన్ని తాకుతున్న దృశ్యం చూసి తీరాల్సిందే . ఇక్కడ సరుగుడు , జీడితోటలు సందర్శకులకు సేద తీరేందుకు నీడనిస్తాయి . ఎలాంటి విశ్రాంతి గృహాలు , దుకాణాలు లేవు . సందర్శకులు తమతో తినుబండారాలు , మంచినీళ్లు వెంట తెచ్చుకోవాల్సిందే.
3/n

శ్రీకాకుళం నుంచి ఆటోలు బుక్ చేసుకొని వెళ్లి తిరిగి రావచ్చు . ఇక్కడికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కళింగపట్నం బీచ్ ఉంది . అయితే ఎక్కడా నీడనిచ్చే చెట్లు లేవు . సముద్రం వరకు రోడ్డు సౌకర్యం ఉంది . వాహనాలలో అక్కడవరకు వెళ్లవచ్చు . ఒకప్పటి ఓడ రేవుకు చెందిన శిథిలభవనాలున్నాయి .
4/n

ఎదురుగా ఎత్తయిన దీపపు స్తంభం ( లైట్ హౌస్ ) చిన్నారులతో పాటు పెద్దల్ని కూడా ఆకర్షిస్తుంది . ఇక్కడ దగ్గర్లో వంశధార నది సాగర సంగమాన్ని కూడా చూడవచ్చు.
C:జయంతిరావుగారు
#end

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling