రాయలసీమ ~ Rayalaseema Profile picture
FB: https://t.co/zAsZHzy9kc Insta : https://t.co/g07orhyHKs RTs and Likes≠ Endorsement Strictly Personal Opinions

Sep 23, 2020, 11 tweets

గురువు గారు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారితో నా పరిచయం

కడప పట్టణానికి చెందిన ధర్మదాత యాదాల్ల నాగమ్మ గారి గురించి పరిశోధన చేసే క్రమంలో గురువుగారు పరిచయం అయ్యారు. అప్పుడే వారి గురించి తెలిసింది అన్నమయ్య ప్రాజెక్టు డైరెక్టర్ గా చేశారని మరియు అన్నమయ్య కీర్తనలు, కైఫీయత్తులు, కడప

చరిత్ర మీద వారికి ఎంతో ఆసక్తి మరియు పట్టు ఉంది అని. 'యాదాల్ల' వారి చరిత్ర సేకరించడంతో పాటు నేను తయారుచేసిన 'అన్నమాచార్య సర్క్యూట్' ఆలోచనను వారికి వినిపించాను.

అన్నమాచార్య సర్క్యూట్ : తాళ్ళపాక అన్నమయ్య తిరుమల శ్రీవారి మీద కాకుండ చెప్పలి, సాంబటూరు, నందలూరు, వెయ్యినూతుల కోన..

ఇలా రాయలసీమ జిల్లాలతో పాటు దక్షిణాదిన దాదాపు 40 క్షేత్రాలు పర్యటించి ఆయా దేవుళ్లపై కీర్తనలు రచించారు. అన్నమయ్య దర్శించిన 'చెప్పలి' వంటి క్షేత్రాల్లో నిధులు లేక కూలిపోయిన గోపురం బాగుచేయించలేని పరిస్థితి. కొందరు చరిత్రకారులకు, పరిశోధకులకు తప్ప ఆయా ఆలయాలను అన్నమయ్య దర్శించారని

ఆయా ఆలయాలపై కీర్తనలు రచించారని స్థానికులకు కాదు కదా కనీసం ఆయా ఆలయ అర్చకులకు కూడా తెలీదు.

అలా అన్నమయ్యచే కొలవబడి, కీర్తింపబడిన వందల సాంవత్సరాల చరిత్ర కలిగిన ఆ ఆలయాలు నిధులులేమితో మామూలు ఆలయలుగా మిగిలిపోయాయి.

కోట్ల ఆస్థులున్న తితిదే, దేవాదాయ ధర్మాదాయ శాఖ, పర్యాటక శాఖ సంయుక్తంగా

ఆయా ఆలయాల పునరుద్ధరణకు నిధులు వెచ్చించి, అన్యాక్రాంతమైన ఆయా ఆలయాల మాన్యాలు రక్షించి ప్రతీ అలయంలోనూ అన్నమయ్య విగ్రహం ప్రతిష్టించి, ఆ గుడి మూలవిరాట్టుపై రచించిన కీర్తనలను,అన్నమయ్య, ఆలయ చరిత్రను శిలాఫలకలుగా వేయించి, ఆ కీర్తనలు రికార్డు చేయించి ఆయా ఆలయాలలో వినిపించేలా ఏర్పాటు చేసి

ఏటా ఒక్కో ఆలయంలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాల లాగా అన్నమయ్య ఆరాధనా ఉత్సవాలు చేస్తే,

ఆయా ఆలయాలకు పేరు, పూర్వ వైభవం వస్తుంది. అన్నమయ్య కీర్తనల వ్యాప్తి వీలవుతుంది. రాయలసీమలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. ఆ పదకవితాపితామహుడిని మనం గొప్పగా గౌరవించుకుని ఏటా స్మరించుకున్నట్టు ఉంటుంది

ఇది క్లుప్తంగా 'అన్నమయ్య సర్క్యూట్' ఆలోచన. ఈ ఆలోచన గురువుగారికి చాలా బాగా నచ్చింది. అన్నమయ్య దర్శించి కీర్తనలు రచించిన ఆలయాలు నేడు ఎవరికీ తెలీకుండా ఉండటం గురించి చాలా బాధపడ్డారు. అన్నమయ్య సర్క్యూట్ గురించి వివరాలు నన్ను అడిగి, ఆర్టికల్ ప్రింట్ తీసుకున్నారు. ఆ 40 ఆలయాలలో

అన్నమయ్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఖచ్చితంగా ప్రయత్నిస్తా అన్నారు. TTDలో గురువుగారు అనేక హోదాల్లో పనిచేశారు కాబట్టి, వారు తలచుకుంటే అన్నమాచార్య సర్క్యూట్ వైపు అడుగులు పడతాయని నేను కూడా సంతోషించాను. గురువుగారు అన్నమయ్య దర్శించి, కీర్తనలు రచించిన సంబటూరు చెన్నకేశవ స్వామి దర్శనానికి

వెళ్ళినప్పుడు వారితో పాటు నేను కూడా వెళ్ళాను. ఎప్పటికైనా ఆయా ఆలయాలలో అన్నమయ్య విగ్రహం పెట్టించాలన్న వాదనతో వారు పూర్తిగా ఏకీభవించారు.

తరువాత వారిని కలవడం కుదరలేదు. అన్నమయ్య సర్క్యూట్ గురించి నేనూ పట్టించుకోవడం కుదరలేదు. ఇంతలోనే దురదృష్టవశాత్తు వారి మరణవార్త వినాల్సివచ్చింది

ఎప్పటికైనా అన్నమయ్య సర్క్యూట్ కార్యరూపం దాల్చి, అన్నమయ్య దర్శించిన గుడులన్నింటిలో అన్నమయ్య కీర్తనలు నిత్యం వినిపించినరోజు, ఆయా గుడులలో అన్నమయ్య విగ్రహాలు, కీర్తనల శిలాఫలకాలు ఏర్పాటు చేసిన రోజు గురువుగారు ఎక్కడున్నా సంతోషిస్తారు

ఓం నమో వేంకటేశాయ

చిత్రాలు :
1. గురువుగారితో నేను
2. అన్నమయ్య దర్శించి కీర్తనలు రాసిన చెప్పలి ఆలయం
3. కూలిపోయిన చెప్పలి చెన్నకేశవస్వామి ఆలయ గలిగోపురం
4, 5,6 : అన్నమయ్య స్మృతి వనం, తాళ్ళపాక లోని అన్నమయ్య విగ్రహాలు
7. అన్నమయ్య దర్శించి కీర్తనలు రాసిన సంబటూరు చెన్నకేశవ స్వామి ఆలయం

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling