#KebabDay #kebab #kabab
కబాబ్ అంటే గతంలో మటన్‌తో చేసేది అని అర్థం. ఇప్పుడు చికెన్ కబాబ్... ప్రాన్స్ కబాబ్ అని రకరకాల కబాబులు రెడీ అయిపోతున్నాయి. పూర్తి స్థాయి వంట చేసుకోవడానికి వీల్లేని రోజుల్లో సైనికులు మాంసాన్ని ఎండబెట్టి దాచుకొని అప్పటికప్పుడు నిప్పుల్లో కాల్చుకొని తినేవారు.
ఈ ఎండు మాంసమే కబాబ్ మారింది. ఇప్పుడు ఇన్‌స్టాంట్ కబాబులు వడ్డిస్తున్నారు. నాన్‌వెజ్‌లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువా కాకపోయినా కబాబ్‌లకు రాచరికపు హోదా దక్కింది. కబాబ్‌లు వడ్డించారంటే అదో పెద్ద హోదా కిందే ఇప్పటికీ. కబాబ్ ను ఏ సందర్భంలోనైనా తయారు చేసుకోవచ్చు.
ముఖ్యంగా వర్షాకాలంలో వేజిటేరియన్ స్నాక్స్ తో పాటు, కబాబ్ లు కూడా చాలా ప్రసిద్ధి. వర్షాకాలంలో నోటికి రుచికరంగా వేడి వేడిగా కబాబ్ తింటే ఎలా ఉంటుంది. చాలా మందికి మాంసాహార ప్రియులు కబాబ్ లను ఇష్టపడుతారు.
అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఈ కబాబ్ ను ఒక్కో రకంగా వండుతారు.
రుచి కూడా వేరుగా ఉంటుంది. అయితే ఏ ఊరిలో ఏ రకమైన కబాబ్ దొరుకుతుందన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. మీ టూర్ సందర్భంగా అక్కడికి వెళ్లినప్పుడు మీరు మాంసం ప్రియులైతే తప్పక ఆ కబాబ్ ను రుచి చూడండి. #kebablovers
1. హైదరాబాద్
పర్యాటక రంగంలో హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం ఉంది. అదే విధంగా హైదరాబాద్ ఫుడ్ హబ్. ఇక్కడ దొరికినన్ని ఫుడ్ వెరేటీలు మరెక్కడా దొరకదు. ముఖ్యంగా నాన్ వెజ్ విషయానికి సంబంధించి హైదబాద్ మొదటి వరుసలో ఉంటుంది. అందులోనూ హైదరాబాద్ బిర్యాని ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచింది.
అదే సమయంలో ఇక్కడ దొరికే శేఖ్ కబాబ్ గురించి కూడా చెప్పుకోవాలి. మిగిలిన కాబాబ్ ల తయ్యారికి తవ్వాను వినియోగిస్తే ఈ కబాబ్ తయ్యారికీ తందూర్ పొయ్యిని వినియోగిస్తారు. ఈ కబాబ్ ప్రతి బైట్ కూడా ఎంతో రుచిగా ఉంటుంది.
2. లక్నో
లక్నోను నవాబుల సిటీ అని అంటారు. ఇక్కడ ఉన్న వివిధ పర్యకాటక ప్రదేశాలు దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దీంతో ఆతిథ్యం రంగం కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా లక్కోకు వచ్చిన వారు బిర్యాని కంటే అక్కడ దొరికే ప్రత్యేకమైన కబాబ్ అంటేనే ఎక్కువగా
ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా తుండే కబాబ్ ఇక్కడ చాలా ఫేమస్. మాంసాన్ని తవ్వా పై ప్రత్యేక పద్దతిలో ఎర్రగా కాల్చి పుదీనా చెట్నిలో తింటూ ఉండటం మరిచిపోలేని అనుభూతి
3. కొలకత్తా
కొలకత్త చేపల కూరకు చాలా ఫేమస్. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ నగరంలో వివిధ రకాల చేపలు దొరుకుతాయి. దీంతో వాటితో వండే వంటకాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. అందువల్లే కొలకత్తాకు వెళ్లిన వారు చేపల కూరతో భోజనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోరు.
ఈ క్రమంలోనే ఫిష్ కబాబ్ చాలా ప్రత్యేకం. ఈ ఫిష్ కబాబ్ స్ట్రీట్ ఫుడ్ నుంచి మొదలుకొని ఫైవ్ స్టార్ హోటల్స్ వరకూ దొరుకుతుంది.
5. ముంబై
ముంబై అంటే వెంటనే అందరికీ గుర్తుకు వచ్చేది కేవలం వడా పావ్ మాత్రమే. అయితే ముంబై కూడా నాన్ వెజ్ ప్రియుల కోసం ఎన్నో వెరేటీల ఢిష్ లను రెడీ చేస్తుంది. ఇందులో ముఖ్యంగా చెప్పకోవలసింది. కబాబ్.
ఇక్కడ దొరికే కబాబ్ దేశంలో మరెక్కడా దొరకదు. అది ముంబై కబాబ్ అనే పేరుతోనే చాలా ఫేమస్. మరెందుకు ఆలస్యం ముంబై వెళ్లినప్పుడు తప్పక ఈ ముంబై కబాబ్ లను తినండి.
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.