#GlobalEnergyIndependenceDay
స్థిరమైన మరియు పరిశుభ్రమైన శక్తి ఉత్పాదనకోసం సౌరశక్తి, గాలి, మొక్కలు, నీరు వంటి తరగని ప్రాకృతిక వనరులను పునర్వినియోగ ఇంధనంగా వినియోగిస్తారు. దీనిలో ఇమిడి ఉన్న పర్యావరణ మరియు ఆర్థిక ప్రయోజనాలు:
#GlobalEnergy
♻️🌀🌊☢️🌞
♻️గ్రీన్ హౌస్ వాయు రహితంగా మరియు వాయు కాలుష్యం తగ్గిస్తూ ఇంధన ఉత్పాదన.
♻️ ఇంధన దిగుమతులపై ఆధారపడడాన్ని ఇంధన వైవిధ్యం తగ్గిస్తుంది.
♻️ఆర్థిక అభివృద్ధి మరియు మ్యాన్ఫ్యాక్చరింగ్, ఇనస్టలేషన్ ఇతరత్రా ఉద్యోగాలు.
పునర్వినియోగ ఇంధన వనరులు
🌞సౌరశక్తి అనేది సూర్య కాంతిని వినియోగించుకుని చేసే విద్యుచ్ఛక్తి. దీనిని వేడి పుట్టించడానికి, నీళ్లను మరిగించడానికి, చల్లబరచడానికి వాడవచ్చు. ఇంకా పలు విధాలైన వాణిజ్య, పారిశ్రామిక అవసరాలను తీర్చుకోవచ్చు.
🌀పవన విద్యుత్ అనేది గాలినే ఇంధనంగా వాడుకుని ఉత్పత్తి చేసే విద్యుచ్ఛక్తి. దీనిని విద్యుదుత్పాదనకు, బ్యాటరీ చార్జింగ్, నీటి పంపింగ్ మరియు పిండి మరకు వాడుకోవచ్చు. భారీ స్థాయిలో గ్రిడ్ విద్యుదుత్పాదనకు వీలుగా దగ్గర దగ్గరలోనే చాలా టర్బయిన్లను ఏర్పాటు చేస్తారు.
♻️బయోమాస్ ఇంధనం అనేది మొక్కలు, వ్యవసాయ, అటవీ వ్యర్థాలు మరియు మునిసిపల్, పారిశ్రామిక చెత్త ద్వారా తయారయ్యే విద్యుచ్ఛక్తి. ఉదాహరణకు, వేలాది ఏళ్లుగా చెక్కను వేడి నిమిత్తం వినియోగిస్తున్నాము.
🌊☢️జల విద్యుత్ అనేది నీటి ప్రవాహంద్వారా తయారయ్యే విద్యుచ్ఛక్తి. భారీ, చిన్నతరహా జల విద్యుదుత్పాదనకు సాంకేతికత అందుబాటులో ఉంది.
♻️జియో-థర్మల్ ఇంధనం అనేది భూమి నుంచి వెలువడే ఉస్ణ వాయువులద్వారా సేకరించు విద్యుచ్ఛక్తి. భూమి ఉపరితలం నుంచి కొన్ని మైళ్ల దిగువన ఉష్ణ జలాలు, ఉష్ణ రాతిబండలను కనుగొనడమైంది.
🌊🌀సముద్ర ఇంధనం అనేది రెండు విధాలైన శక్తి సూర్యుని ద్వారా వెలువడే థర్మల్ శక్తి మరియు అలలు, తరంగాలు నుండి వెలువడే మెకానికల్ శక్తి. భూ ఉపరితలం దాదాపు 70 శాతం సముద్రాలతో నిండి ఉంది. ప్రపంచంలోనే సౌరశక్తిని స్వీకరించే అతి పెద్ద కేంద్రాలు సముద్రాలు.
సౌర శక్తి ద్వారా సముద్ర ఉపరితలంలోని జలాలు వేడెక్కుతాయి. సాగర అంతర జలాలకంటే ఇవి వేడిగా ఉంటాయి. ఉష్ణోగ్రతలోని ఈ తేడా ద్వారా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
ఇటీవలె ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చడంలో విశేష కృషి చేసినందుకు గానూ భారత ప్రధాని శ్రీ.నరేంద్రమోడీ గారిని సెరావిక్ గ్లోబల్ ఎనర్జీ ఎన్వరాన్మెంట్ లీడర్ షిప్ అవార్డు తో గౌరవించిన అమెరికన్-బ్రిటీష్ IT దిగ్గజ సంస్థ ఇన్ఫర్మేషన్ హ్యాండలింగ్ సర్వీస్ (IHS) మార్కిట్ సంస్థ #TransformingIndia
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.