H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture
AndhraPradesh #AreKatika Sangh State Secretary #Khatik ఆంధ్రప్రదేశ్ #ఆరెకటిక సంఘం రాష్ట్రకార్యదర్శి.

May 10, 2021, 12 tweets

#WorldLupusDay
#lupusday 🦋 🎗
లూపస్‌ ఒక తీవ్రమైన వ్యాధి. దీన్నే ఎస్‌ఎల్‌ఈ (సిస్టమిక్‌ లూపస్‌ ఎరిథమెటోసిస్‌) అని కూడా అంటారు. మన వ్యాధి నిరోధక వ్యవస్థ మనపైనే దాడి చేయడం వల్ల వచ్చే జబ్బులను ‘ఆటో ఇమ్యూన్‌ జబ్బులు’ అని అంటారు.

లూపస్‌ కూడా ఓ ఆటో ఇమ్యూన్‌ జబ్బు శరీరాన్ని చికాకు పెట్టేస్తుంది. ఇది దీర్ఘకాలిక అంటువ్యాధి. అలసట, నీరసం, కీళ్లలో వాపు, తరచూ తలనొప్పి దీని లక్షణాలు. వ్యాధి నిరోధక శక్తిని అందించే కణాలపై అంతర్గత దాడి దీనికి కారణం. 17 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ఇది వస్తుంది.

దీనిపై అవగాహన పెంచేందుకు ఏటా మే 10వ తేదీన ప్రపంచ లూపస్‌ నివారణ దినం జరుపుతున్నారు. చిన్న వయసున్న వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మనిషి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. రోగాల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని అనుక్షణం రక్షిస్తుంటుంది.

వ్యాధి నిరోధక క్రిములు శరీరంలోకి ప్రవేశించగానే రోగనిరోధక వ్యవస్థ వాటితో పోరాడుతుంది. ఇది క్రమ పద్ధతిలో జరగాలి. కాని కొన్ని వ్యాధి నిరోధక వ్యవస్థలు అతిగా పని చేస్తూ విచక్షణ కోల్పోతాయి. మన శరీరంపైనే దాడికి దిగుతుంటాయి. ఈ దాడి కారణంగానే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి.

ఈ ఆరోగ్య సమస్యలనే ఆటో ఇమ్యూన్‌ సమస్యగా చెబుతారు. ఈ తరహా సమస్యే కాకపోతే మిగతా ఆటో ఇమ్యూనో వ్యాధులకు లూప్‌సకు తేడా ఏమిటంటే మిగిలినవన్ని ఏదో ఒక అవయానికి పరిమితమైతే లూపస్‌ మాత్రం శరీరంలోని చాలా వ్యవస్థలపై దాడికి దిగుతుంది.

ఎవరికి ప్రమాదం:🚑
లూపస్‌ రోగుల్లో 90 శాతం మహిళలు ఉంటారు. కొన్ని సార్లు పురుషులకు వచ్చే ప్రమాదం ఉంది.ఈ వ్యాధి కుటుంబంలో వంశపారపర్యంగా రాదు. కానీ తల్లిదండ్రుల నుంచి కొన్ని జన్యువుల వల్ల వస్తుంది.

చర్మకారక వ్యాధి:🥽
లూపస్‌ అనేది ఓ ఆటో ఇమ్యూన్‌ దీన్ని ప్రారంభంలోనే గుర్తించాలి.

ఇది ఒక చర్మకారక వ్యాధి. చర్మంపై ప్రభావం చూపటంతో పాటు కీళ్లు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, నరాల వ్యవస్థ శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా 20 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మగవారితో పోలిస్తే 10 రెట్లు అధికంగా మహిళల్లో ఈ వ్యాధి

వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కారణాలు:
శరీరంలో వ్యాధి నిరోధక శక్తి బలహీన పడటం
జన్యులోపాలు, ఇతర అనారోగ్య సమస్యలు
సూర్యునిలోని అతినీలలోహిత కిరణాలకు గురికావడం
ధూమపానం
కొన్నిరకాల మందులు వాడటం
కొన్ని రసాయనాలు వాడటం వల్ల

లక్షణాలు:🧪
సీతాకోక చిలుక ఆకారంలో బుగ్గలపై దద్దర్లు
జ్వరం, కీళ్లనొప్పులు, నీరసం
కీళ్లవాపులు, వీపు, ముఖంపై పొలుసులు
నీరసం, అలసట,రక్తహీనత

వ్యాధి రకాలు:😥
ఈ వ్యాధి నాలుగు రకాలు.
చర్మానికి సంబంధించిన డిస్కాయిడ్‌ క్యూటెనియన్‌ లూపస్‌
డ్రగ్‌ ఇండ్యూస్ట్‌ సిస్టమిక్‌ లూపస్‌
చిన్న పిల్లల్లో వచ్చే నియోనేటల్‌ లూపస్‌
ఎక్యుట్‌ క్యూటేనియస్‌ లూపస్‌

చికిత్స:💊💉
ఎండలకు దూరంగా ఉండాలి. ఎండలకు బయటకు వెళ్లేటప్పుడు సన్‌క్రీమ్‌లు వాడాలి. కీళ్లమీద విపరీతమైన ఒత్తిడి తీసుకురాకుండా వ్యాయామం, మంచి విశ్రాంతి అవసరం.వ్యాధి ప్రాథమిక దశలో చికిత్స చేయించుకోవాలి.రక్తహీనత లేకుండా చూసుకోవాలి.విశ్రాంతి తీసుకోవాలి.

ప్రస్తుత కరోనా కష్టకాలంలో లూపస్‌తో పాటు ఇతర ఆటో ఇమ్యూన్‌ వ్యాధులతో బాధపడేవారు కరోనా సంక్రమణను నివారించడానికి జాగ్రత్తలు పాటించాలి

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling