H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture
AndhraPradesh #AreKatika Sangh State Secretary #Khatik ఆంధ్రప్రదేశ్ #ఆరెకటిక సంఘం రాష్ట్రకార్యదర్శి.

Jun 29, 2021, 12 tweets

#WorldIndustrialDesignDay #WIDD

పారిశ్రామిక రూపకల్పన దినోత్సవం జూన్ 29న ప్రపంచ రూపకల్పన సంస్థ స్థాపనకు గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం.సంస్థ యొక్క 50 వ వార్షికోత్సవం సందర్భంగా 2007 లో ప్రారంభించారు. #IndustrialDesignDay
#industrialdesign

పారిశ్రామిక రూపకల్పన ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను భారీ వస్తువుల ఉత్పత్తికి తయారుచేయడానికి ఉపయోగిస్తారు. ఉత్పత్తి కన్నా ముందే రూపకల్పన ప్రక్రియ మొదలవుతుంది, వస్తువు రూపం, లక్షణాలు, ముందుగా నిర్వచించి దానికి కంప్యూటరీకరణ చెయ్యాలి.

అన్ని ఉత్పత్తి చేసిన వస్తువులు కూడా రూపకల్పన పర్యావసానమే. ఇది వ్యక్తిగతంగానూ, సమూహములోను చెయ్యవచ్చు. సమూహములో చెయ్యడం వలన వివిధ రంగాలలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల జ్ఞానము, విజ్ఞానము ఉపయోగించవచ్చు ఉదాహరణ గా పారిశ్రామిక రంగంలో రూపకర్తలు, ఇంజనీర్లు , వ్యాపార రంగంలో నైపుణ్యంకు

సంభందించిన వ్యక్తులను చెప్పవచ్చును.
అంతర్గతంగా ఉన్నటువంటి సృజనాత్మకత శాస్త్రీయ నిర్ణయం, నిర్ణయికరణ వంటి విషయాలు పారిశ్రామిక రూపకల్పనకు చర్చిస్తుంది. వస్తువులు, ఉత్పత్తి ప్రక్రియను, వ్యాపార వ్యూహము లు, సామాజిక వ్యాపార అంశములు దీనిని ప్రభావితం చేస్తాయి. పారిశ్రామిక రూపకల్పన అనేది,

వినియోగదారుని ( కస్టమర్) అవసరాలు కలబోత, అంతేకాకుండా పారిశ్రామిక రూపకల్పన అనేది మార్కెటింగ్ లో ఉన్న రవాణా , ప్రకటనలు , ప్యాకేజి ఉన్న సమస్యలు తెలుసుకోవడం ,వాటికి పరిష్కారం చూపిస్తుంది.

పారిశ్రామికీకరణ కొన్ని వేల సంవత్సరాల ముందే పారిశ్రామిక రూపకల్పన శాస్త్రీయ నైపుణ్యం ఉత్పత్తి వంటి విషయాలను హస్తకళాకారులు ఉపయోగించేవారు అయితే హస్తకళాకారులు వారి నైపుణ్యను వినియోగదారుని నైపుణ్యంను ,వారు పొందిన శిక్షణ ద్వారా వస్తువు రూపాన్ని చక్కగా తీర్చిదిద్దే వాళ్ళు.

శ్రమ విభజన అనేది వస్తువు పారిశ్రామికీకరణ ముందే ఉండేది మధ్యయుగంలో వర్తక వాణిజ్యాల వలన పెద్దపెద్ద కార్యశాల లు ఫ్లోరెన్స్ వెనిస్ వంటి నగరాలలో వెలిశాయి ఈ కార్య శాలలో హస్తకళాకారులు అందరూ ఒక సమూహంగా ఏర్పడి వారి వారి నైపుణ్యం శిక్షణ 16వ శతాబ్దంలో పోటీ తత్వం పెరగడం వలన

ఇటలీ ,జర్మనీ దేశాలలో చెక్కిన అలంకరణ తో కూడిన వస్తువులు మార్కెట్లోకి వచ్చాయి చిత్రీకరణ ఉపయోగం ఇటలీలో సాంస్కృతిక పునరుజ్జీవనం వలన ప్రాచుర్యంలోకి వచ్చింది 17వ శతాబ్దంలో ఫ్రాన్స్ లో 1617 లో ప్రభుత్వరంగ ఉత్పత్తి సమస్త ఏర్పడింది దీనిలో హస్తకళాకారులు చిత్రకారులు ఆర్టిస్టులు

అలంకరణ శిల్ప మంచి అలంకరణ తో కూడిన వస్తువును ఉత్పత్తి చేశారు దీనికి అప్పటి రాజుల మద్దతు ఉండేది.

పారిశ్రామిక రూపకల్పన అనేది పారిశ్రామికీకరణ వలన బాగా అభివృద్ధి చెందింది ఇది గ్రేట్ బ్రిటన్లో 18వ శతాబ్దంలో మధ్యలో ఏర్పడిన పారిశ్రామిక విప్లవం వలన సాధ్యమయింది పట్టణీకరణ వల్ల వైవిధ్యపూరితమైన మార్కెట్ మరియు మధ్యతరగతి అవసరాలు జీవన విధానం కొత్త రంగాల వస్తువుల ఉత్పత్తులకు తోడ్పడ్డాయి.

మొట్టమొదటి సరిగా పారిశ్రామిక రూపకల్పన అనే పదం 1919లో జోసఫ్ కార్ల్ అనే వ్యక్తి ఉపయోగించాడు. క్రిస్టోఫర్ డ్రసెర్ అనే ఈయన మొట్టమొదట పారిశ్రామిక పరిశ్రమల రూపకర్త. జర్మనీ దేశంలో 1907 సంవత్సరంలో “ డ్యూషర్ వర్క్ బ్యాండ్ “ అనే సంస్థను ఏర్పాటు చేశారు.

దీని ముఖ్య ఉద్దేశ్యం సాంప్రదాయక హస్తకళాకారులను, పారిశ్రామిక వస్తువు ఉత్పత్తిని సమ్ములితం చేయడం జర్మనీ,అమెరికా వంటి దేశాలతో పోటీపడటం.
#IndustrialDesignDay

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling