H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture
AndhraPradesh #AreKatika Sangh State Secretary #Khatik ఆంధ్రప్రదేశ్ #ఆరెకటిక సంఘం రాష్ట్రకార్యదర్శి.
Mar 27 4 tweets 2 min read
#NeighbourDay2022
#Neighborday #neighbourday
* ఇరుగుపొరుగు * దినోత్సవం
#NationalNeighborDay
ఆవానసం కలిపిన ఆత్మీయ బందువులు వీరు
అవసరార్థం మనం ఇంటి వారిని వదిలి వెళ్ళాల్సి
వచ్చినప్పుడు దైర్యన్నిచ్చే ఆప్తులు వారు

కష్టం ఎదురైనప్పుడు కొండంత మనోబలాన్ని
ఇచ్చే నహవాన స్నేహితులు వీరు అన్యోన్యత కరువయ్యి అయినవారు అందనివారు
అయినప్పుడు మేమున్నాం అంటూముందుకు వచ్చే
మాన్యులు వారు

విలువైన మైత్రి, ఐక్కత, అనుబంధాలు కలబోసినా
మనుషులు కలినసి జరిపే సాముహిక ఆద్యాత్మాక
కార్యక్రమాలు కు ఆలంబనా వీరు

పక్కింటి విన్నిగారు ఇచ్చిన గోంగూర
Mar 27 23 tweets 3 min read
#InternationalWhiskeyDay
విస్కీ అనేది పులియబెట్టిన ధాన్యం మాష్ నుండి తయారైన స్వేదన ఆల్కహాల్ పానీయం. బార్లీ, మొక్కజొన్న (మొక్కజొన్న), రై మరియు గోధుమలతో సహా వివిధ రకాల ధాన్యాలు (మాల్ట్ కావచ్చు) ఉపయోగిస్తారు. విస్కీ సాధారణంగా చెక్క పేటికలలో ఉంటుంది, సాధారణంగా కాల్చిన వైట్ ఓక్‌తో తయారు చేస్తారు. విస్కీ ని ఆనందంగా ఆహ్లాదంగా సేవిచండం, విస్కీని దుర్వినియోగ పర్చకుండా జాగ్రత్తపడటం కోసం విస్కీ ప్రియులు అంతర్జాతీయ విస్కీ దినోత్సవ జరుపుకుంటారు.
#InternationalWhiskyDay
Mar 27 32 tweets 4 min read
#WorldTheatreDay 🎭
ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం. ఇది 1961లో ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇనిస్టిట్యూట్‌ వారిచే ప్రారంభించబడింది.
1.ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో నాటకాన్ని ప్రోత్సహించడం
#TheatreDay 2.ప్రజలకు నాటకం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కలిపించడం
3.విస్తృత స్థాయిలో నాటక సంస్థలకు ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు మరియు ప్రజాప్రతినిధులకు అవగాహన కలిపించి వారి ద్వారా నాటకరంగాన్ని అభివృద్ధి చేయడం
Mar 26 15 tweets 3 min read
#EarthHour #EarthHour2022
భూ గోళం మండిపోతోంది. భానుడి భగభగలతో ధరణి దద్దరిల్లిపోతోంది. భూ దేవి అగ్గి బరాట అవుతోంది. ఆధునికత కొంప ముంచుతోంది. ఏసీలు, ఫ్రిడ్జ్ లు, కార్లు ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి వెలువడే క్లోరో , ఫ్లోరో, కార్బన్స్ ఓజోన్ పొరను క్రమంగా నాశనం చేస్తున్నాయి.
#Earth ఫలితం సూర్య కిరణాలు నేరుగా నేలపై పడటంతో.. భూ తాపం అంతకంతకు పెరుగుతోంది. కారణమేదైనా పర్యావరణమే ప్రమాదంలో పడింది. గ్లోబల్ వార్మింగ్ జీవరాశి ఉనికికే విలన్ గా మారింది. అందుకే భూమిని కాపాడుకుందాం. పర్యావరణాన్ని రక్షించుకుందాం అంటూ పర్యావరణవేత్తలు ఎర్త్ అవర్ కు శ్రీకారం చుట్టారు.
Mar 26 14 tweets 3 min read
#SpinachDay 🥬☘️ పాలకూర దినోత్సవం
మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర. పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి. పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. పాలకూర, #Spinach —ఇది భారతీయులు అహారానికి ఉపయోగించే ఆకు కూరలలో ఒకటి.
* విటమిన్‌ ' కె ' సమృద్ధిగా ఉంటుంది.
* ఆకు కూరలు వండే ముందు శుభ్రముగా కడగాలి.
* మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు.
Mar 26 18 tweets 3 min read
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా,ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు.ఆరోగ్యముగా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది.మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. #WorldEpilepsyDay
#PurpleDay #EpilepsyAwareness ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మూర్చ (ఫిట్స్ )వ్యాధి (Epilepsy(Fits))- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం
#WorldEpilepeyDay🎗️
Mar 26 11 tweets 2 min read
భారతీయ చిత్రలేఖన🎨 పితామహుడు శ్రీ ఎస్.ఎం. పండిట్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళి 💐

ఎస్ ఎం పండిట్ : భారతీయ ఆత్మ

ఈ ప్రసిద్ధ చిత్రకారుని పేరు విననివారు కూడా ఆయన చిత్రాలు చూస్తే వెంటనే గుర్తుపడతారు. దాదాపు భారతదేశపు ప్రతి మనసులో ఎంతోకొంత ఆయన చిత్రాలు ఇంకి ఉంటాయి. ఎస్ ఎం పండిట్ 1916 కర్ణాటకలోని గుల్బర్గాలో జన్మించారు, చిన్నతనము నుండే ఆయనలోని కళా నైపుణ్యం చుట్టుపక్కలవారు గమనించే స్థాయిలో ఉంది . యూరోపియన్ చిత్రకారుల ప్రభావంతో ఆయన పెయింటింగ్ ప్రస్థానం మొదలైంది, మొదట మద్రాస్ కాలేజ్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ లో,
Mar 18 29 tweets 10 min read
@RayaIaseema #Tirumala #Tirupati
#TumburaTeertham ప్రకృతి ఒడిలో నిఘూడ వైవిద్యం.. తుంబర తీర్ధం....
#తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి

శేషాచల అడవుల్లో ఉన్న తుంబుర తీర్థం భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ట్రెక్కింగ్ వంటి సాహస యాత్రలకు స్వర్గధామం. కొండలు, కోనలు, రాళ్లు రప్పలు దాటుకుని.. తుంబుర క్షేత్రం సందర్శించడం నిజంగా థ్రిల్లింగే.

శేషాచలం అటవీ ప్రాంతంలోని తిరుమల కొండల్లో దాగి ఉన్న ప్రకృతి ప్రసాదించిన సుందరదృశ్యం తుంబుర తీర్థం.
Mar 18 8 tweets 1 min read
లక్ష్మీ కటాక్షం లభించాలంటే........!!
ఉదయం నిద్రలేవగానే తమ అరచేతులను
కళ్ళకు దగ్గరగా తెచ్చుకుని చూసి,
ముఖం మీద రెండు అరచేతులను త్రిప్పుకోవాలి.

సూర్యోదయానికి పూర్వమే ఇళ్ళు శుభ్రం
చేసుకోవాలి.

సంధ్యాసమయానికి పూర్వమే ఇల్లాలు స్నానం చేసి ఇంట్లోని దేవీదేవతలకు ధూపదీప హారతులు ఇవ్వాలి. ఇంట్లో ఉండే దేవీదేవతల ఫోటోలకు పటాలకు కుంకుమ, చందనం, పువ్వులతో అలంకరించాలి.

సంధ్యాసమయంలో ఇళ్ళు ఊడ్చకూడదు.

ఇళ్ళు శుబ్రం చేసుకోకుండా ఉదయం అల్పాహారం తినకూడదు.

