#OneDayWithoutShoesDay 🦶👣
మనిషి జీవితంలో పాదరక్షలు చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న రోడ్లపై చెప్పులు లేకుండా నడవడం అంటే సాహసం చేసినట్లే. అందుకే పాద రక్షకాలను అందరూ ధరిస్తారు.ప్రపంచ వ్యాప్తంగా పేదరికంతో పాదరక్షణలు కొనే స్థోమత లేక ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి వారికి మద్దతుగా
ఈ రోజు పాద రక్షణలు లేకుండా ఒక రోజు ఉంటూ వారికి పాదరక్షణలు విరాళంగా ఇస్తారు..
ఈ విధంగా నేడు "పాద రక్షణలు లేకుండా ఒక రోజు" దినోత్సవం జరుపుకుంటారు.
అసలు చెప్పులు ఎలా వచ్చాయో తెలుసా?
పూర్వం ఓ రాజుగారికి, తన రాజ్యం మొత్తం చుట్టిరావాలని, మదిలో కోరిక కలిగిందంట.
రాజు తలచుకుంటే..! అన్న చందాన,వెంటనే మంత్రిని పిలిచి,రాజ్యామంతా ఎర్ర తివాచితో కప్పమన్నాడంట!ఆ మంత్రిగారు నేర్పుగా రాజుకి ఇలా చెప్పాడంట.అయ్యా! మహారాజా! రాజ్యమంతా తివాచి పరచాలంటే,మన సంపద సరిపోదు సరికదా!ఒక వేళ, ఆ పని ఆరంభించినా..
పూర్తి కావడానికి జీవిత కాలం చాలదు.
అంచేత మీ కాళ్ళకే రక్షణ కవచం వుంటే,మీరు ఎంత దూరం తిరిగినా.. మీ పాదాలకు ఏమీ కాదు అన్నాడట.మంత్రి మాటకు సంతసించి రాజు అట్లే చేశాడట.అలా చెప్పులు వెలుగులోకి వచ్చాయని ఒక చిన్న కథ.
ఇవి పాదాల్ని బయటి వాతావరణం నుండి రక్షించడమే కాకుండా, శుభ్రంగా ఉంచుతాయి, అందాన్నిస్తాయి. సాధారణంగా పాదం, పాదరక్షల మధ్య గుడ్డ లేదా నైలాన్ తో చేసిన సాక్సులు వాడతారు.
నడిచిన దారిలో మన కాళ్లకు ముళ్లు గుచ్చుకోకుండా కాపాడిన చెప్పుల వ్యథను చెప్పినవారు లేరు.ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంగా చెప్పులు నడిచిన దారిని కొలిచినవారు లేరు.చెప్పులు మోసిన మనుషుల కథలు చెప్పినవారు లేరు.
‘’సేప్పుల్లెకుండా రోడ్డేసే ఒల్ని సూసి
తారుతో కరిగి డబ్బా లోంచి
సుక్కలు సుక్కలుగా ఏడ్చింది ఎండ ‘’
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.