ప్రస్తుతం పార్లమెంట్ లో పాస్ ఐన రైతుల బిల్లు రాష్ట్రపతిఆమోదంతో చట్టం అయ్యింది. దీని మీద నేను ఏమి వ్యాఖ్యానించదలచలేదు. ఐతే ఈ చట్టాలు చేసేవారు అమెరికా యూరోప్ తదితర దేశాల లో వ్యయసాయ సరళి గమనించారో లేదో తెలియదు కానీ నేను వెబ్ విహారం లో ఆయా దేశాల్లో వున్న ఒక చిన్న ఆలోచనతో నేను మా
ఆగ్రో ఫార్మ్ నష్టాలను తగ్గించుకుని లాభాల బాటలో పయనించాను. ప్రస్తుతం ఆ ఆగ్రో ఫార్మ్ అమ్మేయడం జరిగింది. ఇది 1999-2005 మధ్య జరిగింది. మొదట్లో అందరి లాగే ఎరువులు, కలుపు తీతలు మొదలైన ఖర్చులు చేసి గిట్టుబాటు ధర రాక నష్టాలు పొందాము. 2001 లో వెబ్ లో మనదేశంలో 1925 ప్రాంతంలో బాగా
అవలంబించిన బయో డైనమిక్ ఆగ్రో పద్ధతులు గురించి తెలుసుకుని వివరాలు సేకరించాను. అప్పటికే అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 4000 కోట్ల పైగానే ఈ విధాన వ్యవసాయం లో పరిణితి సాధించింది. దక్షిణ భరతం లో కోడై కెనాల్ లో biodynamic సొసైటీ ఆధ్వర్యంలో 30 రోజుల శిక్షణ ఇస్తున్నారని మా పెద్దబ్బాయి
వెళ్లి అనుభవం పొంది వచ్చాడు. ఈ విషయం చెప్పినది సలహా ఇచ్చినది హైదరాబాద్ లో ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లోని ఒక సహాయక డైరెక్టర్. అంటే మన శాస్త్రవేత్తలకు అన్ని విషయాలు తెలుసు. అయితే వారిని కొన్ని శక్తులు పైకి రానీయవు. ఇదే విశ్వవిద్యాలయంలో తయారు చేసి (అప్పట్లో 500 గ్రాముల ధర
7రూపాయలు మాత్రమే ఎకరానికి) విక్రయించే pbb లాంటి మైక్రోబ్ వాటి వినియోగం వలన మా సాగు ఎకరానికి (ఎరువుల నిమిత్తం) 15 రూపాయలు దాటలేదు. వీటి వాడకం వలన కలుపు పెరగలేదు. తద్వారా కలుపు తీత ఖర్చులు తగ్గిపోయాయి. చీడ పీడల కొసం biodynamic పద్ధతుల ద్వారా తయారు చేసుకున్న కాషాయాలు వాడుకున్నాము.
ఈవిధంగా మా ఖర్చు అప్పట్లో 1500 దాటలేదు. అప్పటి ధరల ప్రకారం ఎరువులు, pesticides కలుపుల కోసం 6000 రూపాయలు అయ్యేవి. ఎవరు నమ్మినా నమ్ముకున్నా మా పెసర పంట దిగుబడి ఎకరానికి 8 క్విన్తాళ్లు వచ్చింది. సరే దీనిని అమ్మకుండా ఆ పంటని వేల్యూ అడిషన్ పద్ధతిలో పప్పుచేసి అమ్మితే? కొనే వాళ్ళు ఎవరు?
అందుకోసం వెబ్ విహారంలో దొరికిన చిన్న క్లూ "CSA" అంటే కన్స్యూమర్ సపోర్ట్ అగ్రికల్చర్. ఈవిధానం లో 50 మంది నమ్మకమైన వినియోగదారులు ఆసక్తి కనబరచగా వారికి ప్రతి దినం సాయంత్రం పాలు, వారానికోసారి కూరలు, పంటలు (పెసర పప్పు, కంది పప్పు, దంపుడు బియ్యం, మామిడి రకాలు) మొదలైనవి క్రమం తప్పకుండా
సరఫరా చేసే వారం. వారి వారి ఇండ్లలోని పిల్లలు మా పాలు రుచి మరిగి వేరే పాలు, పెరుగు నచ్చుకునేవారు కాదు. ఈ పంటలన్నీ biodynamic పద్దతిలోనే పండించాము. ఇలా 2010 వరకు చేసాము. ఇంతకీ చెప్పొచ్చేదేమంటే పండిన పంట ని వేల్యూ అడిషన్ చేస్తే వచ్చే ధర ఎక్కువ. ఉదాహరణకి దంపుడు బియ్యం ప్రస్తుతం
ఓపెన్ మార్కెట్ లో సుమారు 50 రూపాయలతో దొరుకుతుంది. ఇదే ధాన్యాన్ని దంపుడు మిల్లుల ద్వారా తయారు చేస్తే రెట్టింపు ధర వస్తుంది. దంపుడు మిల్లులు గుజరాత్ లో తయారు అవుతాయి. 15000 లో దొరుకుతాయి. ఒక ఊరిలో ఒక మిల్లు పెట్టుకుంటే ప్రతిదినం 25 క్వింటాల్ బియ్యం ఆడించవచ్చు. ఉపాధి మరియు లాభాలు.
ఒక గ్రామాన్ని ఒక విభాగం గ చేసుకుని అక్కడి ఉత్పాదనలు దగ్గరలోని పట్టణ ప్రాంతాలలో వినియోగదారుల సమాఖ్య నేర్పరుచుకుంటే మార్కెటింగ్ ఇబ్బందులు వుండవు. అలాగే కూరగాయలు. ఉదాహరణకి విశాఖ రైతు బజార్లో నేను గమనించేదేమంటే అక్కడి ఆమె ఆనప, గుమ్మడి మొదలైన వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి
అమ్ముతుంది. ఆమె దగ్గర అమ్మకాలు ఇతర అమ్మకాల కంటే ఎక్కువగా వున్నాయి. ఇందులోని సూక్ష్మం ఏమంటే అవసరమైన వారికి అవసరమైనంత.
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
