Varaprasad Daitha Profile picture
Retired.

Oct 1, 2020, 7 tweets

*మనం "చంపేసిన" తెలుగు పదాలు*
●●●●●●●●క●ళా●దీ●పి●క●●●●●●●

1.అన్నము-బువ్వ (మీల్స్)
2. కూర (కర్రీ)
3)కంచం (ప్లేట్)
4) లోటా ( గ్లాస్)
5)పచ్చడి - ( చట్నీ)
6)ఊరగాయ -(పికిల్)
7) నీళ్లు -(వాటర్)
8)సీసా - ( బాటిల్)
9)చెంచా - (స్పూన్)
10) పాలు -( మిల్క్)

11)పెరుగు - (క ర్ఢ్)
12) ఉల్లి- (ఆనియన్)
13) నూనె - (ఆయిల్)
14)తుండు గుడ్డ -(టవల్)
15)చొక్కా- అంగి ( షర్ట్)
16)ఉప్పు - (సాల్ట్)
17)ఘాటు - (స్పై సి)
18) చేతి గుడ్డ - ( హాఁ కీ)
19) బల్ల - (టేబిల్)
20) కుర్చీ - (చైర్)
21) మంచం - (కాట్)
22)పొడుగు లాగు- (పాంట్)
23)తీపి - ( స్వీట్)11

24)తలుపు -( డోర్)
25) కిటికీ - ( విండో)
26)తాళం - (లాక్)
27)తాళం చెవులు -( కీస్)
28)మీట - ( స్విచ్)
29) పుస్తకం -(బుక్)
30)కాగితం - (పేపర్)
31)కలం - (పెన్)
32)పలక -( స్లేట్)
33)సూది -(నీ డి ల్)
34)దారం - (థ్రెడ్)
35)స్నానం - ( బాత్)
36)సబ్బు - (సోప్)
37)సంచి - (బాగ్)

38)పొడి - (పౌడర్)
39)బడి - (స్కూల్)
49)పాఠం - (లెసన్)
50)లెక్ఖలు -(మాథ్స్)
51)ఏక్ఖాలు- (టేబుల్స్)
52)సాంఘీకమ్ - (సోషల్)
53)సామాన్య శాస్త్రం -( సైన్స్)
54)చరిత్ర - (హిస్టరీ)
55)అర్ధ శాస్త్రం-(ఎకనోమిక్స్)
56)బలపం -(పెన్సీల్)
57) రంగు - (కలర్)
58)సమయం - (టైం)
59)దారి - దోవ- (రోడ్)

60) అమ్మ -(మమ్మి)
61)నాన్న -(డాడీ)
62)నెల - (మంత్)
63) పిన్ని-ఆమ్మ- అత్త (ఆంటీ)
64)పెదనాన్న-బాబాయ్ మామ(అంకుల్)

ఇంకా ఎన్నో...
అన్నీ రకాల రంగుల పేర్లు,
అన్నీ రకాల కూరగాయల పేర్లు, అన్నీ వారాల పేర్లు,
అన్నీ నెలల పేర్లు..
చాలా జాగర్త గా కుటుంబ అంతా కలసి చంపేశామ్...

మనకు వీలైతే ఇంగ్లీష్ పదం, తెలియ క పొతే హిందీ పదం, ఇంకా తెలియక పొతే తమిళ పదం ఐనా వాడతాం కాని.. ఇంకేమి లేకపోతె అప్పు డు తెలుగు పదాన్ని అతి కష్టం గా వాడతాం... ఇంత దారుణమైన భాషా హత్య ఏ భాషలో కూడా జరుగ లేదు..
🙏🙏🙏🙏🙏🙏🙏

దయచేసి చనిపోయిన పదాల్ని బ్రతికిద్దాం కనీసం మన తర్వాతి తరానికి , అంప శయ్య మీద వున్న భాష కు కొంత ఊపిరి పోద్దాం...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*"తెలుగు సామెతలు సౌజన్యంతో...*

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling