#WildfireCommunityPreparednessDay వేసవి వచ్చిదంటే చాలు.. అడవులను కార్చిచ్చు కాటేస్తుంటుంది. విలువైన అటవీ సంపదను దహిస్తుంది. ఫలితంగా ప్రభుత్వానికి ఆస్తి నష్టం, వన్యప్రాణులకు ప్రాణ నష్టం, మనుషులకు అటవీ సంపద నష్టం వాటిల్లుతుంటుంది.
#Wildfire #Seshachalam #Nalamalla @RayaIaseema
భూగోళంపై అడవుల క్షీణత మానవాళి మనుగడను ప్రమాదంలోకి నెట్టేస్తోంది. వృక్ష సంపద తరిగేకొద్దీ కరవు కాటకాలు, తుపాన్లు, వరదలు, ఇతర వాతావరణ మార్పులు మానవాళికి కొత్త సవాళ్లు విసురుతున్నాయి. భవిష్యత్తు తరాలు ఎదుర్కొనబోయే ఘోర పరిస్థితులు కళ్లముందే సాక్షాత్కరిస్తున్నాయి.
కొన్నేళ్లుగా భారత్‌లోనే కాకుండా, ప్రపంచ దేశాల్లో కార్చిచ్చు పెద్దయెత్తున అడవులను భస్మీపటలం చేస్తున్న తీరు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి వచ్చినా కార్చిచ్చును నియంత్రించడం అభివృద్ది చెందిన దేశాలకు సైతం కష్టతరంగా మారుతోంది.
గడచిన ఏడాది కాలంలో క్యాలిఫోర్నియా, ఆస్ట్రేలియాల్లో తలెత్తిన కార్చిచ్చుల వల్ల భారీ విస్తీర్ణంలో అడవులు బూడిదై ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. కేరళలోని త్రిసూర్ జిల్లాలోని అడవుల్లో ఎగిసిపడ్డ కార్చిచ్చులను నియంత్రించే క్రమంలో ముగ్గురు అటవీ సిబ్బంది మృత్యువాత పడటం ఆందోళన కలిగించింది.
తరచూ శేషాచలం, నల్లమలతో పాటు దేశంలోని హిమాలయాలు, తూర్పు, పశ్చిమ కనుమల్లోని అడవుల్లో తలెత్తే అగ్నిప్రమాదాలు అనూహ్య నష్టాలు మిగుల్చుతున్నాయి. అడవుల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే ఉద్దేశంతో నిర్వహిస్తున్న 🌳అటవీ కార్చిచ్చు/అగ్నిప్రమాద🔥👨🚒🚒 ముందస్తు నివారణ/చర్యల దినోత్సవ సందర్భమైనా-
మానవాళి ఆలోచన ధోరణిలో మార్పు రగిలిస్తే మేలు!
కార్చిచ్చుకు కారణాలు అనేకం..
విలో కార్చిచ్చు వ్యాపించేందుకు అనేక కారణాలుంటాయి.ప్రతి వేసవిలో అడవికి కార్చిచ్చు ప్రమాదం పొంచిఉంది. అయితే అడవిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునేందుకు ప్రథమ కారణం మాత్రం మనుషులే.
అడవుల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగానే మంటలు చెలరేగి కార్చిచ్చు వ్యాపించేందుకు కారణమవుతుంది.అటవీ ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో ఆయా వ్యక్తులు బీడీ, సిగరెట్లు తాగి కింద పడేస్తుంటారు. ఇది రాచుకుని చిన్న చిన్న మంటలుగా మొదలై కార్చిచ్చుగా వ్యాపిస్తుంది.
చిన్న మంటగా ఉన్న సమయంలో ఎవరూ గమనించే అవకాశం లేకపోవడంతో వెంటనే పక్కకు పాకుతుంది. అలాగే కొంతమంది అడవిలో సంచరిస్తూ భోజనాలు తదితర వంటలు చేసుకుని నిప్పును పూర్తిగా ఆర్పివేయకుండానే వెళ్లిపోతుంటారు.
ఈ విధంగా కూడా నిప్పు వ్యాపిస్తుంది. వేసవి కాలం కావడంతో మంటలు సులువుగా వ్యాపిస్తుంటాయి. అలాగే వేసవిలో చెట్ల ఆకులు ఎండి రాలిపోతుంటాయి. అటవీ ప్రాంతంలో కింద మొత్తం ఎండిపోయిన ఆకులు ఉండటం.. అడవిలో పెద్ద పెద్ద గుట్టలపై నుంచి రాళ్లు జారి పడేటప్పుడు రాపిడి జరగడం వల్ల నిప్పు రవ్వలు ఎగిసి
ఎండుటాకులపై పడటంతో మంటలు వ్యాపిస్తుంటాయి. ఇక అటవీ ప్రాంతం సమీపంలో పొలాలు ఉన్న రైతులు చెత్తను తగలబెట్టిన సమయంలో నిప్పు రవ్వలు అడవిలో పడి కార్చిచ్చుకు కారణమవుతుంది. దీనికి తోడు సులువుగా జంతువులను పట్టుకోవడం కోసం కొందరు వేటగాళ్లు కూడా అడవులను ఉద్దేశపూర్వకంగా తగులబెడుతూ ఉంటారు.
అడవుల్లో కార్చిచ్చు వల్ల అరుదైన మొక్కలు, విత్తనాలు కాలిపోవడంతో పాటు మృత్తిక సారహీనమై వృక్షజాతుల పునరుత్పత్తి క్షీణిస్తుంది. పాములు ఇతర సరీసృపాలు, నేలపై తిరుగాడే చిన్న జంతువులు మంటల్లో చిక్కుకుని మరణిస్తాయి. జంతువుల ఆవాసాలు నశించి సమతుల్యత దెబ్బతింటుంది.
పొదలు, మొక్కలు కాలిపోవడంతో జంతువులు దాక్కొనే దారిలేక సమీప జనావాసాల్లోకి చొరబడ్డం గానీ, వేటగాళ్ల బారిన పడ్డం గానీ జరుగుతాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల నివారణకే అటవీ అగ్ని ప్రమాద నివారణ దినోత్సవం.
ముందస్తు చర్యలు..
కార్చిచ్చు వ్యాపించకుండా అటవీ శాఖ ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. అటవీ ప్రాంతాల సమీపంలోని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
అడవికి వెళ్లిన సమయంలో నిప్పులు తదితర వాటిని రాజేయవద్దని, సిగరెట్లు, బీడీలు కాల్చి పడేయవద్దని పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి.
అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై పరిసర జనావాసాల్లోని గిరిజనులు, ఇతరుల్లో చైతన్యం కల్పించడం కోసం కళాజాతాలు నిర్వహించాలి.అడవుల్లోకి వేటగాళ్ళ ప్రవేశాన్ని నిరోధించడం తదితర చర్యలు చేపట్టాలి.
వన్యప్రాణుల సంరక్షణతోపాటు అటవీ సంరక్షణ కోసం బేస్‌క్యాంప్ బృందాలను ఏర్పాటు చేయాలి. ఈ టీమ్‌లో ఐదుగురు సభ్యులు ఉండేలా వారికి కావాల్సిన భోజన, క్యాంపు వసతి కల్పించాలి. వారు అటవీ ప్రాంతంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలి.
వీరు పగలూ రాత్రీ అడవిలోనే గస్తీ తిరుగుతూ అడవిని, వన్యప్రాణులను కాపాడుతారు. అలాగే ట్రాక్టర్లతో పిక్స్‌లో నీటిని నింపుతారు. అడవిలో కార్చిచ్చు వ్యాపించకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటారు.
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.