రామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఏంటి? నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు.దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు.ఇది వేసవికాలం. కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం.
మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు - పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతువ్యాధులకు... పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని
లౌకికంగా చెబుతారు.
పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం.
పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.
ఫ్యాన్లూ అవీ లేని కాలంలో తాటాకు విసనకర్రలే తాపం పోవడానికి, గాలి రావడానికీ వాడుకునేవారు. విసనకర్రలు గతంలో రెండు రకాలుగా వుండేవి. వెదురుతో చేసిన విసన కర్రలు పొయ్యిలకి, కుంపట్లకీ ఉపయోగించేవారు.
తాటాకు విసనకర్రలు గాలి పొందడానికి, తాపాన్ని పోగొట్టుకోవడానికి ఉపయోగించేవారు. మామిడిపండ్ల కాలం రావడంతో మామిడిపళ్ళు, విసనకర్రలు ఇవ్వడం పుణ్యప్రదం. అంతేకాదు, ఇతరులు హాయిగా వుండటం కోరుకోవడం కూడా వుంది. శ్రీరామనవి నాడు విసనకర్రలు దానం చేయడం కూడా అందుకే.
శ్రీ రామనవమి శుభాకాంక్షలు ✨
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.