ఎటువంటి పనికి బయటకు వెళ్ళవలసి వచ్చినా ఇంటిని శుభ్రపరచుకుని బయటకు వెళ్ళాలి.
Mar 18 10 tweets 2 min read
బయో ఇంధనాలు బయోమాస్ ల నుంచి పరిశ్రమల్లో వ్యవసాయ ఉత్పత్తులు లేదా ఆహార పదార్థాల ఉత్పత్తులు తయారయ్యేటపుడు వచ్చే వ్యర్థాలనుంచి లేదా వంటనూనె, వనస్పతులను లను తిరిగి ఉప ఉత్పత్తులుగా పెట్రోలియం తయారౌతాయి.బయో ఇంధనాల్లో పెట్రోలియం లేకపోయినా,వాటిని ఏ మోతాదుల్లొనైనా కలిపి #Biodiesel
#Diesel ఒక బయో ఇంధన మిశ్రమాన్ని తయారుచేసుకోవచ్చు. అలా తయారుచేసుకొన్న మిశ్రమాన్ని మనయంత్రాల్లో పెద్ద మార్పులవసరం లేకుండానే వాటిని డీజిల్ ఇంజన్ వంటి వాటిల్లో వాడుకోవచ్చు.బయో ఇంధనాలని వాడటం సులభం,వదిలించుకోవడం సులభం, విషరహితం.దీనిలో గంధకం ఉండదు. పైగా ఇది వాసన లేనిది. #BiodieselDay 🌱🌵⛽🛢️
Mar 18 4 tweets 4 min read
#HappyHoli
హోళీ పండుగ శుభాకాంక్షలు ✨👣🔫
ఫాల్గున మాసం... పౌర్ణమి సమయం
గడిచినయేటికి వీడ్కోలు పలికే
వేడుకైన వార్షికోత్సవం
వసంతాగమనంలో వచ్చేను రంగుల హోలీ
నింపేను జీవితంలో సంతోషపు కేళి

మురిపాల బాలకృష్ణున్ని యశోద ఊయలలూపిన
డోలోత్సవం
#Holi2022 #HoliFestival #Holi #HolikaDahan2022 రాక్షసపీడ పోయేందుకు హోలికాశక్తిని కొలిచే
హోలికోత్సవం

రాధకు ప్రేమరంగులద్దిన కృష్ణుని ప్రేమోత్సవం
కామునిపై శంకరుడు త్రినేత్రం గురిపెట్టి
గెలిచిన విజయోత్సవం

కాముని పున్నంగా చెప్పుకునే ఈ సంబరం
రంగుల హరివిల్లులైన స్వరజతుల సమ్మేళనం
Mar 17 17 tweets 3 min read
#summervibes #SummerHealth #Tips #Summer2022
వేసవి ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రానురాను ఉష్ర్ణోగతల వల్ల జనం బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి. ఎండలతో పాటు ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులు జనజీవనంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలో ఎక్కువ సమయం గడిపిన, సమయానికి ఆహారం తీసుకోకపోయిన, కలుషిత నీరు తదితర కారణాల వల్ల వ్యాధులు వచ్చే సూచన ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అతిసారం, నీళ్ల విరేచనలు, చికెన్‌ఫాక్స్‌, హైపటైటేస్‌ వంటి వ్యాధులు వస్తాయి.
Mar 17 8 tweets 2 min read
#holi 🔫🔵🔴🟢🟡🟠💜💕👣
హోళీ అంటే సర్వం రంగుల మయం. చిన్నపెద్దా అందరిలో ఆనందం. ఉత్సాహంగా… ఉల్లాసంగా.. చిన్నపెద్దా, కులం, పేద, ధనిక ఇలా ఏ బేధం లేకుండా ఆనందోత్సవాలతో ఆడుకునే రోజు. అసలు ఈ రంగులకేళీ ఎప్పటి నుంచి జరుపుకొంటున్నారు ? ఏయే ప్రాంతాల్లో ఏవిధంగా నిర్వహిస్తారో తెలుసుకుందాం… #HappyHoli

శిశిరరుతువు పోతూ వసంతం రావడానికి మరో పదిహేను రోజులు మిగిలిన ఈ సందర్భంలో ఈ పండుగను నిర్వహిస్తారు. శిశరంలో ఆకులు రాలిపోయి.. లేలేత రంగుల్లో వివిధ వర్ణాల్లో చెట్లు ఒక విచిత్రమైన శోభను సంతరించుకునే సంధి సమయం ఇది. ప్రకృతిలో పండిపోయిన ఆకులు, కొత్తగా చిగురిస్తున్న ఆకులు..
Mar 17 7 tweets 2 min read
నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు (మార్చి 17, 1892 - జూన్ 30, 1984) తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో వ్రాసిన తృణకంకణముతో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. #Telugu #Poet ప్రేమ పెళ్ళికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశాడు.

కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత. 18వ శతాబ్దంలో జర్మనీ, ఫ్రాన్సు దేశాలలో వికసించిన ఈ కళాప్రక్రియ
Mar 17 6 tweets 2 min read
మూడు సంవత్సరాల క్రితం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిన భారత దేశం...... నేడు శ్రీ మనోహర్ పారికర్ గారి వర్ధంతి (పుణ్యతిథి) సందర్భంగా ఘన నివాళి 🙏💐🇮🇳
ఓం శాంతి శాంతి శాంతిః శ్రధ్ధాంజలి.....
కీర్తిశేషులు #మనోహర్ #పారికర్# #గోవా
#ManoharParrikar #Goa #Parrikar మనొహర్ పారికర్ గారు భారత రక్షణ శాఖా మంత్రి కాక ముందు వరకు మన భారత రక్షణ దళాలకు ప్రత్యేక పరిస్తితులలొ వాడే ప్రత్యేక మైన shoes ను ఒక్కొక్క జత షూ 25,000 రూపాయల చొప్పున ఇజ్రాయిల్ నుండి దిగుమతి చేసుకునేవారు ...మనొహర్ పారికర్ గారు రక్షణశాక భాద్యతలు స్వీకరించిన తరువాత
Mar 16 6 tweets 2 min read
#NationalVaccinationDay2022
మార్చి 16న‌ జాతీయ టీకాల దినోత్సవంగా జరుపుకుంటారు. దీన్ని జాతీయ రోగనిరోధక దినోత్సవం అని కూడా పిలుస్తారు
#vaccination2022
టీకా ప్రాముఖ్యతను మొత్తం దేశానికి తెలియజేయడానికి ఏటా ఈ రోజును నిర్వ‌హిస్తారు #vaccinationday #vaccination4All
#VaccinesSaveLives Image ఈ తేదీని మొట్టమొదట‌ 1995లో గుర్తించారు. (దేశంలో "పల్స్ పోలియో" కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం). 16 మార్చి 1995న దేశవ్యాప్తంగా 'జోనస్‌ సాల్క్‌ కనుగొన్న పోలియో టీకాలను భారత చిన్నారులు అందరికీ ఉద్యమంగా 'ఓరల్‌ పల్స్‌ పోలియో డ్రైవ్‌ ప్రారంభమైంది.
Mar 16 5 tweets 1 min read
స్వీయచిత్ర వ్యతిరేక దినోత్సవం #NoSelfieDay

సెల్ఫీ అనగా తనను తాను ఫోటో తీసుకోవడం, సాధారణంగా చేతిలో ఇమిడిపోయే డిజిటల్ కెమెరా లేదా కెమెరా ఫోన్ లతో సెల్ఫీలను తీసుకుంటారు. సెల్ఫీలు తరచుగా ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సేవల ద్వారా పంచుకోబడుతున్నాయి. Image ఇవి సాధారణంగా ప్రశంసాపూర్వకంగా మరియు మామూలుగా కనిపిస్తున్నాయి. చాలా వరకు సెల్ఫీలను తమ చేతినందు ఉన్న కెమెరాతో చేతిని దూరంగా చాచి లేదా అద్దంలో చూసుకొని లేదా కెమెరాలో సెల్ఫ్-టైమర్‌ను ఉపయోగించి తీసుకుంటారు.
Nov 6, 2021 16 tweets 4 min read
#BhaiDooj #bhaiduj #భగినీహస్తభోజనం
"భగినీ హస్త భోజనము" అంటే ... సోదరి చేతి వంటలతో, సోదరి ఇంట భోజనము చేయడం అని అర్ధము. ఇది ఒక సనాతన, కుటుంబ ఆప్యాయతల్ని పెంచే ఆచారము. ఇటు వంటి మంచి ఆచార అలవాట్లు మన హిందూ పండగల్లో ఎన్నో ఉన్నాయి. ఆ సత్సంప్రదాయాలను మన తరువాత తరము వారికి అందించాలి ... అందించడానికే అన్ని పండుగలూ తప్పనిసరిగా ఆచరించాలి, చేయించాలి.ప్ర్రాచీన భారతదేసములో ఉమ్మడి కుటుంబాలు, బంధుమిత్ర అనుబంధాలు, ఆప్యాయతలు మెండుగా ఉండేవి. పండుగులకు, పబ్బాలకు, ఉత్సవాలకు, గ్రామ వేడుకలకు, ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ స్నేహ .. బంధుత్వాలను నిలబెట్టుకొంటూ విలువలను పాటించేవారు.
Nov 5, 2021 4 tweets 1 min read
శ్రామికుల పక్షాన నిలిచిన కవి
దోపిడీ సంస్కృతిని నిరసించిన కవి
ఒక ధృడమైన సంకల్పం వున్న కవి
చేతిలో కలమే ఆయుధం
అలాంటి సంకల్పం వున్న కవి
మనసులో ఘర్షణని మాటగా మార్చిన కవి- బైరాగి
ఆయన జయంతి సందర్భంగా.....🌹💐🌺🌼🇮🇳

జననం 5 నవంబరు 1925
మరణం 9 సెప్టెంబరు 1978 కొందరు రచయితలు బతికుండగానే గొప్ప సాహిత్యకారులుగా కీర్తిని సాధిస్తారు. ఆ కీర్తితో పాటుగా వచ్చే సౌఖ్యాలనూ అనుభవిస్తారు. మరికొందరు ఉంటారు! వారి జీవితం సాహిత్యం కోసమే అన్నట్లుగా సాగుతుంది. ఎలాంటి భేషజాలకూ, భుజకీర్తులకీ లొంగకుండా సాహిత్యమే తొలి ప్రాధాన్యతగా బతికేస్తారు.
Nov 5, 2021 16 tweets 6 min read
నేడు కార్తీక మాసం ప్రారంభం మరియు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు కేదార్ నాథ్ నందు పునః నిర్మించిన జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల సమాధికి పూజాధికాలు నిర్వహించి, వారి విగ్రహాన్ని ఆవిష్కరించిన శుభ సందర్భంగా
#Kedarnath #Pushpagiri #AdiShankaracharya
#KedarnathDham #Kadapa కడప జిల్లా శ్రీ కామాక్షి సమేత శ్రీ వైద్యనాధ స్వామి దేవస్థానం పుష్పగిరి గ్రామం వల్లూరు మండలం లో దేవస్థానం నందు నిర్వహించిన వేడుకలలో పాల్గొన్నాను. 🙏
#AdiShankaracharya
#Kedarnath #Pushpagiri
Nov 5, 2021 8 tweets 2 min read
#GunPowderDay 💥
గన్ పౌడర్ అనేది రసాయన పదార్థాల (కర్రబొగ్గు, గంధకం, పెట్లుప్పు) మిశ్రమం. ఇది నల్లగా ఉంటుంది, కాబట్టి దీనిని నల్ల మందు అని కూడా అంటారు. దీనిని మందుగుండు సామాగ్రి, బాణాసంచా తయారీ లోను, తుపాకులలోను ఉపయోగిస్తారు.ముఖ్యముగా దీనిని తుపాకులలో ఉపయోగిస్తారు కనుక #gunpowder దీనికి తుపాకి మందు అనే పేరు వచ్చింది. ఇది చాలా వేగంగా మండుతుంది, వాయువులను సృష్టిస్తుంది. గన్ పౌడర్ నుంచి వాయువులు వెలువడినప్పుడు గన్‌పౌడర్ ఆక్రమించి వున్న స్థలం కంటే మరింత స్థలాన్ని ఆ వాయువులు ఉపయోగించుకుంటాయి, అందువలన అక్కడ నుంచి వాయువులు బయటకు నెట్టుకొస్తాయి.